ఆలోచించాల్సిన విషయాలే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆలోచించాల్సిన విషయాలే లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27 జులై, 2019

" జీవితంలో ఒకరే భాగస్వామి అనే రోజులు పోయాయా ? "



" జీవితంలో ఒకరే భాగస్వామి అనే రోజులు పోయాయా ? " అనే ప్రశ్నకు సమాధానమిస్తూ వివాహ వ్యవస్థ గురించీ , దాని ఆవశ్యకత గురించి , ప్రస్తుత కాలంలో వైవాహిక సంబంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి ? అనే వివరణలతో సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు ఇచ్చిన సహేతుకమైన సమాధానమిది






10 అక్టోబర్, 2017

#SayNoToDowry



అసలు పెళ్ళి అంటే ఏమిటి? 

" ఇద్దరు వ్యక్తులు మేము జీవితాంతం ఒకరికొకరు తోడూనీడగా ఉంటూ,, ధర్మబద్ధంగా సహజీవనం సాగిస్తూ చక్కటి కుటుంబాన్నీ,, తద్వారా ఓ ఆరోగ్యకరమైన,, నైతికపరమైన సమాజాన్ని ఏర్పర్చడంలో మావంతు పాత్ర మేము పోషిస్తాము " అని అందరికీ తెలియచెప్పడమేగా పెళ్ళి చేసుకోవడం అంటే...!!!

అలా పరస్పరం కలిసి లైఫ్ని బాగా లీడ్ చేసుకుంటామని భావించి చేసుకొనే పెళ్ళికి కట్నం తీసుకోవడం అవసరమా బాస్? ఆలోచించు 👀

ఆమెని పెళ్ళి చేసుకొనేందుకు నువ్వలా డబ్బులు పుచ్చుకొంటున్నావంటే అందులో ప్రేమా, సమానత్వం ఎక్కడుంది చెప్పు బ్రదర్ ?? - కేవలం అమ్మకం కొనుగోలే ఉంది తప్ప అందులో 🙅

అయినా ఒకటాలోచించు,, 

ఎవరో నీకో విలువ నిర్ణయించి ఆ నిర్ణీతమైన ధరను ఏదో అమ్మబోయే సరుకుకి బేరం చెప్తున్నట్లు ' ఇంతైతేనే మావాడిని మీ పిల్లకిచ్చి పెళ్ళి చేసేందుకు ఒప్పుకుంటాం, లేకపోతే లేదు ' అని మీవాళ్ళు అవతలివారితో మాట్లాడుతూంటే సిగ్గనిపించదా ‌నీకు ?? 😠

ఆత్మాభిమానం, స్వీయ గౌరవం ఉన్న ఏ వ్యక్తైనా ఎవరో తనకి ఓ కనీస విలువ నిర్ణయించడాన్ని ఒప్పుకుంటాడా అసలు? ఒప్పుకుని మరొకరి సొమ్ము అయాచితంగా స్వీకరిస్తూ తనని తాను అమ్ముడవ్వడానికి సిద్ధపడతాడా?? 😡😡

ఆలోచించు ....!!!

- Kks Kiran

Dont Follow Majority, Follow The Right Way



' వేసిన దారంట వెళ్ళిపోవడం సులభమూ పదిలమూ.... నలుగురికీ తెలిసింది చిరకాలం నుంచీ నలిగిందీ ఒక దారి సిద్ధంగా సుప్రసిద్ధంగా ఉంటూనే ఉన్నప్పుడు మరో కొత్త దారి వెతకడం అవివేకం,, ప్రమాదం ' అని అడ్డు చెప్తూ నిరుత్సాహపర్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం సత్యాన్వేషకుడినీ,, సంస్కర్తలనూ వారి మొదటి ప్రయత్నం నుంచీ 👊

ఆ వాదన నిజమని అనిపించినా ఒక్కోసారి ఆ పరిధి దాటి ఆలోచించిస్తే కానీ అర్ధం‌కాదు ఈ నూతనత్వం యొక్క ఉద్దేశమూ, ప్రభావమూ ఏమిటో అని....

పురోగమనానికి కొత్త దారులే రాచబాటలు . అలుపులేని అన్వేషణ గతానుగతికత్వాన్ని సహించలేదు...

కాలిబాటలోనే మానవుడు తృప్తి పడిపోయుంటే విమానయానాలు సాధ్యమై ఉండేవి కాదు కదా?  😳 "

- Kks Kiran

సాహితీలోకంలో ప్రధానలోపం



సరుకు లేకుండా సర్వజ్ఞత ప్రదర్శించడం సాహిత్యంలో ఉన్నంతగా మరెక్కడా లేదు

- Kks Kiran

అసలైన విద్య యొక్క లక్షణమేంటంటే?


ఉద్యోగం చేసేందుకో ,, లేక కేవలం ఉపాధి కల్పనకో ఉపయోగపడే విద్య విద్యే కాదసలు 👎

విద్య వల్ల వ్యక్తికి సంస్కారమూ,, స్వంత తెలివీ,, సృజనాత్మకత అలవడాలి 👍

అవి కలగజేయకుండా కేవలం విషయజ్ఞానాన్ని నేర్పే చదువు చదువే కాదు సరికదా అలాంటి పాండిత్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి పుస్తకాల బరువుతో ఉన్న భారమైన గాడిదతో సమానం 👅

- Kks Kiran

10 ఆగస్టు, 2017

పాఠకులకి నాదో సలహా


కొన్నికొన్నిసార్లు మన జీవితానికీ , ఆలోచనావిధానానికి పరస్పర విరుద్ధంగా ఉన్న వాదాలు వినడం కానీ చదవడం కానీ అలవాటు చేసుకోండి

దానివల్ల మనం నమ్మి అనుసరించే విషయాలలో లోతెంతో తెలిసి వాటిని పాటించాలా వద్దా? అనే విచక్షణ కలుగుతుంది,,

దానివల్ల మనలని మనం సంస్కరించుకోవడం సాధ్యమౌతుంది 

- Kks Kiran

28 మే, 2017

బ్లాక్ టికెట్ వ్యవస్థ దోపిడీ గురించి

నిన్న సాయంత్రం పిఠాపురంలోని ఓ ధియేటర్లో బాహుబలి మూవీ చూడడానికని వెళ్ళాను... టికెట్ కౌంటర్ దగ్గరకి వెళ్ళి ' బాల్కనీ టికట్ ఒకటి ఇమ్మని ' అడిగితే అతను టికట్ చింపి ఇస్తూ " 200 సార్ " అన్నాడు... సరేనని రెండొందలు తీసిచ్చి టికట్ తీసుకున్నాను... తీరా చూస్తే టికట్ పైన దాని రేట్ 40 రూపాయలుగా మాత్రమే ఉంది.

అది చూసి " దీనిపైన 40 రూపాయల ధరగా ఉంటే మీరేంటి నా దగ్గర 200 తీసుకున్నారు? " అని ప్రశ్నించాను నేనతనిని...

" గవర్న్మెంట్ రేట్లు పెంచుకోమని చెప్పింది సార్ ఈ సినిమాకి... మొన్నటి వరకూ ఒక్కో టికట్టూ 300కి అమ్మాము ... ఇప్పుడు నెలదాటిపోతోంది కదా అని 200 తీసుకున్నాము ,, అంతే సార్...!!! " అని ' ఇది చాలా రీజనబుల్ ఇష్యూ ' అన్నట్లు సమాధానం చెప్పాడు నాకు ఆ కౌంటర్లోని వ్యక్తి...

" నాకు తెలిసి గవర్న్మెంట్ కాకుండా హైకోర్ట్ కదూ ఈ తీర్పు జారీ చేసింది? అది కూడా 20 శాతమో, ముప్పై శాతమో టికట్ రేట్ పెంచుకోమని ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తు. కానీ మీరేంటి దానికి విరుద్ధంగా ఐదు రెట్లు టికట్ ధరని పెంచి అమ్ముతున్నారిలా ? " అని అడిగాను నేను అంతే రీజనబుల్గా....

" లేదు సార్, గవర్న్మెంట్ మాకే వదిలేసింది ఆ చాయిస్ని ఎంతకి టికట్ని అమ్మాలి? అనే విషయమై,, హై బడ్జట్ సినిమా కదాండి? అందుకే ఈ రేటుకి అమ్ముతున్నాము మేము " అని ' చాలా నిజాయితిగా వ్యవరిస్తున్నాము ఈ విషయంలో' అనే ధోరణితో సమాధానమిచ్చాడు అతను నా ప్రశ్నకి..

" మరి అలాంటప్పుడు ' ఈ టికట్ ధర ఇంత ' అని వీటిపై మీరమ్మే ధర ఎందుకు ముద్రించలేదు ? ఇది సరైన విధానం కాదు కదా మరి ? " అన్నాను నేను..

" అవి పాత టికట్లు సార్... మిగిలిపోయినవి ఏం చేసుకోమంటారు? ఉత్తినే చెత్తకుప్పపై పారబోయమంటారా? పాడేయడం ఎందుకని ఇలా ఇక్కడ వాడేస్తున్నాం " అని కాస్త అసహన ధోరణిని,, ' ఈ విషయం ఇక్కడితో తెమిలిపోతే బాగుండును ' అనే భావాన్నీ తన మాటల్లో నింపుకుని మాట్లాడాడు అతను నాతో.

" ఆహా...!!! చాలా బాగుంది... మరి ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేటప్పుడు ఒక్కో టికట్టూ 40 రూపాయలకి మాత్రమే అమ్మామని పన్ను కడతారా మీరు? లేక ఈ రెండొందలూ మూడందలకీ అమ్మామనే కడతారా? 

మీరే ధరకి అమ్మారో ప్రభుత్వానికేం తెలుస్తుంది ఈ చర్యవల్ల? అటు సరైన ధరని ప్రకటించకుండా సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుడినీ,, ఇటు సరైన పన్ను చెల్లించకుండా గవర్నమెంట్నీ మోసం చేస్తున్నారు మీరు... ఇది సరైన విధానమైతే  కాదు,, సరి చేసుకోండి " అని కాస్త మందలింపు ధోరణితో మాట్లాడానతనితో నేను...

మరి ఎందుకొచ్చిన గొడవనుకున్నాడో? లేక కళ్ళజోడు పెట్టుకొని సాఫ్ట్ కార్నర్లో మాట్లాడుతూ ఇలా లాజిక్గా మాట్లాడే ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండడమే మంచిదిలే అని అనుకుని అనుకున్నాడో? లేక నేనలా చాలా విషయాలు తెలిసినట్లు మాట్లాడడం చూసి ఏ వినియోగదార్ల చట్టం ప్రకారం కేస్ బుక్ చేస్తానని భయపడ్డాడో ఏమో అతను తెలీదు కానీ కాస్త తగ్గుడు ధోరణిలోకి దిగి డమ్మున్నర కుడుచుకుంటూ " సరే సార్,, 40కే తీసుకోండి మీరు టికట్ని " అని మిగతా డబ్బులు నాకు తిరిగి చెల్లించేశాడు...

నవ్వొచ్చింది నాకు... 

నాకు తెలిసినంతలో నా తర్వాత లైన్లో నించున్నవాళ్ళకి కూడా అతను నలభై రూపాయలకే టికట్లు ఇచ్చాడు.. ఆ తర్వాతి సంగతి నాకు తెలీదు కానీ కౌంటర్ని వదిలి నేనొచ్చేస్తూంటే నాపక్కనున్న వ్యక్తి ఒకాయన " మనమేం చెయ్యలేం సార్ ఈ విషయమై.... ఇది సామాన్యమైపోయింది మనందరికీ.. అందుకనే వాళ్ళిలా వాళ్ళకిష్టం వచ్చిన రేటుకి అమ్మేయగలుగుతున్నారు మనకి " అని అన్నాడు ...

"" అలా అని ఎందుకనుకోవాలండీ మనం? మనకున్న రైట్స్ని మనం క్వశ్చన్ చేయడం నేరమేమీ కాదు కదా? ఎవరో ఏదో అనుకుంటారేమో అనే సిగ్గూ ,, గొడవెందుకులే అనే సర్ధుబాటు ధోరణి మనం ప్రదర్శించడం వల్లే వీళ్ళిలా  ఇంత నిర్భీతిగా వాళ్ళకిష్టం వచ్చిన రేట్లకి అమ్మగలుగుతున్నారు కౌంటర్ దగ్గరే మనకి టికట్స్ని ఇంతింతలా రేట్లు పెంచి....

మనం ధియేటర్కి ఎంటర్టైన్మెంట్ పొందడానికొచ్చాం కానీ ఇలా దోచుకోబడడానికి రాలేదు కదా? టికట్ అనే వ్యవస్థ ఒకటి ప్రేక్షకుడికీ ధియేటర్ వోనర్కీ మధ్య చెల్లింపు వ్యవహారంగా ఉన్నప్పుడు మనం దానినే పాటించాలి కానీ దానికి సమాంతరంగా మరో దోపిడీ వ్యవస్థని పోషించడమెందుకు?' పైగా అది సహజమే ' అని సర్దుకుపోవడం ఎందుకు? 

మనమడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? లేదు కదా?? మరి మన తప్పేమీ లేనప్పుడు మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచి ప్రశ్నించడానికి ఎందుకు సంకోచించాలి మనం???

అందుకే ఆ కౌంటర్లో ఉన్న వ్యక్తిని గట్టిగా క్వశ్చన్ చేసేసరికి మన మాటలలోని నిజాయితీకి సమాధానం సరిగ్గా చెప్పలేక తత్తరపడి సరైన ధరకి టికట్లు ఇచ్చాడు మనకి... 

నా సంగతి పక్కనెడితే మీరు మీ కుటుంబంతో వచ్చారు కదా? మొత్తం నలుగురు సభ్యులకి ఇలా ప్రశ్నించకుండా ఉండుంటే 800 రూపాయలు అప్పనంగా చెల్లించి సినిమా చూసేవాళ్ళు... ఇప్పుడు అదే సినిమాని మీరు కేవలం 160 రూపాయలు చెల్లించి ఆనందించగలరు...

తేడా ఉందంటారా లేదంటారా? అదేమీ చిన్న విషయం కాదు కదా?? అని నేనంటే ఒప్పుకోలు ధోరణితో నవ్వుతూ నా భుజం తట్టి వెళ్ళిపోయారాయన :)

-  Kks Kiran​

08 ఏప్రిల్, 2017

Stop Racism


"" మన సమాజంలోని చాలామంది మనుషులలో " సాటి మనిషిని మనిషిగా గుర్తించి అతనిపట్ల సరైన గౌరవభావంతో ప్రవర్తించడం , అలాగే ఎదుటి వ్యక్తితో మనస్పూర్తిగా,, ఏవిధమైన ఆధిక్యతా భావం లేకుండా ఆహ్వానించి మాట్లాడగల మనోసంస్కారం ఉన్న వ్యక్తులు తక్కువ 😏

పెద్ద కారణంగా మనకెప్పుడూ ఇది కనపడదు కానీ సమాజంలోని అనేకానేక మానసికరుగ్మతలకీ,, వివక్షలకూ,, అభివృద్ధిపరమైన అణిచివేతలకూ ఇదే పెద్ద కారణం అవుతోంది "" అని నా అభిప్రాయం 😒

మీరేమంటారు దీనిగురించి?

- Kks Kiran

గౌరవం అనేది వ్యక్తికి కానీ అతను / ఆమె అనే లింగబేధంవల్ల కాదు


"" ప్రతీ మనిషికి తనకంటూ కొన్ని అభిప్రాయాలు,, ఆలోచనా విధానమూ,, జీవితంపట్ల ఓ దృక్పథమూ ఉంటుంది.. ఆ విషయాన్ని గుర్తెరెగి అవతలి వ్యక్తితో అందుకు తగ్గట్లుగా గౌరవం ఇస్తూ మసులుకోవడమే ఏ మనిషైనా మరో మనిషికి ఇవ్వగలిగే గొప్ప బహుమతి "" అని నా అభిప్రాయం...

అందుకే నా మటుకు నేనైతే కేవలం వ్యక్తికే గౌరవం ఇస్తానుకానీ అతను/ఆమె అనే జెండర్ ని బట్టి కాదు

అందుకే స్త్రీ సాధికారిత గురించి,, స్త్రీ స్వేచ్ఛ గురించీ ఊకదంపుడు వ్యాసాలు ఏవీ రాయలేదు నేనీరోజు చాలామందిలా ఆవేశపడుతూ నీతులు చెప్పి

_/\_ _/\_ _/\_ 

- Kks Kiran

07 ఏప్రిల్, 2017

మూర్ఖులూ - మార్కులూ


"" మార్కులు మూర్ఖులకైనా వస్తాయి... విజ్ఞానం విజ్ఞులకే వస్తుంది ""

( ఎక్జాంస్ దగ్గర పడుతున్నాయని భయపడుతున్న ఓ పిల్లోడికి అనునయంగా ధైర్యం చెప్తూ ఈ వాక్యాన్ని ఇందాక ఉద్భోదించానిలా నేను 😜 😜 😜 )

- Kks Kiran

తప్పెవరిది?


మొన్న రాత్రి 12.30 కి మా ఊళ్ళో ఉన్న ఓ ధియేటర్లో కాటమరాయుడు మూవీ బెన్ ఫిట్ షో వేస్తారని తెలిసి జనాలు తండోపతండాలుగా ఆ ధియేటర్ దగ్గరకి వెళ్ళి టికట్ల కోసమై ఎగబడ్డారు..

తమ సంస్కారాన్ని మరచిపోయి ఒకరినొకరు తోసుకుంటూ,, ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటూ,, తిట్టుకుంటూ క్యూ లైన్ల దగ్గర పడిగాపులు పడుతూ ఉన్న ఆ జనాల వెర్రిని చూసిన ఆ ధియేటర్ యజమానికి ఎక్కడలేని ఉత్సాహమూ,, సంతోషమూ కలిగిందేమో...!!! ఆ సందర్భంగా ఒక్కో టికట్టూ కౌంటర్ దగ్గరే 400 రూపాయల ధరగా నిర్ణయించి అమ్మారు...

" 20 రూపాయల టికెట్ని దానికి 20 రెట్లు పెంచి ఇలా అమ్మడం అన్యాయం కదా? ఇటు సినిమా చూసిన ప్రేక్షకుడినీ,, అటు సరైనా టాక్స్ కట్టకుండా గవర్నమెంటునూ మోసం చేసినట్లు అవుతుంది కదా ఈ చర్యవల్ల? " అని గట్టిగా కాకపోయినా కనీస ప్రశ్న కూడా వేసే వ్యక్తి ఒక్కరూ లేరక్కడ... " టికెట్ ఏదోవిధంగా సాధించి ఈ షోని ఎలాగైనా అందరికంటే ముందే చూసేయాలి " అనే అర్ధంలేనిలేని ఆత్రం, ఆరాటం ఉన్న వ్యక్తులే ఉన్నారు మొత్తం అక్కడ.. అలాంటివాళ్ళు అడుగుతారా ఈ ప్రశ్నలని?? అసలు వాళ్ళకంత ఆలోచన రాదనుకుంట ఆ సామాజిక ఉద్రేక పరీస్థితులలో...

పైకి సూటిగా చెప్పకపోయినా ' తెలివైనవాడెప్పుడూ తెలివితక్కువైనవాళ్ళ మూర్ఖత్వాన్నీ ,, బలహీనతలనూ ,, నమ్మకాలనూ,, వెర్రినీ తనకనుగుణంగా మార్చుకుని లాభపడతాడు ' అని చెప్తాయి వాణిజ్యశాస్త్రాలు... ఆ సూత్రాన్ని నిజం చేసేట్టు ఆ ధియేటర్ యాజమాన్యం మొత్తం 2000 మందికిపైనే టికట్లను అమ్మి లాభపడే ప్రయత్నం చేసింది మనసులో విపరీతమైన ఆనందాన్ని అనుభవిస్తూ..

అదే వారిపాలిట శాపమైంది పాపం..!!!

12.30 కి వేస్తానన్న షో గంటైనా ఇంకా మొదలవ్వకపోయేసరికి మొదట ప్రేక్షకులలో అసహనం మొదలైంది.. గట్టిగా గోలలు చేస్తూ,, ధియేటర్ వాళ్ళను బండబూతులు తిడుతూ కేకలెయ్యడం మొదలెట్టారు వాళ్ళు ఈ ఆలస్యవ్యవధిని మేము భరించలేమన్నట్లు...

ఇంకో గంట గడిచింది... అయినా మూవీ వెయ్యకుండా ఆ సినిమా బదులు చిరంజీవి నటించిన " ఖైదీ నం.150 " మూవీ వేసేసరికి ప్రేక్షకుల సహనానికి హద్దులు తెగిపోయి ధియేటర్ వాళ్లతో వాగ్వాదానికి దిగారు " ఆ సినిమా కాక ఈ సినిమా వేస్తున్నారేమిటి? " ఇప్పుడని...

" ఆ సినిమా ప్రింట్ మాకింకా రాలేదు,, అందుకే దానిబదులు అందాక ఇది వేస్తున్నాం " అని క్షమార్ధనా భావాన్ని మాటల్లో నింపుకుని ప్రేక్షకులకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసాడు ఆ ధియేటర్ ఓనరు..

అదే అతను చేసిన పెద్ద తప్పైంది... ఎందుకంటే,,

" విపరీతమైన ఆశలు పెంచుకున్న ఓ విషయం తాననుకున్నట్లు నెరవేరకపోతే మనిషికి అయితే భరించేలేని నిరాశైనా కలుగుతుంది లేదా విపరీతమైన విసుగు కలిగి తాననుకున్న పనిని సఫలీకృతం కానివ్వకుండా చేసిన పరిస్థితులపై తిరుగుబాటు చెయ్యాలన్న తెగింపును తీసుకొస్తుంది "... 

దురదృష్టవశాత్తూ ఇక్కడ వ్యక్తులు ఒకరు కాదు.. కొన్ని వందలమంది..

దాంతో అదో బలమైన ఉద్యమోద్రేకస్థితిగా అప్పటికప్పుడు పరిణామం చెంది ఆ ధియేటర్లోని బల్లలనూ,, కుర్చీలనూ,, సౌండ్ బాక్స్లనూ,, సినిమా తెరలనూ, ప్రొజెక్టర్లనూ ప్రేక్షకులు ధ్వంసం చేసి, చించి, పాడుచేసేంతవరకూ వరకూ చేరింది... ఆ తర్వాతెప్పుడో పోలీసులు వచ్చారేకానీ అప్పటికే జరగాల్సినంత ఆస్తినష్టం జరిగిపోయింది ఆ ధియేటర్లో...

ఈ భయోత్పాత సంఘటన గురించీ మా ఊర్లో నిన్న జనాలు చర్చించుకుంటూంటే దీనికి బాధ్యులుగా ఎవర్ని నిందించాలో నాకు సరిగ్గా అర్ధం కాలేదు..

" మొదటి ఆటే ఈ మూవీని చూసేయాలనే విపరీతమైన ఆర్దుదతో అక్కడకి చేరుకుని తమ వ్యక్తిత్వాన్నీ,, సంస్కారాన్ని మర్చిపోయేలా ప్రవర్తించిన ఆ ప్రేక్షకులది తప్పనాలా? 

లేక ఆశాపిశాచబద్ధుడై జనాలను దోచుకోచూసిన ఆ ధియేటర్ యజమానికి తగిన శాస్తే జరిగిందని సంతోషిస్తూ తప్పు అతనిదే అని అనాలా??

లేక విశ్వనాధ సత్యనారాయణగారు వాపోయినట్లు కధనందు కానీ , సంగీతమునందు కానీ ఓ నీతికానీ,, ఓ రసజ్ఞతకానీ లేక ఎంత అపభ్రంశముగా ప్రవర్తిస్తే అంత జనాకర్షణ పెరుగుతోందని వికారభినయాలు, వికారసంవిధానములు,, అసభ్యవేషములూ కధలలో కల్పించి ప్రజలలో దుష్టసంస్కారం ప్రబలింపచేస్తున్న సినిమావారిది తప్పనాలా??? "" అనే విషయం మాత్రం అస్సలర్ధం కాలేదు నాకు నిన్న..

మీరేమంటారు దీనిగురించి ?

- Kks Kiran

ఆలోచించాల్సిన విషయమే


" Ctrl + C ( Copy ) - Ctrl + V ( Paste ) "

పండగ శుభాకాంక్షలు అంటే ఇంతేనా??

దగ్గరవాళ్ళకో ఆత్మీయులకో స్నేహితులకో మనస్పూర్తిగా ఓ మాట సొంతంగా వ్యక్తీకరిస్తూ Wishes చెప్పలేనంత భావశూన్యత ఉన్న వ్యక్తులకి పండగలెందుకని గట్టిగా నేను ప్రశ్నిస్తున్నాను అద్యచ్చా 😤


06 ఫిబ్రవరి, 2017

జీవితం గురించి చలం మాటల్లో


" జీవితం అంటే అనుభవం.

గొప్ప అనుభవాలవైపు ప్రయాణించడమే జీవిత లక్ష్యం..

అనుభవాలను గొప్పగా,, గాఢంగా తీసుకోగలగడం అనేది మన హృదయపు సున్నితత్వం మీద,, స్వేచ్ఛ మీద,, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది "

పురుషాధిక్యతకు కారణమవుతున్న అంశాలేంటి?

పురుషాధిక్య భావన గురించి నేను రాసిన ఈ విశ్లేషణ చదివి నా తమ్ముడు నాకు ఇచ్చిన రిప్లై ఇది😊

" స్త్రీ ని ఇంప్రెస్ చెయ్యడానికి మగవాడు తప్పకుండా సెక్యూరిటీ ఫీలింగ్ చూపించాల్సి వస్తోంది ఎప్పుడూను,,

అదే ఆమెపై పురుషుడు అధికారం చూపడానికి కారణం అవుతుందేమో

అదీకాక స్త్రీకి ఏమీ తెలీదని ,, అన్నీ తానే చెప్పాలనుకునే అభిప్రాయంతో పురుషుడు ఉంటాడనుకుంట బహుశా

అందుకే పని ఉన్నా లేకపోయినా ఒక అమ్మాయి సమస్యలో ఉంటే మోటివేట్ చెయ్యాలని చూసే మగవాళ్ళు బోలెడుమందుంటారు...

అందుకు కూడా కారణం ఏంటో తెలుసా?

స్త్రీని ఓదారిస్తే అతని ఇగో సాటిస్ఫై అవ్వచ్చు,, అదీకాక ఆ రకమైన సెక్యూరిటీ ఫీలింగ్ ఆమెకి కలిగించి దగ్గరకావచ్చనే ఉద్దేశం అయ్యుంటుంది " అని అన్నాడు

ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏమిటి?

25 జనవరి, 2017

సామాజిక ఉద్రేకానికి మనిషిని పురిగొల్పే కారణం ఏమిటి?



మొన్నామధ్య జల్లికట్టుకై మంకుపట్టు పట్టి ఉద్యమాలు చేసారు,,

ఇప్పుడు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కావాలని ఉద్యమాలు చేస్తున్నారు, ,

ఇలాంటి ఉద్యమాలలో పాల్గునేవాళ్ళలో అసలెంతమంది " నిజంగా ఇది ఉద్యమం చెయ్యాల్సినంత బలమైన విషయమే " అని భావించి పాల్గొంటున్నారు?

వాళ్ళకి వాళ్ళుగా " సమస్య తీవ్రత ఇదీ " అని తెలుసుకుని అందుకు పరిష్కారంగా ఉద్యమించడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుని ఇలాంటి నిరసనలలో పాల్గుంటున్నారా? లేక ఎవడో ఏదో చెప్పిన విషయానికి అప్పటికప్పుడు ప్రభావితం అయి ఆ ఆ తాత్కాలిక ఆవేశంలో ఉద్యమిస్తున్నారా? లేక విపరీతమైన ఉద్రేకత నిండిఉండే ఇలాంటి వాటిల్లో పాల్గొన్నప్పుడు వయసు తాలూకు ఉత్సాహం సంతృప్తి చెందడంవల్ల ఊతమిస్తున్నారా ఇలాంటివాటికి?

ఏది కారణం అవుతోంది ఇలాంటి సామాజిక ఉద్రేకాలకి? తెలిస్తే వివరించగలరు

- Kks Kiran

24 జనవరి, 2017

తస్మాత్ జాగ్రత్త



" ముఖస్తుతికీ,, వెన్నుపోటుకీ పెద్దగా తేడా ఏం లేదు "


బాధ్యత లేని ప్రేమ ప్రేమే కాదు


" ప్రేమంటే ఇద్దరూ కలిసి ఊహాలోకంలో విహరించడం కాదు,,

ఈ లోకంలోనే ఆనందంగా బ్రతకడం ఎలా? అని తార్కికంగా ఆలోచిస్తూ దానిని ఇద్దరూ కలిసి అమలులో పెట్టడం 😜 " 

చివరగా ఓ ముక్క :- " బాధ్యత లేని ప్రేమ ప్రేమే కాదు, అది ఒట్టి కాలక్షేపం మాత్రమే "

- Kks Kiran

గొప్ప జీవనవిధానం ఏంటంటే?


" గొప్పగా బ్రతకడం అంటే సమాజం ఏదీ గొప్ప అనుకుంటుందో ఆ విధంగా నువ్వు బ్రతకడం కాదు...

నీకేది ఆనందాన్నీ సంతృప్తినీ ఇస్తుందో ఆ విధంగా నువ్వు బ్రతకగలగడం నిజమైన గొప్పదనం

నీ లైఫ్ నీకు నచ్చేలా ఉండాలి , , నువ్వు మెచ్చేలా ఉండాలి..

అదీ గొప్ప జీవనవిధానం అంటే "

( ఓ చాటింగ్ Conversationలో నేనన్న మాట ఇది...రాశాక ఇదేదో బానే ఉందని మీపై తోలేసా ఇలా 😜 ) 

- Kks Kiran

ఆలోచించాల్సిన విషయమే


"" తెలివైనవాడెప్పుడూ సామాన్యుడి మూర్ఖత్వాన్ని,,వెర్రినీ తనకనుకూలంగా మార్చుకుని లాభపడుతూ ఉంటాడు...

అలా లాభపడడం వాడి గొప్పతనమని వాడిని అభినందించాలో లేక మోసపోతున్నామని తెలిసీ పట్టనట్లు ప్రవర్తించే సామాన్యుడి అజ్ఞానం పై జాలిపడాలో అర్ధంకాదు ఒక్కోసారి ""

( దొరక్కదొరక్క దొరికిన ఖైదీ నంబర్ 150 మూవీ 20 టికెట్ని 150 రూపాయలకి కౌంటర్ దగ్గరే గొప్ప పోరాటాన్ని తప్పించుకుని సాధించాక నాకనిపించిన భావం ఇది 😒 )

- Kks Kiran