జీవితం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీవితం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22 ఏప్రిల్, 2020

ప్రేమలో విఫలమైతే ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి ?




" ప్రేమలో విఫలమైతే ఆ స్థితి నుండి ఎలా బయటపడాలి ? " అనే ప్రశ్నకు " Quora " లో నేను రాసిన సమాధానమిది - ఇది రెండేళ్ళ క్రితమే ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసాను - అప్పుడు చదవని వారికోసం మరలా పోస్ట్ చేస్తున్నాను - ఆసక్తి ఉంటే చదివి మీ అభిప్రాయం చెప్పండి 👇

"" తాము ఇష్టపడ్డ వ్యక్తి దక్కకపోవడం వల్ల లవ్ ఫేల్యూర్ అయిన వ్యక్తులు ఒకప్పుడు తమ చేతులను బ్లేడ్ లతో కోసుకోవడం,, విపరీతంగా ఏడవడం ,, సిగరేట్ - మందులాంటి వ్యసనాలకు బానిసకావడం, లేక బంధాలు అంటే నమ్మకం లేనట్లు మాట్లాడడం చేసేవారు.. మరీ డీప్ ఎమోషన్ తో బాధపడే వ్యక్తులైతే అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేవారు...

ఇప్పుడు ట్రెండ్ మారింది.. లవ్ ఫేల్యూర్ అయితే వెంటనే వాట్సాప్ స్టేటస్లు లను తరుచుగా సాడ్ గా అప్డేట్ చేయడం,, ఫేస్బుక్లో విషాదాన్ని వ్యక్తపరుచు వాక్యాలతో కూడిన పిక్స్ ని తమ వాల్పై షేర్ చేయడం చేస్తున్నారు ఇప్పటి జనాలు...

తరాలు మారి బాధను,, దానిని ప్రకటించే విధానాలలో మార్పు కొంత కలిగుండచ్చు కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ రెండూ శుద్ధ బొక్క పనులే.. ఏం ఉపయోగం వీటివల్ల? తాను బాధపడుతూ ఇది తెలిసిన ఆ ప్రేమించిన వ్యక్తినీ,, కుటుంబసభ్యులను ఏడిపించడం తప్ప??

********************************************************

నా ఈ వ్యాసాన్ని చదువుతున్న వ్యక్తులలో ఎవరైనా లవ్ ఫేల్యూర్ కాండిడేట్లు ఉంటే కనుక మీరనుకోవచ్చు,, " మనమెంతో ఇష్టపడి ,, కలిసి జీవితాన్ని పంచుకుంటే బాగుంటుంది అని ఆశించిన వ్యక్తి మనకి దక్కకపోతే ఆ బాధ వర్ణనాతీతం... ఎన్నున్నా ఏదో లోటుగా ఉన్నట్లు అనిపిస్తుంది జీవితానికి... నిన్నమొన్నటివరకూ " ఒకే ఆత్మ - రెండు జీవితాలు " అన్నట్లు ఉన్న వ్యక్తితో అకస్మాత్తుగా అపరిచితుల్లా ప్రవర్తించాలంటే ఎంత కష్టమైన పనో ?? నరకమనేది ప్రత్యక్షంగా ఇక్కడే అనుభవిస్తున్నట్లుంటుంది ఆ ఫీల్ " అని ..

నిజమే..

అది చాలా బాధాకరమైన విషయమే.. కాదనట్లేదు.. నేనూ అలాంటి కేసులెన్నో చూశాను.. అమ్మాయిల విషయం నాకంతగా తెలీదుకానీ అబ్బాయిల తాము ప్రేమించిన అమ్మాయి కొన్ని కారణాల వల్ల తమకి దక్కకపోతే వెక్కి వెక్కి ఏడవడం ప్రత్యక్షంగా నేనెరుగుదును నా ఫ్రెండ్స్ లో కొందరినలా చూడడంవల్ల...

వాళ్ళనప్పుడు ఎలా ఓదార్చాలో అర్ధమయ్యేది కాదు నాకు .. ఏం చెప్పి వారిని కుదుటపర్చాలో తెలిసేది కాదు... కళ్ళనిండా ఎర్రని జీరలతో,, బాధా - ఆందోళనతో కూడిన ఆలోచనలవల్ల నిద్రలేని రాత్రులెన్నో గడుపుతూ ఏ పనిపైనా ఆసక్తీ ,, శ్రద్ధా లేకుండా విచారమైన వదనంతో తేజోవిహీనమైనట్లు తయారయ్యే వాళ్ళను చూస్తే నిజంగానే ఒక్కోసారి భయమేసేది నాకు " వీళ్ళను ఒంటరిగా వదిలేస్తే ఏం అఘాయిత్యం చేసుకుంటారో " అని..

ఎంత గొప్ప బాధకైనా కాలమే మందనుకోండి.. కానీ ఆ కాలం భారంగా గడిస్తున్నట్లు అనిపించే ఆ కొంతకాలాన్ని గడపడమెలా ? మళ్ళీ ఆ బాధని మరచిపోయి సాధారణ జీవితంలోకి ప్రవేశించడం ఎలా? అనే ఇలాంటి అంశాలపై వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చేవాడిని నేను అప్పట్లో...

అవి మీకేమైనా ఉపయోగపడతాయనుకుంటే చదవండి ఇలా..

1. వాస్తవిక పరిస్థితులను అర్ధం చేసుకోగలగడానికి ప్రయత్నించండి .. మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప పీకేదేమీ ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించడానికి ట్రై చేయండి ... అలాగే మీ ఆ రిలేషన్ ముగిసేటప్పుడు కూడా కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి ... అంటే ఇంకెలాగో కలిసి బ్రతకడం‌ కుదరదని తెలిసినప్పుడు కనీసం అవతలి వ్యక్తికి భవిష్యత్తులో మీ విషయమై ఆలోచించినప్పుడు ఏ విధమైన బాధా లేకుండా " నువ్వు లేకపోయినా నా లైఫ్ ని నేను బానే లీడ్ చేయడానికి ప్రయత్నిస్తాలే నాశనమేదీ చేసుకోకుండా " అనే భావం కలిగేట్లు ప్రవర్తించండి... సాధ్యమైనంతవరకు ఒకరినొకరు నిందించుకోకుండా స్నేహితులుగానే విడిపోండి మనస్పూర్తిగా కారణాలు వివరించుకొని

దానివల్ల అవతలి వ్యక్తికి మీ పట్ల గిల్ట్ ఫీలింగ్ ఉండదు ... మీకూ అకస్మాత్తుగా విడిపోవడం కన్నా ఇలా మాట్లాడుకొని విడిపోవడం వల్ల అంత పెయిన్ ఉండకపోవచ్చు

2. కొన్ని రోజులు Social Media కి దూరంగా ఉండండి ,, అలాగే తన తాలూకు మెమోరీస్ ఏవీ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించకండి... తన తాలూకు చాటింగ్ కాన్వర్జేషన్స్ కానీ ఫొటోస్ కానీ డెలీట్ చేసేయండి.. దీనివల్ల తనని మళ్ళా మళ్ళా తల్చుకుని తల్చుకుని బాధపడడం సగానికి పైగా తగ్గచ్చు..

3. సంగీతం అస్సలు వినకండి... అది హ్యాపీ మూమెంట్ కి సంబంధించినదైనా బాధాకరమైనదైనా మళ్ళీ పాత గాయాన్ని లేపేదిలా ఉండవచ్చు

4. సాధ్యమైనంతవరకూ ఒంటరిగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి... మీకిష్టమైన పని ఎక్కువగా చేయండి.. బోలెడన్ని వ్యాపకాలు కల్పించుకోండి... ఎక్కువగా మనుష్యులమధ్య గడపండి.. మూడీగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి.. మీకెంత బాదున్నా అది మొహంలో కనపడకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి.. అలాగే ప్రతీ ఫ్రెండ్ గ్రూప్ లో నాలా ఇలా ఒకడు జీవితం గురించి మాట్లాడుతున్నట్లు ఉంటాడుగా? అలాంటి వాడితో ఏదో ఏడుస్తూ సానుభూతి పొందడానికన్నట్లు మాట్లాడకుండా ఇలా విశ్లేషణాత్మకంగా మాట్లాడడానికి ప్రయత్నించండి.. అది కాస్త ఉపశమనమనిపించి మీరు మీ బాధనుంచి తొందరగా కోలుకోడానికి ఉపయోగపడవచ్చు.

5. ప్రేమలో విఫలమైతే చాలామంది సినిమాటిక్ గా మందు తాగడమో,, సిగరెట్లు తాగడం లాంటి వ్యసనాలకు అలవాటుపడుతున్నారు మన జనరేషన్ లో .. దానికన్నా మనసుని దిటవపరుచుకునేందుకు మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.. అలాగే గడ్డాలు పెంచేసి సరైన తైలసంస్కారం లేకుండా జుట్టును వదిలేయకుండా చక్కగా క్లీన్ షేవ్ చేసుకుని అద్దంలో మిమ్మలని మీరు చూసుకుంటూ నవ్వడానికి ప్రయత్నించండి.. అలాగే శరీరాన్ని ఉత్తేజపరిచేలా ఏ జిం లోనో జాయిన్ అయ్యి చక్కగా వర్కవుట్స్ చేయండి..

6. వీలుకుదిరితే మానసిక ప్రశాంతత కొరకు మీ ఫ్రెండ్స్ తోనో,, లేదా మీ రిలేటివ్ తోనో దూరంగా ఏదో ఓ ప్రదేశానికి వెళ్ళి కాస్త ఈ రెగ్యులర్ ఫీల్ పోగొట్టుకోడానికి ప్రయత్నించండి,, దానివల్ల మనసు కాస్త రీ ఫ్రెష్ అవ్వచ్చు

ఇదంతా చదివాక " బాధలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం చేస్తాం కిరణ్ ? " అని మీరడగవచ్చు నన్ను ... ఇవన్నీ నే చెప్పింది ఇలా చెస్తే బాధ తగ్గుతుందని కాదు.. మరింత బాధలోకి మీరు నెట్టబడకుండా సాధ్యమైనంతవరకూ అందునుంచి బయటపడతారనే..

బాధలో ఉన్నప్పుడు మీరు మరింత బలహీనమయితే బ్రతుకే అర్ధంలేదనిపిస్తుంది... అలాంటి స్థితికి చేరకుండా ఉండేందుకు ఇవి కాస్తైనా ఉపయోగపడవచ్చు.. అందుకే కాస్త ఈ సూచనలు చేశాను

ఇంతా చెప్పినాకూడా ఇంకా ఒకటి మాత్రం కొసరు మాటగా చెప్పాలనిపిస్తోంది నాకిలా..

" జీవితమెప్పుడూ ఒకరివల్ల ఆగదు,, ఒకరితోనే ఆగదు - సో పరిస్థితులెలాంటివెదురైనా బ్రతుకుపట్ల కుతూహలాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి ""


- Kks Kiran

27 జులై, 2019

జ్ఞానం అంటే ?



తల్లి గర్భం నుండి మనం జనియించిన కొంత కాలం వరకూ కూడా మనకి " నా " అనే భావన కానీ , " స్వ - పర " బేధాలు కానీ వత్యాసం కానీ తెలియదు - అది మనిషి యొక్క అసలు సహజ స్థితి
మనలో‌ ఈ " నా " అనే భావం ఎలా‌ ఏర్పడుతుందో తెలియదు కానీ అది ఏర్పడినప్పటినుంచి మనిషిపై ఇతర మనుష్యుల , సంఘ , సమాజపు ముద్రలు పడుతూంటాయి
ఆ ప్రభావం అతని మాటలలోనూ , అతని ఆలోచనల్లోనూ , నమ్మకాలలోనూ , చేతల్లోనూ‌ ద్యోతకమవుతాయి
అంటే మనం " జ్ఞానం " అని ఏదైతే భావిస్తున్నామో అవన్నీ ఇతరుల ద్వారా మనపై పడిన ప్రభావాలే తప్ప మనదంటూ ఏమీ లేదనేగా ?
ఈ చెప్పుకొనే " జ్ఞానం " మనలో అహంకారమూ , ఆధీక్యత , ఆత్మన్యూన్యత , ఆత్మవిశ్వాసం , కోపం , ద్వేషం , భయం , సుఖం , దుఃఖం లాంటి భావాలను కలగచేస్తుంది
ఈ భావాలేవీ పుట్టిన శిశువుకి ఉండవు - ఎదిగిన వ్యక్తికే ఇవ్వన్నీను
ఇవన్నీ ఆ మనిషిలో ఎలాంటి ప్రవర్తనను కలగచేస్తున్నాయి ? ఎటువంటి సంస్కారాన్నిస్తున్నాయి ?? అనే విశ్లేషణ మనిషిలో జరగాలంటే " నేను " అనే భావం ఏర్పడకముందు " నేనేంటి ? " అనే విషయంతో పోల్చుకోవాలి మనిషి...
అటువంటి స్వీయ విచారణ వల్ల సూర్యకిరణాలకి మంచు కరిగినట్లు మనలో అజ్ఞానం కరిగిపోతుంది
అందుకే " జ్ఞానం అంటే కొత్తకొత్త విషయాలు నేర్చుకోవడం మాత్రమే కాదు - నేర్చుకున్న విషయాలనుండి మనలని మనం విముక్తి చేసుకోవడం కూడా " అని రాసాను ఉదయం 🙂
- Kks Kiran

గురు పౌర్ణిమ శుభాకాంక్షలు



తల్లితండ్రుల ప్రేమలోనైనా కాస్త ఆశింపు , ఎంతోకొంత స్వార్ధం ఉంటుందేమో కానీ గురువు శిష్యుడిపై చూపే ప్రేమలో ఎటువంటి స్వార్ధమూ ఉండదు

గురువుకి శిష్యుడిచ్చే ధనమో , లేక బహుకరించే బహుమతులో ఆనందాన్నివ్వవు - శిష్యుడి అభ్యున్నతే ఆయనను ఆనందమనస్కునిగా చేస్తుంది

అలా నా జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులకి నమస్కరిస్తూ గురుపౌర్ణమి శుభాకాంక్షలు :)


- Kks Kiran

కర్మ సిద్ధాంతం





ఈ జగత్తు కార్యకారణ సిద్ధాంతాన్ని అనుసరించి నడుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి

అది నిజమని విశ్వసిస్తే కర్మ‌సిద్ధాంతం సరైనదే అని తోస్తుంది

ఈ కర్మసిద్ధాంతం మనం మార్చలేని , చేతిలో లేని విషయాల పట్ల మనిషి దుఃఖపడకుండా ఉండేందుకు సహాయపడుతుందేమో కానీ అంతకుమించి మన జీవితాలలో దానిని అనుష్టింపచూసామా పురుష ప్రయత్నాలపై అది పెద్ద దెబ్బ కొట్టి మనిషిని Pessimist లా మారుస్తుంది 🤷‍♂

- Kks Kiran

10 అక్టోబర్, 2017

అసలైన విద్య యొక్క లక్షణమేంటంటే?


ఉద్యోగం చేసేందుకో ,, లేక కేవలం ఉపాధి కల్పనకో ఉపయోగపడే విద్య విద్యే కాదసలు 👎

విద్య వల్ల వ్యక్తికి సంస్కారమూ,, స్వంత తెలివీ,, సృజనాత్మకత అలవడాలి 👍

అవి కలగజేయకుండా కేవలం విషయజ్ఞానాన్ని నేర్పే చదువు చదువే కాదు సరికదా అలాంటి పాండిత్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి పుస్తకాల బరువుతో ఉన్న భారమైన గాడిదతో సమానం 👅

- Kks Kiran

పుస్తక పఠనం యొక్క గొప్పతనం



" పుస్తక ప్రియుడు కానివాడు ఎప్పటికీ బుద్ధిమంతుడు కాలేడు  "


09 ఆగస్టు, 2017

చలం మాట


" జీవితం స్వప్నమైతే , సుందరమైన స్వప్నాన్నే కందాం

ఈ దరిద్రంలోంచి,, భయం నుంచీ మేలుకొందాం...!!! "


స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు 😊


" నిజమైన స్నేహితునితో మనసువిప్పి మంచిని చెడునూ మాట్లాడుకోవచ్చు " - ఎమర్సన్

" ముఖస్తుతి చేసేవారందరూ స్నేహితులు కారు,, కష్టాలలో సహాయం చేసిన వారే నీకు నిజమైన స్నేహితులు " - కందుకూరి వీరేశలింగం గారు 

" నీ తప్పులను , తెలివితక్కువ పనులను నీముందు నిదానంగా ఉంచువాడే నీకు నిజమైన స్నేహితుడు " - స్మిత్

" మంచి మిత్రుడు మనలని తప్పులు చేయకుండా సరైన మార్గంలో నడిచేలా చూస్తాడు. మంచి చేస్తాడు. మన రహప్యాలు వెల్లడి చేయకుండా గోప్యంగా ఉంచుతాడు. మన మంచి గుణాలని మెచ్చుకుంటాడు. ఆపదలో మన వెంటే అంటిపెట్టుకుని ఉంటాడు. దూరంగా పారి పోడు. అవసరానికి ఆదుకుంటాడు " - ఓ సుభాషిత పద్య తాత్పర్యం

ఇవీ ఉత్తమ స్నేహానికీ,, ఉత్తమ స్నేహితునికీ ఉండాల్సిన లక్షణాలని కొంతమంది ప్రముఖులు ఇచ్చిన నిర్వచనాలు..

ఆ రకంగా విశ్లేషిస్తే మీరు నాకు దొరికిన గొప్ప వ్యక్తుల్రా అబ్బాయిలూ 😜 మీరు నాకు తారసిల్లకపోతే నా జీవితంలో గొప్ప భాగాన్ని మిస్ అయిపోయేవాడినేమో నేను....!!!

సాధారణంగా 7 ఏళ్ళు మించి ఒక వ్యక్తితో మనం స్నేహం కొనసాగిస్తున్నామంటే వాళ్ళు మనకి క్లోజ్ ఫ్రెండ్స్ కిందే లెక్క అని చెప్తుంది సైకాలజీ,, కానీ ఇక వాళ్ళు కుటుంబసభ్యులకిందే లెక్క అని నా గాఢమైన అభిప్రాయం...

మరి కుటుంబసభ్యులకి ఎక్కడైనా ప్రత్యేకించి " నాకు నువ్వింత ప్రత్యేకం రా " అని ప్రకటించాలా ఏమిటి పిచ్చీ వెర్రీ కాకపోతేనూ??

అయినా అది ప్రకటిస్తేనే తెలిసే విషయమా అర్ధం చేసుకోబడే విషయం అయితేనూ....???

అందుకే ప్రత్యేకించి నాటకీయంగా నేనేమీ విష్ చేయట్లేదు మిమ్మల్ని ఈరోజు 😊 

బట్ Thanks నన్ను నన్నుగానే చూస్తూ మన డిప్లమా రోజులనుంచీ ఇప్పటివరకూ నా స్టుపిడిటీనీ,,ఫన్ నీ భరిస్తూ ఇంకా మీ స్నేహితునిగా ఉండనిస్తూ జీవితాంతం గుర్తుంచుకోదగ్గ అనేకానేక అనుభవాలు ఇచ్చినందుకూ,, ఇస్తూనందుకూనూ 😂

- Kks Kiran

08 ఏప్రిల్, 2017

" ఆస్తికవాదం గొప్పదా? నాస్తికవాదం గొప్పదా? " అనే విషయచర్చగల ఓ పోస్ట్కి నేనిచ్చిన సమాధానం


ఇందులో #సత్యం గురించీ,, #ఆస్తికవాదం గురించీ,, #హేతువాదం గురించీ,, #ఆధ్యాత్మికత గురించీ,, #ఆధ్యాత్మిక జీవనవిధానం గురించీ,, #భక్తి గురించీ,, #ఆనందం గురించీ,,#సుఖం గురించీ,#కళ గురించీ,,#భౌతికవాదం గురించీ నాదైన విశ్లేషణ రాసాను 

కాస్త ఓపికగా చదవండే 😜 😜 😜

***********************************************

"" నమ్మకం మనిషికి స్వాంతన ఇస్తుంది కానీ సత్యాన్ని చూపదు... వాస్తవమేమిటో చూద్దామనే ప్రయత్నాన్ని అది ప్రోత్సహించదు సరికదా ఆ నమ్మకమే నిజమనుకునేలా చేస్తుంది 😁 

అలా అని నిజం కోసం హేతుబద్ధంగా,, తార్కికంగా వెతుకుతూ వెంపర్లాడే మనిషికి శాంతి ఉండదు 😒

ఇందులో ఏవాదం ఉత్తమం? అంటే ఏం చెప్తాం? 

రెండూ కావాలంటాను నేనైతే....!!!

ఎందుకంటే మనిషికైనా,, సమాజానికైనా ఈ రెండూ ఎప్పుడూ అవసరమే కాబట్టి...!!! ఈ రెండిటిలో ఏది లోపించినా అసతుల్యతాస్థితికి లోనై అర్ధంలేని ఆశాంతి కల్గుతుంది కాబట్టి 😳 

సరే,, ఆధ్యాత్మికత విషయానికే వస్తే దానిగురించి #చలం చాలా గొప్పగా అన్న ఓ మాటని ఇక్కడ ఉదహరించడం సందర్భోచితం అని అనిపిస్తోంది నాకు 😄 

చలం తాను రాసిన " ఆనందం " అనే వ్యాసంలో ఓ చోట ఇలా అంటాడు " ఆధ్యాత్మికత అంటే ఈ లోకంలో ఉన్న ఆనందానికై కళ్ళు తెరవడం " అని.. ఈమాటనే నేనూ నమ్ముతాను ఆధ్యాత్మికత అనే విషయమై 

" ఆధ్యాత్మికత అంటే అన్నీ ఒదులుకోవడం కాదు... అలా అని అన్నీ పట్టుకు కూర్చోవడమూ కాదు ...

అదో గొప్ప చైతన్యాత్మకమైన స్థితి.. అస్పష్టత నుంచి స్పష్టత దిశగా మనిషి చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత " 😊

మనిషి తనకేది కావాలో,, తనకేది అవసరమో నిష్పక్షపాతంగా విశ్లేషించుకుని బ్రతకడమే అసలైన ఆధ్యాత్మిక జీవనవిధానం " 😊 

" భక్తి అనేది ఈ విధమైన మనోస్థితి కలగడానికి చేసే సాధనకి మొదటిమెట్టు " అని నా అభిప్రాయం 😊

ఆధ్యాత్మిక జీవనవిధానం నిజంగానే చాలా గొప్పది 😊,, అది అనుభవైక విషయంగా తెలుసుకుంటేనే తప్ప మామూలుగా చెప్తే ఏమర్ధం కాదు కూడా మనిషికి 

(పోతనగారి "" మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు "" అనే పద్యం గుర్తుచెయ్యక్కర్లేదుగా ప్రత్యేకించి నేను మీకు?)

ఆధ్యాత్మిక జీవనవిధానం పాటించడం ద్వారా మనిషికి ఒనగూరే వ్యక్తి పరివర్తనా,,సమదృష్టి ,,సమభావనా,, మానసిక ప్రశాంతత,, అది ఈ లోకంపై పెంచే ప్రేమభావమూ ఇవన్నీ గొప్పే...!!! కానీ ఇవన్నీ వ్యక్తి అంతరంగానికి సంబంధించిన విషయాలు 

ఇవి ఆనందాన్ని ఇచ్చేమాట నిజమైతే అయ్యుండవచ్చు కానీ ఇదే ఆనందమనే భావనతో భౌతికవాదాన్ని మింగేసేలా బ్రతకకూడదు మనిషనేవాడు 😁 

ఎందుకంటే మనం బ్రతుకుతున్నది భూలోకంపైనే కాబట్టి...!!

మన జీవితానికికానీ,, మన జీవనవిధానాలకి కానీ కేవలం భౌతికవాదం మాత్రమే ప్రభావవంతంగా పరిష్కారం చూపగలదు తప్ప మరేదీ చూపలేదు నిజానికి... దానిని విస్మరిస్తే మన బ్రతుకులలో సుఖానికి చోటు ఉండదు కూడా 😊 ( అసలు " సుఖం " అంటే ఏమిటి? అనేది విశ్లేషించుకుని చదవండి ఈ పాయింట్ని) 

అయితే భౌతికవాదం మనిషికి సుఖానిస్తుందేకానీ సంతోషాన్ని ఇవ్వలేదు,,

మనిషికి సంతోషం ఎందులో కల్గుతుంది? అనే విషయమే తీసుకుంటే ' సాధారణంగా అది లౌకికాతీత విషయాలలోనే కల్గుతుంది ' అని జవాబు వస్తుంది...

కాబట్టే ఆ ఆనందాన్ని,, ఆ స్థితిని కల్గచేసే కళలనూ,,ఆధ్యాత్మిక లోకాన్ని మనిషి కల్పించుకున్నాడనిపిస్తోంది నాకైతే కొన్ని వేల సంవత్సరాల మానవ పరిణామక్రమాన్ని,, అందులో పరీక్షింపబడిన (పడుతున్న) రకరకాల వాదాలనూ విశ్లేషిస్తే 😊

ఏదైనా ఇది చాలా పెద్ద చర్చ ఏది గొప్ప? ఏదికాదు? అని తర్కించడానికి

కానీ ' సత్యాన్వేషణ విషయంలో మాత్రం ఆస్థికునికంటే హేతువాదే చాలా గొప్పవాడని ' నా అభిప్రాయం, ,

నేనే కనుక దేవుడినై ఉండుంటే "" ఈ ప్రపంచం అంతా " సత్యం - శివం - సుందరం "" అని ముక్తాయింపు ఇచ్చే ఆస్తికుని కన్నా " అసలు సత్యమనేది ఏమిటి? నిజంగా అది ఉంటుందా? ఉంటే దానికి ప్రమాణం ఏమిటి? అలాగే ఈ సృష్టి తాలుకు ఈ సౌందర్యం ఏమిటి? ఇందులో ఈ ఉత్పాతనాలూ,, ఈ లయమవ్వడాలూ ఏమిటి? వీటికి అంతూ,, అదుపూ ఉంటాయా అసలు నిజంగానే? "" అని తెలుసుకోడానికి కనీసం ప్రయత్నించే హేతువాదినే గౌరవిస్తాను 😊 😊 😊 ""

- Kks Kiran

జీవితం పట్ల కుతూహలం కోల్పోవడం మరణంతో ఆమానం


" వ్యక్తిలో జీవక్రియ ఆగిపోయినప్పుడు మాత్రమే " అతను మరణించాడు " అంటుంది లోకం 😒😒

నిజానికతను " జీవితం పట్ల కుతూహలం కోల్పోయినప్పుడు కదూ మరణించినట్లు లెక్కవెయ్యాల్సినది ??? 😳 😳 😳 " 

- Kks Kiran

06 ఫిబ్రవరి, 2017

జీవితం గురించి చలం మాటల్లో


" జీవితం అంటే అనుభవం.

గొప్ప అనుభవాలవైపు ప్రయాణించడమే జీవిత లక్ష్యం..

అనుభవాలను గొప్పగా,, గాఢంగా తీసుకోగలగడం అనేది మన హృదయపు సున్నితత్వం మీద,, స్వేచ్ఛ మీద,, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది "

పురుషాధిక్యతకు కారణమవుతున్న అంశాలేంటి?

పురుషాధిక్య భావన గురించి నేను రాసిన ఈ విశ్లేషణ చదివి నా తమ్ముడు నాకు ఇచ్చిన రిప్లై ఇది😊

" స్త్రీ ని ఇంప్రెస్ చెయ్యడానికి మగవాడు తప్పకుండా సెక్యూరిటీ ఫీలింగ్ చూపించాల్సి వస్తోంది ఎప్పుడూను,,

అదే ఆమెపై పురుషుడు అధికారం చూపడానికి కారణం అవుతుందేమో

అదీకాక స్త్రీకి ఏమీ తెలీదని ,, అన్నీ తానే చెప్పాలనుకునే అభిప్రాయంతో పురుషుడు ఉంటాడనుకుంట బహుశా

అందుకే పని ఉన్నా లేకపోయినా ఒక అమ్మాయి సమస్యలో ఉంటే మోటివేట్ చెయ్యాలని చూసే మగవాళ్ళు బోలెడుమందుంటారు...

అందుకు కూడా కారణం ఏంటో తెలుసా?

స్త్రీని ఓదారిస్తే అతని ఇగో సాటిస్ఫై అవ్వచ్చు,, అదీకాక ఆ రకమైన సెక్యూరిటీ ఫీలింగ్ ఆమెకి కలిగించి దగ్గరకావచ్చనే ఉద్దేశం అయ్యుంటుంది " అని అన్నాడు

ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏమిటి?

24 జనవరి, 2017

తస్మాత్ జాగ్రత్త



" ముఖస్తుతికీ,, వెన్నుపోటుకీ పెద్దగా తేడా ఏం లేదు "


గొప్ప జీవనవిధానం ఏంటంటే?


" గొప్పగా బ్రతకడం అంటే సమాజం ఏదీ గొప్ప అనుకుంటుందో ఆ విధంగా నువ్వు బ్రతకడం కాదు...

నీకేది ఆనందాన్నీ సంతృప్తినీ ఇస్తుందో ఆ విధంగా నువ్వు బ్రతకగలగడం నిజమైన గొప్పదనం

నీ లైఫ్ నీకు నచ్చేలా ఉండాలి , , నువ్వు మెచ్చేలా ఉండాలి..

అదీ గొప్ప జీవనవిధానం అంటే "

( ఓ చాటింగ్ Conversationలో నేనన్న మాట ఇది...రాశాక ఇదేదో బానే ఉందని మీపై తోలేసా ఇలా 😜 ) 

- Kks Kiran

ఆలోచించాల్సిన విషయమే


"" తెలివైనవాడెప్పుడూ సామాన్యుడి మూర్ఖత్వాన్ని,,వెర్రినీ తనకనుకూలంగా మార్చుకుని లాభపడుతూ ఉంటాడు...

అలా లాభపడడం వాడి గొప్పతనమని వాడిని అభినందించాలో లేక మోసపోతున్నామని తెలిసీ పట్టనట్లు ప్రవర్తించే సామాన్యుడి అజ్ఞానం పై జాలిపడాలో అర్ధంకాదు ఒక్కోసారి ""

( దొరక్కదొరక్క దొరికిన ఖైదీ నంబర్ 150 మూవీ 20 టికెట్ని 150 రూపాయలకి కౌంటర్ దగ్గరే గొప్ప పోరాటాన్ని తప్పించుకుని సాధించాక నాకనిపించిన భావం ఇది 😒 )

- Kks Kiran

07 జనవరి, 2017

వివాహానికి ముందు ఆలోచించాల్సిన విషయం 😊


" కొంతమంది ఆడపిల్లలని చూస్తే చాలా జాలి కలుగుతూ ఉంటుంది...పూర్తిగా జీవితం అంటే అవగాహన వారికి కలగనప్పుడే వాళ్ళకి పెళ్ళి చేసి వారి కలలు,, ఆశయాలు,, జీవితాలను నాశనం చేసేస్తూ ఉంటారు కొందరు మూర్ఖులైన పెద్దలు...

ఇంకా ఇప్పుడు తక్కువ వయసులోనే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి? అని అనుకోవచ్చు కానీ పల్లెల్లో ఇంకా అలానే జరుగుతాయి... ఇదేం దరిద్రమో ఈ మనుష్యుల్లో అర్ధంకాదు కానీ, స్త్రీకి వ్యక్తిత్వం ఉంటే తమ స్వార్ధానికి అడ్డు అవుతుందని స్త్రీకి విద్య కొంతమాత్రమే చెప్పించి తర్వాత మానిపించే వెధవలు ఇంకా ఉన్నారు సమాజంలో.అంతెందుకు స్త్రీ వ్యక్తిత్వాన్ని గౌరవించి (అసలు గుర్తించే భర్తలు ఎంతమందిలే? ) ఆమెతో మర్యాదగా నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఈ సమాజంలో???

కొంతమంది అమ్మాయిలకి ఆమె వయసుకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులతో వివాహం చేస్తూ ఉంటారు... ఇదెంత మూర్ఖమైన చర్యో...వయసు పెరిగే కొద్దీ మనిషి అభిప్రాయాల్లో ఎన్నీ మార్పులు వచ్చేస్తాయి...ఈవయసులో గొప్పగా అనిపించిన ఓ విషయం తర్వాత కొంత కాలానికి అర్ధంలేని విషయంగా అనిపించవచ్చు....ఇది అభిప్రాయబేధాలును కలగచేసే విషయం అవ్వచ్చు కదా దంపతుల మద్య??? సమవయస్కుల మధ్య వివాహం అయితే ఆలోచనలు,, అభిప్రాయాలు,అభిప్రాయాలు ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది కదా?? అవేం పట్టించుకోకుండా " జాతకాలు కలిస్తే చాలు పెళ్ళి చేసేయచ్చు " అని అనుకుంటారు ఏంటో చాలామంది పెద్దలు.....

ఒక్క అమ్మాయిలకనే కాదు....కొందరు అబ్బాయిలకైనా సరే... " మాకు పెళ్ళి అయితే చాలు,ఆ అమ్మాయి అభిరుచులు ఎలాంటివైతేనేం? వ్యక్తిత్వం ఊసే మాకు పట్టింపు లేదు " అనే ధోరణిలో చంకలు గుద్దుకుంటూ,,సంబరపడిపోతూ పెళ్ళి చేసుకుంటూ ఉంటారు.....

జీవితంలో ఎక్కడైనా,ఎప్పుడైనా ఎంపిక చేసుకోవడంలో పొరపాటు చెయ్యచ్చేమో కానీ భాగస్వామి విషయంలో మాత్రం చాలా జాగర్తగా ఎంపిక చేసుకోవాలి... నీ భావాలకి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకోకపోతే ఇక బ్రతుకంతా " నిర్లిప్తత" అనే గృహంలో గడపాల్సిందే...!!!

ఏ తెల్లారిపూటో పక్కమీద నుంచి లేచేముందు ఆమె తలని నీ గుండెలపై ఆనుచుకుని ఆమె ముంగురులు త్రిప్పుతూ కనీసం ఓ 5 నిముషాలు అయినా మాట్లాడాలని నీకనిపించిందనుకో,,

 " వద్దండీ,, పాలోడు ఎవరూ లేరని పాలు పోయకుండా వెళ్ళిపోతాడేమో " అనో లేక " మజ్జిగ తోడు పెట్టుకోవాలండీ,లేకపోతే పాలన్నీ పాడయిపోతాయి " అనే పెళ్ళంతో ఇంకేం కాపురం చేస్తావ్???  జీవితంపై ఒక్కసారిగా విరక్తి వచ్చేయ్యదూ అలాంటి ప్రవర్తన భాగస్వామి నుంచి ఎదురైతే....." ఇహ సంసారే బహు దుఖారే " అని పాడుకుంటూ సన్యాసంలోకి పారిపోవాలనిపిస్తుంది ఆ క్షణం...  అందుకే భాగస్వామిని ఎంపిక విషయంలో చాలా జాగర్త ఉండాలి...

నీ భావాలను అర్ధం చేసుకుని గౌరవించి ప్రవర్తించే వ్యక్తి దొరకనంత వరకూ ప్రేమలో పడకూడదూ,, పెళ్ళీ చేసుకోకూదదు... పెళ్ళి ఒక్కటే జీవిత లక్ష్యం కాదుకదా???  దానికోసమే అంత వెంపర్లాడిపోవక్కర్లేదు... ఇంకా ఎన్నో ఉన్నాయి జీవితంలో ఆనందాన్ని ఇచ్చేవి... కాస్త సమయం మించిపోతున్నట్లు అనిపించినా వేచి ఉండడమే మంచిదని నా అభిప్రాయం...

ఇంతా ఎందుకు చెప్పానంటే " వివాహం అనేది కేవలం శారీరక దగ్గరతనం కోసమే కాదు... మానసిక దగ్గరతనం కోసం కూడా చేసుకోవాలని " చెప్పడం కోసమే...

ఆ మానసికపరమైన దగ్గరతనం లేకనే చాలామంది దంపతులు బ్రతుకుతున్నారు జీవచ్చవాలలా ఏ విధమైన కొత్త అనుభూతులూ,, అనుభవాలు తమ వైవాహిక జీవనం నుంచి దొరక్క...

చాలామంది దంపతులు సమాజం కోసమనో, పిల్లల భవిష్యత్తు కోసమనో,,చివరి వయసులో సెక్యూరిటీ కోసమనో కాపురాలు  కొనసాగిస్తున్నారు తప్ప నిజంగా ప్రేమ ఉండి కాదు(ఎటొచ్చీ అవతలివారిపై నేను లేకుండా ఎలా బ్రతకగలరో??  అనే జాలివల్లకూడా కాపురాలు నిలబడుతూ ఉండచ్చు...)

అలాంటి వాళ్ళకోసమే,,కనీసం కొందరి ఆలోచనా విధానాలలో అయినా మార్పు రావచ్చనే ఆశతో  ఇదంతా రాశాను...కొందరి ఆలోచనా విధానమైనా మారితే సంతోషమే...!!! "

శుభసాయంత్రం 😊 

- Kks Kiran

ఏమి ఆశించకుండా ప్రేమించటం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ ఒకటి చదవండి 😊



 ***** త్యాగం *****

"" పదేళ్ళ జాన్, తన చెల్లితో ఆడుకుంటూ ఉండగా, ఆ పాప పడిపోయి, తలకి గాయం తగిలి రక్తం చాలా పోయింది.

 జాన్ ది  ఆ గ్రూప్ రక్తం "నువ్వు నీ చెల్లికి కొంచెం రక్తం ఇస్తావా?" అని డాక్టర్ అడిగాడు. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు 'సరే' అన్నాడు. ఆ కుర్రాడు ఎందుకు సంశయిన్చాడో డాక్టరు మరోలా అర్ధం చేసుకున్నాడు. "పెద్దనొప్పిగా ఉండదు. అయిదు నిమిషాల్లో అయిపోతుంది. తరువాత చాక్లెట్ ఇస్తాను" అన్నాడు. 

తన శరీరంలోంచి రక్తం నెమ్మదిగా సీసాలోకి ఎక్కుతుంటే జాన్ మొహం క్రమక్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. జాన్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గిరకొచ్చి "లే..చాక్లెట్ ఇస్తాను"అన్నాడు .

ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు.

"ఇంకా ఎంత సేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్" అని.

డాక్టర్ విభ్రాంతుడై "రక్తం తీస్తే మనిషి చచ్చిపోతాడనుకున్నవా!" అని అడిగాడు

"అవును"

డాక్టర్ గొంతు వణికింది."అనుకునే ఇచ్చావా?' అన్నాడు కంపిస్తూ... ""

- Yandamoori Veerendranath గారి " విజయానికీ ఆరో మెట్టు " నుంచి సేకరణ

- Kks Kiran

01 జనవరి, 2017

ఒట్టేస్తారు... వదిలేస్తారు 😒

మధ్యాహ్నం ఓ రేడియో షో లో నేను RJ Viswaika   గారితో మాట్లాడుతున్నప్పుడు ఆమె నన్ను కొన్ని ప్రశ్నలడిగారిలా...!!!

" రేపటి నుంచీ న్యూ యియర్ కదా...!!! మరి మీరేమైనా ఈ ఈ విషయాలలో ఇలా ఉండాలనో,, ఈ ఈ విషయాలలో ఇలా ఉండకూడదనో ఏమైనా అనుకున్నారా? న్యూ యియర్ సందర్భంగా మీ లైఫ్లో మీరు ప్రత్యేకించి తీసుకున్న డెసిషన్స్ ఏమిటి ? " అని...

" అలా ఒక్కటీ లేవండీ " అని  అన్నాను నేను..

" అదేంటండీ ? ఎందుకలా ? " అని ఆమె అంటే ఆమెని నవ్వించడానికన్నట్లు ఓ చిన్న ఎనాలసిస్ చెప్పాను నేనిలా 😎

"" రేపటి నుంచీ ఓ వారం పదిరోజులు పార్కులలో ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతుందట... అలాగే సిగరెట్ల అమ్మకాలు కూడా బాగా తగ్గిపోతాయట...

దీనికిగల కారణం ఏంటంటే " చాలామంది జనాలు న్యూ ఇయర్ నుంచీ ఇలా ఉండాలీ,, ఇలా ఉండకూడదని " అనుకోవడం వల్లనే..

చిత్రం ఏంటంటే ఓ వారం పది రోజులకి మళ్ళీ పరిస్థితులన్నీ యధాప్రకారంగా మామూలు స్థితికి వచ్చేస్తుంది...

అందుకు పెద్దగా కారణం కూడా  ప్రత్యేకించి ఏమీ ఉండదు చెప్పాలంటే... ఆ ఆ వ్యక్తుల  తాలూకు నిర్ణయవేడి చప్పున చల్లారిపోవడం వల్లనే జరుగుతుందలా..!!!

నిజంగా ' ఓ పనిని పరిపూర్ణంగా చేద్దాం...!!! '  అనుకున్న వ్యక్తెవడూ ఆ పనిని రేపు చేస్తాననో,, ఎల్లుండనుంచీ మొదలెడతాననో ముహూర్తాలు చూసుకోకుండా వాడికి అవసరమూ,, ఇష్టం అనుకుంటే తక్షణమే మొదలెట్టేస్తాడు తన ఆ నిర్ణయాన్ని.. అలా కాకుండా ' ఇలా ఆ పని గురించి నసుగుతున్నాడంటే వాడికి ఆ పని మనస్పూర్తిగా చెయ్యాలనే ఉద్దేశం లేదన్నమాటే... ' ఆ మాట వాడికే ఒప్పుకోడానికిష్టంలేక దానికి సాకుగా ఇలా వాయిదా పద్ధతిలో పని చేస్తానని అంటాడు... 

నేనలాంటి వ్యక్తినైతే కాదు మరి.. అందుకే నాకలా ఏ డెసిషన్సూ లేవు,, సింపుల్ "" అని అంటే చాలా నవ్వుకున్నారావిడ.... 😊 😊 😊

25 డిసెంబర్, 2016

తరాల మధ్య ఉండే అంతరం



ప్రతీ మనిషి తన ముందు తరపు ఆలోచనలని ఎంతో కొంత గేలి చేస్తూనే తన తర్వాతి తరాన్ని ఎంతో కొంత తప్పు పడుతూ ఉంటాడు...

ఏ మనిషైనా ఈ రకపు ప్రవర్తనకి అతీతుడు కాడు.. ఏ తరానికీ ఇందులో మినహాయింపు లేదు...

ఏమంటారు?

- Kks Kiran

24 డిసెంబర్, 2016

మనం మాట్లాడే మాటలు తెలిపేదేంటంటే?



" ఎదుటివ్యక్తితో మనం మాట్లాడే మాటలూ,,ప్రవర్తించే తీరూ ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలుపవు...

మన తాలూకు మనస్తత్వాన్ని,మనోసంస్కారాన్ని ప్రతిబింబిస్తాయి అవి "

- Kks Kiran