మధ్యాహ్నం ఓ రేడియో షో లో నేను RJ Viswaika గారితో మాట్లాడుతున్నప్పుడు ఆమె నన్ను కొన్ని ప్రశ్నలడిగారిలా...!!!
" రేపటి నుంచీ న్యూ యియర్ కదా...!!! మరి మీరేమైనా ఈ ఈ విషయాలలో ఇలా ఉండాలనో,, ఈ ఈ విషయాలలో ఇలా ఉండకూడదనో ఏమైనా అనుకున్నారా? న్యూ యియర్ సందర్భంగా మీ లైఫ్లో మీరు ప్రత్యేకించి తీసుకున్న డెసిషన్స్ ఏమిటి ? " అని...
" అలా ఒక్కటీ లేవండీ " అని అన్నాను నేను..
" అదేంటండీ ? ఎందుకలా ? " అని ఆమె అంటే ఆమెని నవ్వించడానికన్నట్లు ఓ చిన్న ఎనాలసిస్ చెప్పాను నేనిలా 😎
"" రేపటి నుంచీ ఓ వారం పదిరోజులు పార్కులలో ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతుందట... అలాగే సిగరెట్ల అమ్మకాలు కూడా బాగా తగ్గిపోతాయట...
దీనికిగల కారణం ఏంటంటే " చాలామంది జనాలు న్యూ ఇయర్ నుంచీ ఇలా ఉండాలీ,, ఇలా ఉండకూడదని " అనుకోవడం వల్లనే..
చిత్రం ఏంటంటే ఓ వారం పది రోజులకి మళ్ళీ పరిస్థితులన్నీ యధాప్రకారంగా మామూలు స్థితికి వచ్చేస్తుంది...
అందుకు పెద్దగా కారణం కూడా ప్రత్యేకించి ఏమీ ఉండదు చెప్పాలంటే... ఆ ఆ వ్యక్తుల తాలూకు నిర్ణయవేడి చప్పున చల్లారిపోవడం వల్లనే జరుగుతుందలా..!!!
నిజంగా ' ఓ పనిని పరిపూర్ణంగా చేద్దాం...!!! ' అనుకున్న వ్యక్తెవడూ ఆ పనిని రేపు చేస్తాననో,, ఎల్లుండనుంచీ మొదలెడతాననో ముహూర్తాలు చూసుకోకుండా వాడికి అవసరమూ,, ఇష్టం అనుకుంటే తక్షణమే మొదలెట్టేస్తాడు తన ఆ నిర్ణయాన్ని.. అలా కాకుండా ' ఇలా ఆ పని గురించి నసుగుతున్నాడంటే వాడికి ఆ పని మనస్పూర్తిగా చెయ్యాలనే ఉద్దేశం లేదన్నమాటే... ' ఆ మాట వాడికే ఒప్పుకోడానికిష్టంలేక దానికి సాకుగా ఇలా వాయిదా పద్ధతిలో పని చేస్తానని అంటాడు...
నేనలాంటి వ్యక్తినైతే కాదు మరి.. అందుకే నాకలా ఏ డెసిషన్సూ లేవు,, సింపుల్ "" అని అంటే చాలా నవ్వుకున్నారావిడ.... 😊 😊 😊
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి