19 జులై, 2016

పూనకాలు - శాస్త్రీయ వివరణ


పూనకాలను జనాల్లో చాలామంది ఇప్పటికీ భక్తి భావంతోనే చూసి అలా పూనకంతో ఊగిపోతున్న వాడికి ఏమిటేంటో  ఉపచారాలన్ని చేసేస్తూ ఉంటారు ...

పసుపునీళ్ళు కుమ్మరించేస్తూ ఉంటారు బిందెలతో ఆ వ్యక్తి నెత్తిపై...నోటిలో నిమ్మకాయలు కుక్కేసో ,,లేక హారతి కర్పూరం వెలిగించి పెట్టెయడమో చేస్తూ ఉంటారు.. ఏవేవో ఆ వ్యక్తి ప్రేలాపనతో పేలుతూంటే అదో పిచ్చితనంగా,,ఆ వ్యక్తియొక్క మానసిక బలహీనత వల్ల ఏర్పడిన ప్రవర్తనగా భావించక నిజంగానే అమ్మవారు ఆ వ్యక్తిలో ఆవహించి ఇలా మాట్లాడుతోంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది మన దేశంలో...

చదువులేని వాళ్ళు ఈ నమ్మకాలన్ని నమ్ముతున్నారంటే అర్ధముంది,,వారి ఆలోచనా స్థాయి ఇంతేలే....!!! అని సరిపెట్టుకోవచ్చు....కాని పెద్దపెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అలాంటి చోట్ల అజ్ఞానుల్ల ప్రవర్తించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు...

పోనీ సాహసించి నాలాంటివాడు ఎవడైనా " ఇది అంతా మూర్ఖత్వం,,,వేదాలలో,,పురాణాల్లో కూడా ఎక్కడా ఇలాంటి నమ్మకాలేవీ లేవు..తర్వాత తర్వాత మన అజ్ఞానం వల్ల పాటిస్తున్న ప్రవర్తనలు ఇవన్నీ...దీనిని ఆ వ్యక్తియొక్క పారానాయిడ్ మనస్తత్వంగా భావించాలి తప్ప ఇలా భక్తి భావంతో పూజలు అవీ చేసి అజ్ఞానుల్లా ప్రవర్తించకండి " అని అన్నాడనుకోండి జనాలందరూ కలిసి తన్న బోతారు..

అమ్మో,,

మనిషి తాను నమ్మే నమ్మకాలను దాటి ఆలోచించే స్థాయి కలగాలంటే అతనికి బలమైనా ఆత్మవిమర్శనా జ్ఞానం ఉండాలి,,ఆ జ్ఞానం లేని వ్యక్తులకి ఇలాంటివి చెప్తే వారిలో ముందు ఆవేశమే కలుగుతోంది తప్ప ఆలోచన కలగట్లేదు,,ఇంకేం చేస్తాం?? అలా అని చెప్పకుండా వదలనూ లేము..

ఇలాంటి మూఢనమ్మకాలన్నిటికీ పునాది అజ్ఞానం,,నాలుగువైపులా గోడలు నమ్మకాలు,,పైకప్పు ఫలితం లేని ఆశ... ఈ మూఢనమ్మకాలు అజ్ఞాన జనితాలు,,అవి అన్ని బాధలకు తల్లి లాంటిది..

ఇలా ఆలోచించలేనివాడు బానిస..తనకీ,,తోటి వారికి కూడా ద్రోహి

ఏమంటారు?

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి