వ్యక్తిత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యక్తిత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10 అక్టోబర్, 2017

24 జనవరి, 2017

బాధ్యత లేని ప్రేమ ప్రేమే కాదు


" ప్రేమంటే ఇద్దరూ కలిసి ఊహాలోకంలో విహరించడం కాదు,,

ఈ లోకంలోనే ఆనందంగా బ్రతకడం ఎలా? అని తార్కికంగా ఆలోచిస్తూ దానిని ఇద్దరూ కలిసి అమలులో పెట్టడం 😜 " 

చివరగా ఓ ముక్క :- " బాధ్యత లేని ప్రేమ ప్రేమే కాదు, అది ఒట్టి కాలక్షేపం మాత్రమే "

- Kks Kiran

గొప్ప జీవనవిధానం ఏంటంటే?


" గొప్పగా బ్రతకడం అంటే సమాజం ఏదీ గొప్ప అనుకుంటుందో ఆ విధంగా నువ్వు బ్రతకడం కాదు...

నీకేది ఆనందాన్నీ సంతృప్తినీ ఇస్తుందో ఆ విధంగా నువ్వు బ్రతకగలగడం నిజమైన గొప్పదనం

నీ లైఫ్ నీకు నచ్చేలా ఉండాలి , , నువ్వు మెచ్చేలా ఉండాలి..

అదీ గొప్ప జీవనవిధానం అంటే "

( ఓ చాటింగ్ Conversationలో నేనన్న మాట ఇది...రాశాక ఇదేదో బానే ఉందని మీపై తోలేసా ఇలా 😜 ) 

- Kks Kiran

01 జనవరి, 2017

ఒట్టేస్తారు... వదిలేస్తారు 😒

మధ్యాహ్నం ఓ రేడియో షో లో నేను RJ Viswaika   గారితో మాట్లాడుతున్నప్పుడు ఆమె నన్ను కొన్ని ప్రశ్నలడిగారిలా...!!!

" రేపటి నుంచీ న్యూ యియర్ కదా...!!! మరి మీరేమైనా ఈ ఈ విషయాలలో ఇలా ఉండాలనో,, ఈ ఈ విషయాలలో ఇలా ఉండకూడదనో ఏమైనా అనుకున్నారా? న్యూ యియర్ సందర్భంగా మీ లైఫ్లో మీరు ప్రత్యేకించి తీసుకున్న డెసిషన్స్ ఏమిటి ? " అని...

" అలా ఒక్కటీ లేవండీ " అని  అన్నాను నేను..

" అదేంటండీ ? ఎందుకలా ? " అని ఆమె అంటే ఆమెని నవ్వించడానికన్నట్లు ఓ చిన్న ఎనాలసిస్ చెప్పాను నేనిలా 😎

"" రేపటి నుంచీ ఓ వారం పదిరోజులు పార్కులలో ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతుందట... అలాగే సిగరెట్ల అమ్మకాలు కూడా బాగా తగ్గిపోతాయట...

దీనికిగల కారణం ఏంటంటే " చాలామంది జనాలు న్యూ ఇయర్ నుంచీ ఇలా ఉండాలీ,, ఇలా ఉండకూడదని " అనుకోవడం వల్లనే..

చిత్రం ఏంటంటే ఓ వారం పది రోజులకి మళ్ళీ పరిస్థితులన్నీ యధాప్రకారంగా మామూలు స్థితికి వచ్చేస్తుంది...

అందుకు పెద్దగా కారణం కూడా  ప్రత్యేకించి ఏమీ ఉండదు చెప్పాలంటే... ఆ ఆ వ్యక్తుల  తాలూకు నిర్ణయవేడి చప్పున చల్లారిపోవడం వల్లనే జరుగుతుందలా..!!!

నిజంగా ' ఓ పనిని పరిపూర్ణంగా చేద్దాం...!!! '  అనుకున్న వ్యక్తెవడూ ఆ పనిని రేపు చేస్తాననో,, ఎల్లుండనుంచీ మొదలెడతాననో ముహూర్తాలు చూసుకోకుండా వాడికి అవసరమూ,, ఇష్టం అనుకుంటే తక్షణమే మొదలెట్టేస్తాడు తన ఆ నిర్ణయాన్ని.. అలా కాకుండా ' ఇలా ఆ పని గురించి నసుగుతున్నాడంటే వాడికి ఆ పని మనస్పూర్తిగా చెయ్యాలనే ఉద్దేశం లేదన్నమాటే... ' ఆ మాట వాడికే ఒప్పుకోడానికిష్టంలేక దానికి సాకుగా ఇలా వాయిదా పద్ధతిలో పని చేస్తానని అంటాడు... 

నేనలాంటి వ్యక్తినైతే కాదు మరి.. అందుకే నాకలా ఏ డెసిషన్సూ లేవు,, సింపుల్ "" అని అంటే చాలా నవ్వుకున్నారావిడ.... 😊 😊 😊

24 డిసెంబర్, 2016

మనుష్యులతో మసలాల్సిన విధానం ఏంటంటే?


" ఒంటరిగా పుడతాం, ఒంటరిగా పోతాం...!!! మధ్యలోనూ మనకి మనమే ఒంటరిగా బ్రతికేస్తే బోర్ కొట్టేస్తుంది కాబట్టి బంధాలను ఏర్పర్చుకుంటాం మనం..

అంటే మన ఆనందం కోసమే ఈ బంధాలను ఏర్పర్చుక్కున్నాం కదా మనం?? అలాంటి బంధాలను ఆనందమయంగా ఉండేలా చూడకుండా ఒకళ్ళపై మరొకరు చాడీలు చెప్పుకుంటూ,, సూటిపోటి మాటలతో తిట్టుకుంటూ,,తన్నుకుంటూ,ఎదుటి వ్యక్తిని మానసికంగానో,,మాటల ద్వారానో హింసిస్తూ,,నియంత్రిస్తూ ఎందుకు చాలా అసహ్యకరంగానూ,,దుఖ్ఖఃమయంగానూ మార్చుకుంటారు ఎక్కువశాతం మనుష్యులు? " అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు...

అనుకుంటాం కానీ చాలామంది మనుష్యులకి ఎదుటి వ్యక్తులతో ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించకూడదు అనే కనీస,,ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది...

ఆ శ్రద్ధ సాధించాలంటే ముందుగా ఆ వ్యక్తికి వ్యక్తిగత సంస్కారం,,క్రమశిక్షణ ఉండి ఉండాలి...

అదిలేకే చాలామంది మనుష్యులు బంధాలను బాధకలిగించే విషయాలుగా మార్చుకుని తాను బాధపడుతూ,,ఇతరులను బాధపెడుతూ బ్రతుకుతారనిపిస్తుంది ఆలోచిస్తే...

ఏమంటారు?

- Kks Kiran

మనం మాట్లాడే మాటలు తెలిపేదేంటంటే?



" ఎదుటివ్యక్తితో మనం మాట్లాడే మాటలూ,,ప్రవర్తించే తీరూ ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తెలుపవు...

మన తాలూకు మనస్తత్వాన్ని,మనోసంస్కారాన్ని ప్రతిబింబిస్తాయి అవి "

- Kks Kiran

11 జూన్, 2016

సుఖనిద్రకై కొన్ని సూచనలు



ఈ ప్రపంచంలోకేల్లా గొప్ప అదృష్టవంతుడెవరో తెలుసా??

" పక్క మీదకి చేరిన 5 నిముషాలలోనే ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నిద్రపోయేవాడు... "


ఇలా చెప్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కానీ ఆలోచించండి,, ఎవడు పడుక్కోగలడు అలా?

ఏ రుణబాధలూ లేనివాడూ,,ప్రేమలో పడనివాడూ,,రేపేమవుతుందో అనే బెంగ,భయమూ లేనివాడూ,,పరీక్షలకై ఆ దిక్కుమాలిన ట్రిగ్నామెట్రీ లెక్కలను బట్టీ పట్టనివాడైతేనే తప్ప మామూలు మనిషికి సాధ్యమా అలా?

అందుకే చాలామంది పక్కమీదకెళ్తారేకానీ అర్ధంలేని ఆలోచనలతో,,ఆందోళనలతో,ఆతృతలతో శవాసనాలు వేస్తూ ఉంటారు నిద్రలేమితో బాధపడుతూ...

దీని నుంచి బయటపడాలంటే మన జీవనవిధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది...

మొట్టమొదటగా తిండి...

ఉద్వేగాన్ని కలగచేసేలా ఉండే ఆహారపదార్ధాలకి సాధ్యమైనంత దూరంగా ఉండి తేలికగా అరిగేలా,మితంగా ఆహారాన్ని రాత్రిళ్ళు తీసుకుంటే మంచిది... అలాగే పడుక్కునే ముందు గోరు వెచ్చటి పాలు త్రాగడం అలవాటుగా చేసుకుంటే అది కూడా చక్కగా నిద్రపట్టడానికి దోహదపడుతుంది...

ఇక రెండో విషయం మానసికపరమైన ఉద్వేగం....


దీనికి దోహదపడుతున్న విషయాలేంటయ్యా? అంటే అందుకు ప్రధానకారణం " ఆధునిక జీవన శైలే " అని చెప్పవచ్చు...


నిద్రలో ఉండే దశలలో ఒకటైన గాఢనిద్రలోకి మనిషిని పోనివ్వకుండా ఈ సెల్ఫోన్ల కాంతి అడ్డుకుంటోందట..ఇది కలతనిద్రకి కారణమవుతోందని పలు సర్వేలు ఈమధ్యనే విషయాన్ని తేల్చి చెప్పాయి.. మనిషి గాఢనిద్రలోకి జారుకోకపోతే మెదడులో జరగాల్సిన రసాయనిక చర్యలలో అసతుల్యత ఏర్పడి అతనికి జ్ఞాపకశక్తి లేకపోవడం,సరిగ్గా ఏకాగ్రత చూపించలేకపోవడం,నీరసంగా,ఏ పనీయందూ ఆసక్తి లేనట్లు ప్రవర్తిచడం మొదలైన దుష్ప్రభావాలకి కారణమవుతుందట..కనుక సాధ్యమైనంతవరకూ పడుక్కునే ఓ గంట ముందునుంచైనా ఈ ఎలక్టానిక్ వస్తువులకి దూరంగా ఉంటే మంచిది...

అనుభవం మీద చెప్తున్నా,,ఉదయం నుంచీ ఎన్ని పాటలు విన్నా రాత్రి మనసుకి హాయిని,ప్రశాంతతని ఇచ్చే సంగీతాన్ని వినడం అలవాటు చేసుకుంటే కలత నిద్రలేని చక్కటి నిద్ర కలుగుతుంది...


బేహాగ్,కఫీ,తోడి,అభోగీ లాంటి హాయినిచ్చే రాగాలు వింటే మనసూ,,శరీరం చాలా తేలికైనట్లు అనిపించి చక్కటి నిద్రపట్టడమే కాకుండా మరుసటి రోజూ చాలా ఉత్సాహంగా మనలని ఉంచేలా చేస్తాయికూడా ఇవి...


పోనీ శాస్త్రీయ సంగీతం వినడం బోర్ అనుకుంటే నెట్లో మనకి చక్కగా సముద్రపు అలల చప్పుడు,,అడవిలో వర్షం పడుతున్నప్పుడు ఆకులు చేసే సవ్వడి,,సాయంత్రాన నిశ్చలమైన సరస్సు దగ్గర ఉండే ప్రశాంత వాతావరణం తాలూకు శబ్దాలన్నీ కూడా దొరుకుతున్నాయి...లేకపోతే బీ..వీ పట్టాభిరాం లాంటి హిప్నాటిస్ట్లచే రూపొందించబడిన రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా దొరుకుతున్నాయి... ఇవి వింటూ పడుకున్నా హాయిగా నిద్ర పడుతుంది..

ప్రయత్నించి చూడండి..

శుభరాత్రి :)

- Kks Kiran

28 మార్చి, 2016

100% నిజం



" మహా మహా పండితులతోనూ,విద్వాంసులతోనూ,వేదాంతులతోనూ మాట్లాడడం కష్టంకాకపోవచ్చు, కానీ బంగారాలు, బెనారస్ పట్టుచీరలే తన ఎచీవ్మెంట్గా భావించే స్త్రీలతో మాట్లాడడం మాత్రం చాలా కష్టం....!!! "

- Kiran

24 మార్చి, 2016

వివాహానికి ముందు ఆలోచించాల్సిన విషయం



కొంతమంది ఆడపిల్లలని చూస్తే చాలా జాలి కలుగుతూ ఉంటుంది...పూర్తిగా జీవితం అంటే అవగాహన వారికి కలగనప్పుడే వాళ్ళకి పెళ్ళి చేసి వారి కలలు,, ఆశయాలు,, జీవితాలను నాశనం చేసేస్తూ ఉంటారు కొందరు మూర్ఖులైన పెద్దలు...

ఇంకా ఇప్పుడు తక్కువ వయసులోనే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి? అని అనుకోవచ్చు కానీ పల్లెల్లో ఇంకా అలానే జరుగుతాయి... ఇదేం దరిద్రమో ఈ మనుష్యుల్లో అర్ధంకాదు కానీ, స్త్రీకి వ్యక్తిత్వం ఉంటే తమ స్వార్ధానికి అడ్డు అవుతుందని స్త్రీకి విద్య కొంతమాత్రమే చెప్పించి తర్వాత మానిపించే వెధవలు ఇంకా ఉన్నారు సమాజంలో.అంతెందుకు స్త్రీ వ్యక్తిత్వాన్ని గౌరవించి (అసలు గుర్తించే భర్తలు ఎంతమందిలే? ) ఆమెతో మర్యాదగా నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఈ సమాజంలో???

కొంతమంది అమ్మాయిలకి ఆమె వయసుకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులతో వివాహం చేస్తూ ఉంటారు... ఇదెంత మూర్ఖమైన చర్యో...వయసు పెరిగే కొద్దీ మనిషి అభిప్రాయాల్లో ఎన్నీ మార్పులు వచ్చేస్తాయి...ఈవయసులో గొప్పగా అనిపించిన ఓ విషయం తర్వాత కొంత కాలానికి అర్ధంలేని విషయంగా అనిపించవచ్చు....ఇది అభిప్రాయబేధాలును కలగచేసే విషయం అవ్వచ్చు కదా దంపతుల మద్య??? సమవయస్కుల మధ్య వివాహం అయితే ఆలోచనలు,, అభిప్రాయాలు,అభిప్రాయాలు ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది కదా?? అవేం పట్టించుకోకుండా " జాతకాలు కలిస్తే చాలు పెళ్ళి చేసేయచ్చు " అని అనుకుంటారు ఏంటో చాలామంది పెద్దలు.....

ఒక్క అమ్మాయిలకనే కాదు....కొందరు అబ్బాయిలకైనా సరే... " మాకు పెళ్ళి అయితే చాలు,ఆ అమ్మాయి అభిరుచులు ఎలాంటివైతేనేం? వ్యక్తిత్వం ఊసే మాకు పట్టింపు లేదు " అనే ధోరణిలో చంకలు గుద్దుకుంటూ,,సంబరపడిపోతూ పెళ్ళి చేసుకుంటూ ఉంటారు.....

జీవితంలో ఎక్కడైనా,ఎప్పుడైనా ఎంపిక చేసుకోవడంలో పొరపాటు చెయ్యచ్చేమో కానీ భాగస్వామి విషయంలో మాత్రం చాలా జాగర్తగా ఎంపిక చేసుకోవాలి... నీ భావాలకి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకోకపోతే ఇక బ్రతుకంతా " నిర్లిప్తత" అనే గృహంలో గడపాల్సిందే...!!!

ఏ తెల్లారిపూటో పక్కమీద నుంచి లేచేముందు ఆమె తలని నీ గుండెలపై ఆనుచుకుని ఆమె ముంగురులు త్రిప్పుతూ కనీసం ఓ 5 నిముషాలు అయినా మాట్లాడాలని నీకనిపించిందనుకో,,

 " వద్దండీ,, పాలోడు ఎవరూ లేరని పాలు పోయకుండా వెళ్ళిపోతాడేమో " అనో లేక " మజ్జిగ తోడు పెట్టుకోవాలండీ,లేకపోతే పాలు పాడయిపోతాయి " అనే పెళ్ళంతో ఇంకేం కాపురం చేస్తావ్???  జీవితంపై ఒక్కసారిగా విరక్తి వచ్చేయ్యదూ అలాంటి ప్రవర్తన భాగస్వామి నుంచి ఎదురైతే....." ఇహ సంసారే బహు దుఖారే " అని పాడుకుంటూ సన్యాసంలోకి పారిపోవాలనిపిస్తుంది ఆ క్షణం...  అందుకే భాగస్వామిని ఎంపిక విషయంలో చాలా జాగర్త ఉండాలి...

నీ భావాలను అర్ధం చేసుకుని గౌరవించి ప్రవర్తించే వ్యక్తి దొరకనంత వరకూ ప్రేమలో పడకూడదూ,, పెళ్ళీ చేసుకోకూదదు... పెళ్ళి ఒక్కటే జీవిత లక్ష్యం కాదుకదా???  దానికోసమే అంత వెంపర్లాడిపోవక్కర్లేదు... ఇంకా ఎన్నో ఉన్నాయి జీవితంలో ఆనందాన్ని ఇచ్చేవి... కాస్త సమయం మించిపోతున్నట్లు అనిపించినా వేచి ఉండడమే మంచిదని నా అభిప్రాయం...

ఇంతా ఎందుకు చెప్పానంటే " వివాహం అనేది కేవలం శారీరక దగ్గరతనం కోసమే కాదు... మానసిక దగ్గరతనం కోసం కూడా చేసుకోవాలని " చెప్పడం కోసమే...

ఆ మానసికపరమైన దగ్గరతనం లేకనే చాలామంది దంపతులు బ్రతుకుతున్నారు జీవచ్చవాలలా ఏ విధమైన కొత్త అనుభూతులూ,, అనుభవాలు తమ వైవాహిక జీవనం నుంచి దొరక్క...

చాలామంది దంపతులు సమాజం కోసమనో, పిల్లల భవిష్యత్తు కోసమనో,,చివరి వయసులో సెక్యూరిటీ కోసమనో కాపురాలు  కొనసాగిస్తున్నారు తప్ప నిజంగా ప్రేమ ఉండి కాదు(ఎటొచ్చీ అవతలివారిపై నేను లేకుండా ఎలా బ్రతకగలరో??  అనే జాలివల్లకూడా కాపురాలు నిలబడుతూ ఉండచ్చు...)

అలాంటి వాళ్ళకోసమే,,కనీసం కొందరి ఆలోచనా విధానాలలో అయినా మార్పు రావచ్చనే ఆశతో  ఇదంతా రాశాను...కొందరి ఆలోచనా విధానమైనా మారితే సంతోషమే...!!!

శుభసాయంత్రం :) :) :)

- Kiran