కొంతమంది ఆడపిల్లలని చూస్తే చాలా జాలి కలుగుతూ ఉంటుంది...పూర్తిగా జీవితం అంటే అవగాహన వారికి కలగనప్పుడే వాళ్ళకి పెళ్ళి చేసి వారి కలలు,, ఆశయాలు,, జీవితాలను నాశనం చేసేస్తూ ఉంటారు కొందరు మూర్ఖులైన పెద్దలు...
ఇంకా ఇప్పుడు తక్కువ వయసులోనే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతున్నాయి? అని అనుకోవచ్చు కానీ పల్లెల్లో ఇంకా అలానే జరుగుతాయి... ఇదేం దరిద్రమో ఈ మనుష్యుల్లో అర్ధంకాదు కానీ, స్త్రీకి వ్యక్తిత్వం ఉంటే తమ స్వార్ధానికి అడ్డు అవుతుందని స్త్రీకి విద్య కొంతమాత్రమే చెప్పించి తర్వాత మానిపించే వెధవలు ఇంకా ఉన్నారు సమాజంలో.అంతెందుకు స్త్రీ వ్యక్తిత్వాన్ని గౌరవించి (అసలు గుర్తించే భర్తలు ఎంతమందిలే? ) ఆమెతో మర్యాదగా నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఈ సమాజంలో???
కొంతమంది అమ్మాయిలకి ఆమె వయసుకంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులతో వివాహం చేస్తూ ఉంటారు... ఇదెంత మూర్ఖమైన చర్యో...వయసు పెరిగే కొద్దీ మనిషి అభిప్రాయాల్లో ఎన్నీ మార్పులు వచ్చేస్తాయి...ఈవయసులో గొప్పగా అనిపించిన ఓ విషయం తర్వాత కొంత కాలానికి అర్ధంలేని విషయంగా అనిపించవచ్చు....ఇది అభిప్రాయబేధాలును కలగచేసే విషయం అవ్వచ్చు కదా దంపతుల మద్య??? సమవయస్కుల మధ్య వివాహం అయితే ఆలోచనలు,, అభిప్రాయాలు,అభిప్రాయాలు ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది కదా?? అవేం పట్టించుకోకుండా " జాతకాలు కలిస్తే చాలు పెళ్ళి చేసేయచ్చు " అని అనుకుంటారు ఏంటో చాలామంది పెద్దలు.....
ఒక్క అమ్మాయిలకనే కాదు....కొందరు అబ్బాయిలకైనా సరే... " మాకు పెళ్ళి అయితే చాలు,ఆ అమ్మాయి అభిరుచులు ఎలాంటివైతేనేం? వ్యక్తిత్వం ఊసే మాకు పట్టింపు లేదు " అనే ధోరణిలో చంకలు గుద్దుకుంటూ,,సంబరపడిపోతూ పెళ్ళి చేసుకుంటూ ఉంటారు.....
జీవితంలో ఎక్కడైనా,ఎప్పుడైనా ఎంపిక చేసుకోవడంలో పొరపాటు చెయ్యచ్చేమో కానీ భాగస్వామి విషయంలో మాత్రం చాలా జాగర్తగా ఎంపిక చేసుకోవాలి... నీ భావాలకి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకోకపోతే ఇక బ్రతుకంతా " నిర్లిప్తత" అనే గృహంలో గడపాల్సిందే...!!!
ఏ తెల్లారిపూటో పక్కమీద నుంచి లేచేముందు ఆమె తలని నీ గుండెలపై ఆనుచుకుని ఆమె ముంగురులు త్రిప్పుతూ కనీసం ఓ 5 నిముషాలు అయినా మాట్లాడాలని నీకనిపించిందనుకో,,
" వద్దండీ,, పాలోడు ఎవరూ లేరని పాలు పోయకుండా వెళ్ళిపోతాడేమో " అనో లేక " మజ్జిగ తోడు పెట్టుకోవాలండీ,లేకపోతే పాలు పాడయిపోతాయి " అనే పెళ్ళంతో ఇంకేం కాపురం చేస్తావ్??? జీవితంపై ఒక్కసారిగా విరక్తి వచ్చేయ్యదూ అలాంటి ప్రవర్తన భాగస్వామి నుంచి ఎదురైతే....." ఇహ సంసారే బహు దుఖారే " అని పాడుకుంటూ సన్యాసంలోకి పారిపోవాలనిపిస్తుంది ఆ క్షణం... అందుకే భాగస్వామిని ఎంపిక విషయంలో చాలా జాగర్త ఉండాలి...
నీ భావాలను అర్ధం చేసుకుని గౌరవించి ప్రవర్తించే వ్యక్తి దొరకనంత వరకూ ప్రేమలో పడకూడదూ,, పెళ్ళీ చేసుకోకూదదు... పెళ్ళి ఒక్కటే జీవిత లక్ష్యం కాదుకదా??? దానికోసమే అంత వెంపర్లాడిపోవక్కర్లేదు... ఇంకా ఎన్నో ఉన్నాయి జీవితంలో ఆనందాన్ని ఇచ్చేవి... కాస్త సమయం మించిపోతున్నట్లు అనిపించినా వేచి ఉండడమే మంచిదని నా అభిప్రాయం...
ఇంతా ఎందుకు చెప్పానంటే " వివాహం అనేది కేవలం శారీరక దగ్గరతనం కోసమే కాదు... మానసిక దగ్గరతనం కోసం కూడా చేసుకోవాలని " చెప్పడం కోసమే...
ఆ మానసికపరమైన దగ్గరతనం లేకనే చాలామంది దంపతులు బ్రతుకుతున్నారు జీవచ్చవాలలా ఏ విధమైన కొత్త అనుభూతులూ,, అనుభవాలు తమ వైవాహిక జీవనం నుంచి దొరక్క...
చాలామంది దంపతులు సమాజం కోసమనో, పిల్లల భవిష్యత్తు కోసమనో,,చివరి వయసులో సెక్యూరిటీ కోసమనో కాపురాలు కొనసాగిస్తున్నారు తప్ప నిజంగా ప్రేమ ఉండి కాదు(ఎటొచ్చీ అవతలివారిపై నేను లేకుండా ఎలా బ్రతకగలరో?? అనే జాలివల్లకూడా కాపురాలు నిలబడుతూ ఉండచ్చు...)
అలాంటి వాళ్ళకోసమే,,కనీసం కొందరి ఆలోచనా విధానాలలో అయినా మార్పు రావచ్చనే ఆశతో ఇదంతా రాశాను...కొందరి ఆలోచనా విధానమైనా మారితే సంతోషమే...!!!
శుభసాయంత్రం :) :) :)
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి