" ఈ మెసేజ్ ను పూర్తి గా చదవండి
ఆంజనేయుడికి ఏడు పేర్లు
1. హనుమంతుడు
2. శ్రీ రామధూత
3. లక్ష్మణప్రాణదాత
4. కపిసేననాయక
5. మహావీరాయ
6. వానరాయ
7. సర్వరోగహరాయ
ఈ ఏడు పేర్లు 20 మందికి పంపండి..వచ్చే ఆదివారం లోపు
ఒక మంచి వార్త వింటారు.
వింటారు ఇది 100% నిజం.. Don't Neglect Plz " అని.
ఆ అమ్మాయికి ఇలా రిప్లై పెట్టాను నేను.
" చెవిలో పువ్వు కబుర్లు ఇవి.
నేను నిన్నే సవాలక్ష మంచి విషయాలు విన్నాను..
దానికోసం ఆదివారం వరకూ ఆగాలా చెప్పు?
అయినా ఆంజనేయుల స్వామి వాట్సాప్ వెబ్ సర్వర్ ముందు కూర్చుని ఎవరైతే ఈ మెసెజ్ పంపారో వాళ్లకే మంచి ఇస్తాననే కాంసెప్ట్ ఏమైనా పెట్టుకున్నాడా ఏమిటి వేరే ఏ పనీ లేకుండా?? నా ఉద్దేశంలో ఆయనకి అంతకన్నా గొప్ప పనులుంటాయే??? ఆ పనులన్నీ ఆయన మానేసి ఇదే ఉద్యోగంగా ఆయన చేస్తాడని నేననుకోను మరి..
అందుకే నేనెవరికీ ఈ మెసేజ్ పంపను...పంపమని చెప్పే నీలాంటివాళ్ళని కూడా ప్రోత్సహించను " అని అన్నాను...
పాపం ఇంకేమంటుంది నా అభిమాని నాతో. " ఈ వెధవ గురించి తెలిసికూడా నేనిలా వాడికి మెసేజ్ పంపడమే తప్పనుకుంట " అని తన ఈ చర్యకి తానే తిట్టుకుని ఉంటుంది..
(అయినా నాకేం మొహమాటం లేదు ఈ మాటలనడానికి.. దేవుడి పేరిట అర్ధంలేని భయాలూ,,నమ్మకాలూ కల్పించి చేసే ప్రచారాలంటే అంత మంట నాకు.వాటిని మరో ఆలోచన లేకుండా పాటించేవారంటే ముందే మంట... )
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి