14 జులై, 2016

నిజమైన ఆధ్యాతిక జీవన విధానమేది?


వేల్పూరులోని మాఇంటికి దగ్గర్లోనే " రమణమహర్షి ఆశ్రమం " అని ఓ ఆశ్రమం ఉంది...అక్కడ ఉండే ఆ వ్యక్తి ఒక గోచీ తప్ప  మరేదీ ధరించడు...ఏ మాటా మాట్లాడడు కూడా...చిన్నప్పటినుంచీ ఇంతేనట...!! ఆయనని చాలా గొప్పగా భావిస్తూ ఉంటారు ఇక్కడి జనం....ఇంకా ఇతరత్రా ప్రదేశాలనుంచి వచ్చి కూడా కొంతమంది వృద్దులు ఆ ఆశ్రమంలోకొన్ని రోజులు గడిపివెళ్తూ ఉంటారు తమ ఇళ్ళకి మళ్ళీ.......అంతా బానేఉంది,,ఎవరికీ ఈ విషయంలోనష్టంకూడాఏమీలేదు.... ఓకే.. ఆ సంగతిపక్కనెడితే

ఓరోజు నేనూ మా తమ్ముడు పొద్దున్నపూట అలా ఆ వైపుగా మార్నింగ్ వాక్కి వెళ్తూ "సరే ఏముందో ఇక్కడ చూద్దాం " అని ఆ ఆశ్రమంలోకి వెళ్ళాము...నిజంగా చాలా నిశబ్దంగా,,చక్కగా చుట్టూరా పచ్చదనంతోనిండి,,ప్రశాంతంగా,,ఆహ్లాదకరంగా ఉంది ఆ ప్రదేశమంతా....

లోపలకి వెళ్ళాక ఆ వ్యక్తి రాసిన బోధలు,,ఓ పుస్తకమూ చదివాము... " మనిషికి కోరికలపై ఆసక్తి తగదు,,కోరికలవెంట పరిగైత్తి నీ జీవితాన్ని వ్యర్ధం చేసుకోకు " ఇలాంటి ఇలాంటి విషయవైరాగ్యపు భావనలు ఎక్కువైనాయి అందులో....

అవి చూసి నా తమ్ముడిని అడిగానునేను " ఒరే కోరికలు ఎక్కువ ఉన్న మనిషి సుఖంగా ఉంటాడా? లేక కోరికలు లేని మనిషి ఎక్కువ సుఖంగా ఉంటాడా ? నీ అభిప్రాయం చెప్పు దీనిపై..... " అని..

వాడు " కోరికలు లేని మనిషే ఎక్కువగా సంతోషంగా ఉంటాడురా నిజానికి.... కోరికలు ఎక్కువైతే ఇంకా ఏదో కావాలనే ఆరాటమూ పెరుగుతుంది కదా మనిషికి??దానితో వాడికి సంతృప్తి దూరం అవుతుంది రాన్రానూ " అని అన్నాడు.

అందుకునేను " బాగా చెప్పావురా....కానీ కోరికలు లేని మనిషి అలాఎంత కాలం సంతోషంగా ఉండగలడంటావ్? ఎందుకంటే ఎంత గొప్ప జీవనవిధానమైనా రోజూ ఒకేలాఉంటే మనిషికి బోర్ కొట్టేస్తుంది కదా? ఎందుకంటే మనిషి స్వభావమే అది సహజంగా...రకరకాల అనుభవాలనూ,,అనుభూతులనూ కోరుతూ ఉంటుంది మనసు..ఇదిగో అప్పుడే ఇంకా ఏదో కావాలని అనిపించి కోరికలు ఉద్భవిస్తాయి మనిషికి.... ఏం అలా కోరుకోవడం తప్పంటావా ?

కామర్స్ చదువుతున్నావ్ కాబట్టీ వేదాంతాన్నీ,,వ్యవస్థనీ,,వ్యక్తి జీవితాన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నా ప్రశ్నలకి విశ్లేషణ చేసి సమాధానాలు చెప్పు? అని వాడినిలా అడిగాను...

" కోరికనేది ఉంది కాబట్టే మనిషికి ఇంతకన్నా బాగా బ్రతకాలనే కుతూహలం మొదలై నాగరికతనూ,,ఇన్ని రకాలవ్యవస్థలనూ ఏర్పర్చుకున్నాడు తన కోసం...ఆకలీ,,కామం అన్ని జీవులకీ ఒకటైనా మనిషికీ వాటికీ ఇంత తేడా ఉండడానికిగలకారణం అతనికి ఉన్న విషయజ్ఞానం అయితే రెండోది ఈరోజుకన్నా రేపు బాగుండాలి,,ఉన్నతంగా,,మరింత సౌఖ్యంగా తాను బ్రతకాలనే కోరిక ఉండడంవల్లనే...అదేలేకపోతే మనిషికీ,జంతువుకీ బేధమేం ఏం ఉండదు.. ఇప్పుడు చెప్పు మనిషికి కోరికలవల్ల  ధుఖ్ఖం కలుగుతోందని కోరికకే దూరంగా ఉండమని చెప్పడం ఎంతవరకూ సమంజసం? " అని...

అప్పుడువాడు " కొన్ని విషయాలను జనరలైజ్ చేసి చెప్పలేమురా ఎందుకు ఈ ప్రపంచం ఇలా ఉందని?ఈ ఈ నమ్మకాలతో ఎందుకు బ్రతుకుతోందని...కానీ నువ్వన్నది నిజం..కోరికలను దుఖ్ఖహేతువులని విడిచిపెట్టడం మాత్రం చాలా తప్పు..దానివల్ల వ్యవస్థ అంతా ఏ ఉత్సాహమూలేనట్లు స్తబ్దుగా చైతన్యరహితంగా ఉంటుంది...కోరికలులేని మనుషులున్న సమాజం ఏం అభివృద్దీ చెందదుకూడా...ఈ వేదాంతులూ వాళ్ళూ చెప్పే ఈ కబుర్లను ఆచరణలో పెట్టాలని చూశామా వ్యవస్థకేకాదు వ్యక్తికే చిరాకేస్తుంది తన జీవితంపట్ల తర్వాతతర్వాత...వీళ్ళూహించినంత గొప్పగా మాత్రం ఖచ్చితంగా ఉండదు...కనుక మనిషి కోరిక విడవకుండా ఉండాలి సమాజనడవడికోసం...అలా అని తనకి అది మళ్లా హాని చేసేలా ఉండకూడదు..ఆ విచక్షణాజ్ఞానంతో మాత్రం మనిషి గడపాలని" అని అన్నాడు...

మా మాటలకేంగానీ మీ అభిప్రాయం ఏమిటి ఈ విషయంపై?

కర్మసన్యాసం గొప్పదా? కర్మఫల సన్యాసం గొప్పదా? ఏది నిజమైన ఆధ్యాత్మిక జీవన విధానమనిపించుకుంటుంది?


- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి