ఇతరత్రా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇతరత్రా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

09 ఆగస్టు, 2017

రాఖీపండగ సందర్భంగా అబ్బాయిలకి గంధర్వుడు ఇచ్చిన ప్రత్యేకమైన ఓ వరం 😜

" బాబోయ్ అసలే రేపు రాఖీపండగ 🙅 మా చెల్లే నాకు రాఖీ కట్టేందుకు కుదరట్లేదు ఈ సంవత్సరం ,, అలాంటిది నాకేమాత్రం పరిచయం లేని అమ్మాయిలెవరైనా రేప్పొద్దున్న నాకెదురై " అన్నయ్యా " అనే ఓ అపభ్రంశపు మాటని ఒకటి ఉఛ్ఛరిస్తూ ఎక్కడ నాకు రాఖీ కడతానంటారో .....!!! 😱 " అని నిన్న రాత్రి నేను భయపడుతూంటే ఈ తెల్లారుజామున నా కలలో ఓ గంధర్వుడు కనపడి 

" ఈరోజు రాఖీ పండగ అని భయపడకయ్యా కిరణూ....!!! మీ చెల్లెలు కాకుండా వేరే ఏ అమ్మాయైనా నిన్ను ' అన్నయ్యా ' అని సంభోదిస్తూ అక్కర్లేని వరసోటి కలిపి నీకు రాఖీ కట్టాలని చూసినా,, " రాఖీపండగ శుభాకాంక్షలు " అని ఫేస్బుల్లో నిన్ను టాగ్ చేసినా ఆ అమ్మాయికి తొందరగా పెళ్ళికాదు 👵 ఆ రకంగా నీకు వరాన్నిస్తున్నానయ్యా 😜 ,, సరేనా.... !!! " అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ గంధర్వుడు ✋

" ధన్యోస్మి స్వామీ,, ధన్యోస్మి .... ఇలాంటి వరాన్నే మా అబ్బాయిలందరూ ఈరోజు కోరుకొంటున్నారు 😟😵 మరి వాళ్ళ అందరికీ కూడా ఇదే వరం అప్లై అయ్యే Chance ఏమీ లేదా ?? " అని గబాల్న అడుగుదామని అని అనుకున్నాను లోకసంక్షేమార్ధం కానీ అప్పటికే ఆయన మాయమయిపోయాడు 👣 

పోన్లే దక్కిందల్లా దక్కింది - కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్న సామెత ఊరికే వచ్చిందా? పైగా తెల్లారుజామున వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయి కూడా 😉 అని సంతోషపడి కళ్ళు నులుముకుంటూ నిద్రలేచాను నేనీరోజు 😂

సో అదీ మాటర్ అమ్మాయిలూ....!!! కావాలంటే ఇప్పుడు ధైర్యం చేయండి మీకు దమ్ముంటే - మా మగజాతి తరపున నేను ధైర్యంగా నిల్చుంటా 🙆👅👊

( లేకపోతే రాఖీపండగ పేరు చెప్పి మా అబ్బాయిలని ఏటా భయపెడతారా?? ఆయ్ 😬😬😡😡 😈😈 😛😛 )

- Kks Kiran

రాఖీ సోదరుడా ? జాగ్రత్త 😜

అన్నా చెళ్ళెళ్ళ మధ్యో లేక అక్కా తమ్ముళ్ళ మధ్యో ఆప్యాయతా,, అవ్యాజమైన ప్రేమ ఉండి రాఖీ కట్టడం చాలా గొప్ప విషయం నిజానికి 👨‍👧 ✔

అలా‌కాకుండా సోదరభావాన్ని ఒత్తి పలుకుతూ ఓ అమ్మాయి ఓ అబ్బాయికి రాఖీ కడుతోందంటే దానర్ధం అతనిపై కూడా అంతే అప్యాయతా,, ప్రేమ ఉందని కాదు అన్ని సందర్భాలలోనూ

దాని అసలర్ధం నే చెప్పనా?

'' ఓరి వెధవా....!!! నేను నీతో బాగా మాట్లాడతా, , ఫ్రీగా మూవ్ అవుతా,, చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తాను కూడా,,
అది నువ్వు అలుసుగా తీసుకొని ప్రేమ, పెళ్ళి లాంటి ప్రసక్తి నా దగ్గరకు తెస్తావేమో....!!! ఆ Chance నీకివ్వకుండా నీ తోక కత్తిరించి నిన్ను అదుపులో పెట్టేందుకే నిన్ను ' అన్నయ్య ' ని చేస్తున్నాను ఈ విధంగా " అని దాని అసలంతరార్ధం 😛

అవునంటారా ? కాదంటారా ?? అమ్మాయిలూ ఈ స్టేట్మెంట్ ని ...!!! మీరే చెప్పండి నిజాయితీగా 😳 😉

- Kks Kiran

28 ఆగస్టు, 2016

కలలను Record చేసే పరికరం ఉండుంటే...!!!


" కలలని Record చేసుకుని ఆ తర్వాత Play చేసుకునే పరికరం ఏదైనా అందుబాటులోకి బాగుండును " అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు... ముఖ్యంగా కొన్నికొన్ని సార్లు ఉదయాన్నే " కొన్ని అద్భుతమైన కలలు వచ్చాయి " అని లీలగా ఆ కలలలోని విషయాలేవో కొన్ని గుర్తుకొచ్చి అనిపించినప్పుడు " అసలింతవరకూ ఇలాంటి పరికరాలను శాస్రవేత్తలు ఎందుకు ఆవిష్కరించలేదని " ? తీవ్రమైన బాధ కలుగుతూ ఉంటుంది నాకు. అలాంటి పరికరం ఒకటి లేకపోవడం వల్ల ఎన్ని అద్భుతమైన ఆవిష్కరణలు నా నుంచి ఈ ప్రపంచం పొందలేకపోయిందో కదా? అని విచారమేస్తూ ఉంటుంది ఒక్కోసారి నాకు అప్పుడు :p

ఓసారి ఇలాగే,, నేను డిప్లమా చదువుకునే రోజుల్లోనే ఓరోజు ఉదయం అద్భుతమైన కల ఒకటి వచ్చింది నాకు...

అదేంటంటే,,

నేను ఓ SpaceShipలో ఉండి అంతరిక్షలోని విషయాలపై రకరకాల పరిశోధనలు ఏవో చేస్తున్నానట. మెండలీవ్ మూలకాల ఆవర్తన పట్టిక ( mendeleev periodic table ) లో ఇంతవరకూ చేర్చని కొన్ని మూలకాలేవో రెండు కనుక్కున్నానంట. అదీకాక ఇంతవరకూ శాస్రవేత్తలు సోధించని ఓ గొప్ప ఆవిష్కరణ చేసానట నేను ... 

అదేంటంటే " శక్తి నిత్యత్వ సూత్రం ( Law Of Conservation Of Energy ) " ప్రకారం " శక్తిని మనం సృష్టించలేము.. అలాగే నాశనమూ చెయ్యలేము.. కానీ దానిని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చగలము ( Energy can neither be created nor destroyed; rather, it transforms from one form to another ) " కదా? 

అంటే ఇప్పటివరకూ మనం పదార్ధం నుంచి శక్తిని పొందగలుగుతున్నాం కానీ నేరుగా మనం పదార్ధం తయారుచెయ్యలేకపోతున్నాం శక్తి ద్వారా... అలా కాకుండా శక్తిని కొంచం గ్రహించి దాని నుంచి మనం కావాలనుకున్న పదార్ధాన్ని పొందగలిగే ఓ గొప్ప నూతన ఆవిష్కరణ ఏదో నేను చేశానట... ( ఫ్రాయిడ్ అంటాడు తన " Interpretation of dreams " అనే పుస్తకంలో " మన ఆలోచనలకి ప్రతిరూపాలే కలలు.. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అవే కలలుగా వస్తాయి " అని... మరి ఇలాంటి భారీ Science Fiction కల నాకెందుకు వచ్చిందో అప్పుడు? అనేది నేనెరగను మరి...!!! అంతకు ముందురోజు నేనేమీ సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడకపోయినా,, మరి ముఖ్యంగా ఆ తర్వాతి రోజు నాకేమీ Physics Exam లేకపోయినా సరే ఈ కల ఎందుకు వచ్చిందో మరి ;) )

నా ఈ పరిశోధన మొత్తం అప్పటివరకూ ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని విపరీతంగా ప్రభావితం చేసిందట... మనుష్యుల జీవితాలలో గొప్ప గణనీయమైన మార్పు తీసుకొచ్చిందట. నా ఈ పరిశోధనకి మెచ్చి నోబెల్ బహుమతి కూడా ప్రకటించారట నాకు..

నోబెల్ నిర్వాహకులు సరిగ్గా స్టేజ్ పైకి నన్ను పిలిచి నా పరిశోధన యొక్క సారాంశాన్ని చదివి వినిపిస్తూ ఉండగా వివిధ రంగాలకి చెందిన శాస్త్రవేత్తలూ,మేధావుల కరతాళ ధ్వనుల మధ్య నేనా నోబెక్ల్ ప్రైజ్ అందుకుందామని స్టేజ్ పైకి ఆనందంతో ఆత్రపడుతూ ఎక్కుతూ ఉండగా,,

" కాలేజ్ టైం అవుతోందిరా,, ఎంతసేపా మొద్దు నిద్ర ఇందాకటి నుంచీ లేపుతూ ఉంటేనూ? టైం అప్పుడే ఆరున్నరైంది, ఇక చదువుకోవడం అదీ ఏదీ లేదేంటి " అనే సుప్రభాత రాగంతో మా అమ్మమ్మ నన్ను నిద్రలేపేసింది బలవంతంగా :( 

" అయ్యో...!!! ఇంకొక్క రెండు నిముషాలుండచ్చుకదే??? నోబెల్ బహుమతి ఇప్పుడే ఇస్తూంటేనూ...!!! " అని అన్నాను నేను నిద్రమత్తు ఇంకా వదలక విసుగ్గా...

పిచ్చోడిని చూసినట్లు చూసింది మా అమ్మమ్మ నన్ను ఉదయాన్నే సంధి ప్రేలాపన పేలుతున్నానని... అదేం పట్టించుకోకుండా చాలాసేపు ఆలోచించాను నేనా కల గురించి..

" ఏమేం సూత్రాలతో ఆ ఆవిష్కరణ చేశాను నేను? ఏమేం ఈక్వేషన్లు దానికి ఉపయోగించాను? " ఇలాంటి విషయాలు ఏమైనా గుర్తొస్తాయేమోనని చాలాసేపే ప్రయత్నించాను, కానీ ఏ ఒక్క విషయమూ గుర్తుకు రాలేదు నాకు...

అప్పుడనిపించింది నాకు ఇలా " కలలలని రికార్డ్ చేసుకునే పరికరం ఉండుంటే ఎంతబాగుండునో కదా ? " అని. అది లేక ఆ విధంగా ఓ గొప్ప ఆవిష్కరణ దక్కకుండా పోయింది ఈ ప్రపంచానికి :P

ప్చ్చ్ "



- Kks Kiran

25 ఆగస్టు, 2016

దొంగతనంగా తినే పాలమీగడల రుచి



ఇంట్లో వాళ్ళకి తెలీయకుండా తినే పాలమీగడలు,,

సరదాకి దొంగతనంగా కోసి తినే జామకాయలు ,, 

వీటికి ఉన్నంత రుచి మరి వేటికీ ఉండవు ;) ;)

ఏమంటారు??

నిజం కాదా చెప్పండి???

-  Kks Kiran

04 జులై, 2016

మగవారు ఆడవాళ్ళతో తప్పకుండా ఆడే అబద్దాలు ఏంటంటే?



" సాధారణంగా మగవారు ఆడవారితో 7 అబద్దాలు తప్పకుండా ఆడతారు.

1. భార్య పక్కన ఉండగా మరో అమ్మాయిని చూసినప్పుడు

2. కలల విషయంలో

3. భార్య చెప్పిన పని చెయ్యనప్పుడు

4. భార్యని ఊరికి పంపేటప్పుడు

5. భార్య చెప్పే విషయం అన్యమనస్కంగా వింటున్నప్పుడు

6. ఏదైన తెలియని విషయం భార్య ప్రస్తావించినప్పుడు 

7. వ్యసనాలకి బానిస అయినప్పుడు.

కొన్ని నిజాలు ఆడవారు కనిపెట్టినా భర్తలు తెలియనట్లే వ్యవహరిస్తారట, 

అలా భర్త అబద్ధాలు చెప్పడంలో కొందరు తమకు భర్త ఎంత విధేయుడిగా ఉంటున్నడో అని అంచనా కూడా వేసుకుంటారట.

ఇరుగుపొరుగు వారితో ఆ విషయం చెప్పి మురిసిపొతూఉంటారట. "

- Kks Kiran

28 మార్చి, 2016

Marketing Concepts



ఒక IIM లో ప్రొఫెసర్ Marketing Concepts గురించి
ఎలా వివరించాడో చూడండి…

1. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు.
మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, “నేను చాల
ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగితే అది –
“Direct Marketing”

2. మీరు మీ స్నేహితులతో పార్టీ లో ఉన్నారు. మీకొక
అందమైన అమ్మాయి తారసపడింది. మీ
స్నేహితుడొకడు ఆమె దగ్గరకు వెళ్ళి మీకేసి చూపిస్తూ ,
“ఆయన చాల ధనవంతుడు. ఆయన్ని పెళ్ళి చేసుకోండి”
అంటే అది -”Advertising”

3. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు.
మీరు ఆమె దగ్గరికెళ్ళి కాస్సేపు మాట్లాడి, ఆమె నంబర్
తీసుకున్నారు. మరునాడు ఆమెకి కాల్ చేసి “నేను చాల
ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడుగుతారు.
అది – “Telemarketing”

4. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు.
ఆమె ని చూడగానే మీరు మీ టై సరిచేసుకొని, ఆమె
దిగుతున్న కార్ డోర్ తెరిచి, లగేజ్ చేతిలోకి తీసుకొని, ఆమెని
లోనికి తీసుకెళ్ళి, చేతికి ఒక డ్రింక్ అందించి,
“మీకు తెలుసో లేదో..నేనొక ధనవంతున్ని.నన్ను పెళ్ళి
చేసుకోండి” అంటారు. అది -”Public Relations”

5. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు.
ఆ అమ్మాయె మీ దగ్గరకు వచ్చి “మీరు చాల ధనవంతులని
వన్నాను. నన్ను పెళ్ళి చేసుకుంటారా?” అని అడిగుతుంది.
అది “Brand Recognition”

6. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు.
మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, “నేను చాల
ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగారు. ఆమె
మీ చెంప ఛెళ్ళుమనిపించింది. అది -”Customer
Feedback”

7. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు.
మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి, ” నేను చాల
ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగారు. ఆమె
తన భర్తని మీకు పరిచయం చేసింది. అది -”Demand
and Supply gap”

8. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు.
మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళేలోగా మరొకడు వెళ్ళి ఆమె
తో ” నేను చాల ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని
అడిగాడు. ఆమె అతనితో వెళ్ళిపొయింది. అది
-”Competition eating into your market
share”

9. మీరు పార్టీ లో ఒక అందమైన అమ్మాయి ని చూసారు.
మీరు నేరుగా ఆమె దగ్గరకు వెళ్ళి ” నేను చాల
ధనవంతున్ని. నన్ను పెళ్ళి చేసుకోండి” అని అడిగేలోగా మీ
భార్య వెంకనుండి వచ్చి మొట్టికాయ వేసింది. అది
-”Restriction for entering new markets”