కంచిలో ఉన్న ప్రాచీనమైన ఆలయాలలో ప్రసిద్ధమైనది ఈ " వైకుంఠ పెరుమాళ్ దేవాలయం "
పల్లవ రాజులచే ఆరవ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ ఆలయం వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే 108 దివ్య క్షేత్రాలలో ఒకటి.. ఈ ఆలయంలో మొత్తం మూడు అంతస్తులున్నాయి
మొదటి అంతస్తులో విష్ణువు కూర్చున్న భంగిమలో ఉండగా , రెండవ అంతస్తులో నుంచుని ఉన్నట్లుగా , ఆ పై అంతస్తులో శయన రూపంలో దర్శనమిస్తున్నట్లుగా విగ్రహాలు రూపుదిద్దబడ్డాయి
కాలము వల్లనైతేనేమి , సరైన నిర్వహణ లేకపోవడం వల్లనైతేనేమీ చాలావరకు ఈ ఆలయం , అందులోని శిల్పాలు బాగా పాడయ్యాయి
అందుచేతే ఈ ఆలయంలో కేవలం మొదటి అంతస్తులోని మూర్తినే మనం దర్శించుకునే అవకాశం ఉంది
- Kks Kiran
ప్రయాణాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రయాణాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
19 సెప్టెంబర్, 2019
కైలాసనాధుని ఆలయం , కాంచీపురం 🙏
ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక అనుభవాలను అందించే ప్రదేశాలే కావు
అవి మన సంస్కృతి యొక్క గత వైభవానికి చిహ్నాలు - అప్పటి ప్రజల కళాత్మక జీవనవిధానానికి ఓ మచ్చుతునకలు కూడా
అందుకు ఉదాహరణ కాంచీపురంలోని ఈ కైలాసనాధ్ ఆలయం 🙏
- Kks Kiran
అవి మన సంస్కృతి యొక్క గత వైభవానికి చిహ్నాలు - అప్పటి ప్రజల కళాత్మక జీవనవిధానానికి ఓ మచ్చుతునకలు కూడా
అందుకు ఉదాహరణ కాంచీపురంలోని ఈ కైలాసనాధ్ ఆలయం 🙏
- Kks Kiran
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)