సంగీతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సంగీతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10 అక్టోబర్, 2017

త్యాగరాజ పంచరత్న కృతులలో మొదటి కృతి




కృతి :- జగదానందకారక ,, రాగం :- నాట - ఆది తాళం ,, రచన :- త్యాగరాజస్వామి _/\_


" జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక
గగనాధిప సత్కులజ రాజరాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల ॥జగ॥

అమర తారక నిచయ కుముదహిత పరిపూర్ణానఘ
ధరసురభూజ దధిపయోధి వాసహరణ
సుందరతరవదన సుధామయ వచోబృంద గోవింద
సానంద మావరాజరాప్త శుభకరానేక ॥జగ॥


నిగమ నిరజామృతజ పోషకానిమషవైరి
వారిది సమీరణ ఖగతురంగ సత్కవి హృదాలయ
అగణిత వానరాధిప నతాంఘ్రియుగ ॥జగ॥


ఇంద్రనీలమణి సన్ని భావఘన
చంద్ర సూర్యనయనా ప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమనవైరి సన్నుత ॥జగ॥


పాద విజిత మౌనిశాప సవ పరిపాల వరమంత్రగ్రహణలోల
పరమశాంతచిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల ॥జగ॥


సృష్టిస్థిత్యంతకారక అమిత కామితఫలద అసమానగాత్ర శచీపతి నుతాబ్ధిమదహర అనురాగ రాగరాజిత కథాసారహిత ॥జగ॥




సజ్జనమానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపుకరాబ్జ లాలిత చరణ అవగుణాసుర గణమదహరణ సనాతనాజ నుత ॥జగ।।


ఓంకార పంజరకీర పురహర
సరోజ భవ కేశవవాది రూప
వాసవ రిపు జనకాంతక కలాధర
కకాధరాప్త ఘృణాకర
శరణాగత జనపాలన సుమనోరమణ
నిర్వికార నిగమ సారతర ॥జగ॥


కరదృత శరజాలాసుర మదాపహరణావనీసుర సురావన కనీస బిలజ మౌనికృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజ సన్నుత ॥జగ॥


పురాణపురుష నృవరాత్నజాశ్రిత-
పరాధీన ఖరవిరాధరావణ
విరావణ అనఘ పరాశర మనో-
హరావికృత త్యాగరాజసన్నుత ॥జగ॥


అగణితగుణ కనకచేల సారవిదళన
అరుణాభ సమాచరణ
అపారమహిమాద్భుత సుకవిజన హృత్సదన సురమునిగణిత విహిత
కలశనీరనిధిజారమణ పాపగజనృసింహ
వర త్యాగరాజాదినుత  ॥జగ॥ ""

09 ఆగస్టు, 2017

నాకిష్టమైన త్యాగరాజ కృతి


రాగం- వసంత రాగం ,, రచన :- త్యాగరాజ స్వామి _/\_

"" సీతమ్మ మాయమ్మ శ్రీ రాముడు మా తండ్రి

వాతాత్మజ సౌమిత్రి వైనతేయరిపుమర్దన

ధాత భరతాదులు సోదరులు మాకు ఓ మనసా…

పరమేశ వశిష్ట పరాశర నారద శౌనక శుక సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు

ధర నిజ భాగవతాగ్రేసరులేవరో వారేల్లరు వర త్యాగరాజునికి పరమ బాంధవులు మనసా....!!! ""

08 ఏప్రిల్, 2017

అన్నమాచార్యుని కీర్తనకి భావార్ధ వివరణ

కీర్తనలైనా, కృతులైనా వింటున్నప్పుడు కేవలం ఆ శబ్ద సౌందర్యానికే ముగ్దులవక వాటి భావం,, ఆ పద ప్రయోగానికి అర్ధం తెలుసుకుంటూ వినడం అలవాటుగా చేసుకుంటే మన భాష తాలూకు సౌందర్యం,, మన వాగ్గేయకారుల గొప్పదనం అర్ధమవుతాయి...

ఉదాహరణకు అన్నమాచార్యుల కీర్తనలలో ఒకటైన " శరణు శరణు సురేంద్ర సన్నుత " అనే కీర్తనకు ఈ భావ వివరణ చూడండి,, ఎంత గొప్పగా ఉందో ....!!!!


"" ఓ వేంకటేశ్వర స్వామీ ! దేవేంద్రుని చేత పొగడ్తలందుకునేవాడా, లక్ష్మీదేవికి ఇష్టమైన వాడా ! రాక్షసుల గర్వాలను పోగొట్టినవాడా ! నిన్ను శరణు కోరుచున్నాను.

1. పద్మాన్ని ధరించిన బ్రహ్మ, పద్మాన్ని వికసింపజేసి దానికి మిత్రుడైన సూర్యుడు, పద్మాన్ని ముడుచుకుపోయినట్టు చేసిన చంద్రుడు, కుమారస్వామి (పుత్రుడు), క్రమంగా నీ సేవ చేయడానికి ఏకాగ్రతతో ఉన్నారు. వాళ్ళలాగే నిన్ను శరణు కోరుచున్న నన్ను రక్షించు.

2. రెప్పలు పడని కన్నులు గల దేవతా శ్రేష్ఠులు (అనిమిషేంద్రులు), మునులు, ఇంద్రుడు, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అనే ఎనిమిది మంది దిక్పాలకులు, దేవతలు, గుర్రపు ముఖం కలిగి, మనుష్య ఆకారం కలిగిన కిన్నరులు, అణిమ మొదలైన ఎనిమిది రకాల సిద్ధులు కలిగిన సిద్ధ పురుషులు, రంభ మొదలైన అందమైన అప్సరసలు, నీ సేవ చేయడానికి ఏకాగ్రత తో కాచుకుని ఉన్నారు.

3. పొగిడే (ఎన్నగల) ప్రహ్లాదుడు మొదలైన భక్తాగ్రేసరులు నిన్ను కొలవడానికి వచ్చారు. వెంకటాద్రి పర్వతం మీద ఉన్న వేంకటేశ్వరుడా ! మా అందరి మనవి (విన్నపము) వినవయ్యా ! విని రక్షించవయ్యా ! "" 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శుభోదయం 😊

- Kks Kiran

07 ఏప్రిల్, 2017

శ్రీరామనవమి శుభాకాంక్షలు 😊



"" గంధము పూయరుగా - పన్నీరు గంధము పూయరుగా

అందమైన యదు నందను పై కుందరదన లిరు వందగ పరిమళ

తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా కల కల మను ముఖ కళదని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి

చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా మాలిమితో గోపాల బాలురతో ఆలమేపిన విశాల నయనునికి

హారతులెత్తరగా ముత్యాల హారతులెత్తరుగా నారీ మణులకు వారము యవ్వన వారక మొసగెడు వారిజాక్షనుకు

పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా జాజులు మరి విరజాజి దవనములు రాజిత త్యాగరాజ వినుతునికి ""

( త్యాగరాజ స్వామివారికి భక్తితో నమస్కరిస్తూ _/\_ )

శ్రీరామనవమి శుభాకాంక్షలు 😊


07 జనవరి, 2017

శుభోదయం 😊

ఉదయాన్నే, వణికించే ఈ చలిలో మనసుకి హాయిని,ప్రశాంతతనూ ఇచ్చే కొన్ని కీర్తనలూ,,కృతులూ వినడం ఓ గొప్ప అనుభవం 😊

ఉదాహరణకు యమన్ కళ్యాణి రాగంలో బోంబై జయశ్రీ గారు పాడిన ఈ అన్నమాచార్యుని కీర్తన వినండి,,మనసుని ఎంత చక్కగా తేలికపరుస్తోందో ఈ కీర్తన వింటుంటే ....!!!




16 జులై, 2016

అన్నమయ్య భావాలు


కమలా సతీ ముఖకమల కమల హిత కమల ప్రియ కమలేక్షణా కమలాసన హిత గరుడ గమన శ్రీ కమలనాభ నీ పద కమలమే శరణు


08 జూన్, 2016

మరుగేలరా ఓ రాఘవా






" అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగ వెదకి తెలిసి కొంటినయ్య 

నిన్నె గాని మదినెన్నజాల నొరుల 

నన్ను బ్రోవవయ్య త్యాగరాజనుత "


28 మార్చి, 2016

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు



గత ఏడు నెలలుగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి పాట రోజుకి కనీసం ఒక్కటైనా వినడం అలవాటుగా చేసుకున్నాను నేను...

ఆయన పాడిన ఏ పాట విన్నా ఎప్పటికప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు " ఈయన గొంతులో ఇంత మాధుర్యం ఎలా ఉందా? " అని..

నాదగ్గర దాదాపుగా ఆయన పాడిన అన్నమయ్య కీర్తనలన్నీ ఉన్నాయి..ఓరకంగా చెప్పాలంటే నేనో ఏకలవ్య శిష్యుడిని ఈయనకి. ఎందుకంటే నేను నేర్చుకున్న అన్నమయ్య కీర్తనలన్నీ ఈయన పాడగా విని నేర్చుకున్నవే,...

ప్రస్తుతం ఆయన " అఠాణ " రాగంలో పాడిన " కదిరి నృసింహుడు కంబమున వెడలె విదితముగా సేవింపరో మునులు " అనే  అన్నమాచార్యులవారి కీర్తనని సాధన చేస్తున్నాను నేను...

ఆయనపాడిన ఆ కీర్తన లింక్ ఇదిగో

విని ఎలా ఉందో చెప్పండి...

-  Kiran

త్యాగరాజ పంచరత్న కృతులు



ప్రియాసిస్టర్స్ ( షణ్ముఖ ప్రియ,,హరిప్రియ ) పాడిన పాటలంటే బాగా ఇష్టం నాకు....వాళ్ళు పాడిన పాటలు వింటున్నప్పుడు ఒక్కోసారి " ఈ భూలోకానికి సంగీత సాధన చేసుకోడానికి వచ్చిన సరస్వతీదేవి కూతురులేమో వీళ్ళు " అని అనిపిస్తూ ఉంటుంది నాకు.ఇదేమీ అతిశయోక్తి కాదు...అంత గొప్పగా పాడతారు వీరిద్దరూ...

దాదాపు వీళ్ళు పాడిన అన్ని పాటలూ విన్నాను నేను ఉషస్సు చిహ్నాలు కానవచ్చే కాలంలో,,సాయంసంధ్యా సమయాలలో,,వెన్నెల వెలుగులు వెదజల్లబడిన వేళ్ళల్లో,,అమావాస్యపు రాత్రుల నిశబ్దాలలో...ఏకాంతపు సమయాల్లో వీళ్ళు పాడిన పాటలను వింటూ ఆధ్యాత్మికానందం  (భక్తి కాదది ) అనుభవించిన క్షణాలూ ఉన్నాయి  నాకు...అంత గొప్పగా మనలని మన ఉనికి మరిచిపోయేలా చేసి ఆనందపు స్థితికి తీసుకుపోగల గొప్పదనం ఉంది వీళ్ళు పాడిన కృతులకీ,,కీర్తనలకీ... (గొప్ప సంగీతం యొక్క లక్షణమే ఇది అనుకుంట... " మనకతీతమైనా అనందాన్ని మనలోపలనుంచీ పైకి తీసుకువచ్చి ఆ వాతావరణంలో చాలాసేపు మనలను ఉంచడం చేస్తే అది గొప్ప సంగీతం " అని నా భావన....ఏదైనా పాట మనం వింటున్నప్పుడు " నేను ఓ పాట వింటున్నాను " అనే స్పృహ మనకి కలిగితే అది అసలు గొప్పపాటే కాదని నా ఉద్దేశం... )

అంత ఆనందం అనుభవంలోకి రావడంవల్లనే నేను గత 3 సంవత్సరాలుగా కనీసం ఒక్కటైనా రోజుకి వీళ్ళుపాడిన పాటని వినడం నా దినచర్యగా చేసుకున్నాను.....ముఖ్యంగా త్యాగరాజస్వామి కృతులు ఎంతబాగా పాడారో  వీళ్ళు ...త్యాగరాజ పంచరత్న కృతులులోని ఈ మూడు కృతులు వినండి కావాలంటే...



విన్నాక మీ అభిప్రాయంచెప్పండి...

శుభరాత్రి :) 

- Kiran

23 మార్చి, 2016

అన్నమయ్య కీర్తన


కవితాత్మకమైన భావాలు జీవితంలో  మనం ఇంకా దర్శించని కొన్ని కొన్ని లోతులని మనకి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.

మామూలుగా చూస్తే ఇదే సూర్యుడు.

రోజూ ఉదయిస్తూ ఉంటాడు,మధ్యాహ్నం విపరీతమైన వేడిని వెదజల్లుతూ "వెధవ   ఎండ,భరించలేకపోతున్నాం " అని మనం అనుకునేలా ప్రవర్తిస్తూ ఉంటాడు,మళ్ళీ సాయంత్రం పూట ఏదో పనిఉన్నవాడిలా అస్తమిస్తూ పోతూ  ఉంటాడు.ఈ సూర్యోదయ,సూర్యాస్తమయ కాలాల మధ్యలో సూర్యుని తాలూకు సౌందర్యాన్ని ఎప్పుడైనా దర్శించామా?

అన్నమాచార్యులు ఎంత బాగా మనకా సౌందర్యాన్ని దర్శింప చేస్తున్నడోచూడండి ఈకీర్తనలో...

" శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ

పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ

ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ

గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ

జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ

మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ

మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ

అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ

వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ

గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ "

నా చిన్నప్పుడు మా మామ్మ పాడుతూ ఉండేది ఈపాటని.ఎందుకో ఇప్పుడు షడన్ గా గుర్తుకొచ్చి ఈపాటకి విశ్లేషణ రాయాలనిపించి రాశాను :)

శుభోదయం :) :) :)

- Kks Kiran

అన్నమయ్య సంకీర్తనలకి విశ్లేషణలు


అన్నమయ్య సంకీర్తనలకి విశ్లేషణలు రాసేంత గొప్ప వాడిని కాను నేను,,కానీ  గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారు పాడిన " ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన " అనే అన్నమాచార్యుని కీర్తన విన్నప్పుదల్లా దీని గురించి రాయాలి అని అనిపిస్తూ ఉంటుంది.

ఈ కీర్తన  చదవండి...!!!

" ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన
నితడే
అతిశయమగు మహిమలతో
వెలసెను అన్నిటికాధారముతానె||

మదిజలధులనొకదైవము వెదకిన
మత్య్సావతారంబితడుయ్

అదివోపాతాళమందు వెదకితే ఆదికుర్మమీ
విష్ణుడు

పొదిగొని యడవుల వెదకి చూచితే
భూవరాహమనికంటిమి

చెదఱక కొండల గుహలవెదకితే
శ్రీనరసింహుబున్నాడు||

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి
నిలిచినది

బలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడు.

తలపున శివుడును పార్వతి వెదకిన
తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన
కృష్ణుడు రాముడునైనారు.||

పొంచి అసురకాంతలతో వెదకిన
బుద్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మిదటి
కల్క్యావతారము

అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై
మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీ
వేంకట విభుడు|| "

అన్నమయ్యకి ఎక్కడ వెతికినా " హరే సర్వవ్యాపకుడు " అని అనిపిస్తోందట.ఎక్కడ వెతుకుతున్నా అతని రూపమే గోచరిస్తోంది అని చాలా చక్కగా దశావతారాలను ఉదహరించి రాశాడు ఈ కీర్తనని...

కాసేపు ఈ భక్తి భావాన్ని పక్కన పెడితే ఈ కీర్తన మళ్ళీ చదవండి.

 " లోకంలో ఎంతో విభిన్నంగా కనిపించే ప్రతీదానిలోనూ ఏకత్వాన్ని దర్శించమని చెప్పట్లేదూ అన్నమయ్య?

జగత్తులో నిండి ఉన్నది అంతా ఒకటే,ఒకే చైతన్యం దీనినంతా నడిపిస్తోంది అనే భావన కలగచేసేలా ఉంది ఈ పాట. "

" హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు
హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు
పొరి నెరుగు వారి పుణ్యముగాన " అనే కీర్తనలో అన్నమయ్య ఇలా అంటాడు.

" నేలయు మిన్నును నిజ వెకుంఠము
పోలించి చూడని పురుషుల వెలితి.
మనసులోననే మాధవుడున్నాడు
కనుగొనని వారి కడమింతే
తనువే విష్ణుని తత్వసాధనము
వొనరగ శ్రీపతి యున్నాడు గాన "  అని అంటాడు.

మన శరీరం విష్ణువు యొక్క తత్వం తెలుసుకునే ఓ సాధనం అట.

 ఇంతకీ ఏమిటా విష్ణువు తత్వం?

అంటే ఇదిగో అన్నమయ్య చెప్పాడుగా ఇలా ప్రపంచంలో ప్రతీ వస్తువుని,సంఘటనీ సమదృష్టితో చూడమని.

ఎంత అందంగా కనిపిస్తుందో ఈ జగత్తు అంతా ఇటువంటి భావనలు మనం కలిగిఉంటే???

ప్రతీ మనిషినీ దైవస్వరూపంగా భావిస్తే అప్పుదు అవతలి వ్యక్తిని మోసం చెయ్యబుద్ధవదు,మాటలతో హింసించాలని ఉండదు.మనకి విశ్వజనీయ ప్రేమ తత్వం అలవడుతుంది...

అసలీలోకమే గొప్ప ఆనందంతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది... ఆ తత్వాన్నే సాధన చెయ్యాలని అంటున్నాడు అన్నమయ్య....

శుభోదయం :) :) :)

- Kks Kiran