23 మార్చి, 2016

అన్నమయ్య సంకీర్తనలకి విశ్లేషణలు


అన్నమయ్య సంకీర్తనలకి విశ్లేషణలు రాసేంత గొప్ప వాడిని కాను నేను,,కానీ  గరిమెళ్ళ బాలక్రిష్ణ ప్రసాద్ గారు పాడిన " ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన " అనే అన్నమాచార్యుని కీర్తన విన్నప్పుదల్లా దీని గురించి రాయాలి అని అనిపిస్తూ ఉంటుంది.

ఈ కీర్తన  చదవండి...!!!

" ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన
నితడే
అతిశయమగు మహిమలతో
వెలసెను అన్నిటికాధారముతానె||

మదిజలధులనొకదైవము వెదకిన
మత్య్సావతారంబితడుయ్

అదివోపాతాళమందు వెదకితే ఆదికుర్మమీ
విష్ణుడు

పొదిగొని యడవుల వెదకి చూచితే
భూవరాహమనికంటిమి

చెదఱక కొండల గుహలవెదకితే
శ్రీనరసింహుబున్నాడు||

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి
నిలిచినది

బలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడు.

తలపున శివుడును పార్వతి వెదకిన
తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన
కృష్ణుడు రాముడునైనారు.||

పొంచి అసురకాంతలతో వెదకిన
బుద్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మిదటి
కల్క్యావతారము

అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై
మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీ
వేంకట విభుడు|| "

అన్నమయ్యకి ఎక్కడ వెతికినా " హరే సర్వవ్యాపకుడు " అని అనిపిస్తోందట.ఎక్కడ వెతుకుతున్నా అతని రూపమే గోచరిస్తోంది అని చాలా చక్కగా దశావతారాలను ఉదహరించి రాశాడు ఈ కీర్తనని...

కాసేపు ఈ భక్తి భావాన్ని పక్కన పెడితే ఈ కీర్తన మళ్ళీ చదవండి.

 " లోకంలో ఎంతో విభిన్నంగా కనిపించే ప్రతీదానిలోనూ ఏకత్వాన్ని దర్శించమని చెప్పట్లేదూ అన్నమయ్య?

జగత్తులో నిండి ఉన్నది అంతా ఒకటే,ఒకే చైతన్యం దీనినంతా నడిపిస్తోంది అనే భావన కలగచేసేలా ఉంది ఈ పాట. "

" హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు
హరి సర్వాత్మకుడు ఆదిమ పురుషుడు
పొరి నెరుగు వారి పుణ్యముగాన " అనే కీర్తనలో అన్నమయ్య ఇలా అంటాడు.

" నేలయు మిన్నును నిజ వెకుంఠము
పోలించి చూడని పురుషుల వెలితి.
మనసులోననే మాధవుడున్నాడు
కనుగొనని వారి కడమింతే
తనువే విష్ణుని తత్వసాధనము
వొనరగ శ్రీపతి యున్నాడు గాన "  అని అంటాడు.

మన శరీరం విష్ణువు యొక్క తత్వం తెలుసుకునే ఓ సాధనం అట.

 ఇంతకీ ఏమిటా విష్ణువు తత్వం?

అంటే ఇదిగో అన్నమయ్య చెప్పాడుగా ఇలా ప్రపంచంలో ప్రతీ వస్తువుని,సంఘటనీ సమదృష్టితో చూడమని.

ఎంత అందంగా కనిపిస్తుందో ఈ జగత్తు అంతా ఇటువంటి భావనలు మనం కలిగిఉంటే???

ప్రతీ మనిషినీ దైవస్వరూపంగా భావిస్తే అప్పుదు అవతలి వ్యక్తిని మోసం చెయ్యబుద్ధవదు,మాటలతో హింసించాలని ఉండదు.మనకి విశ్వజనీయ ప్రేమ తత్వం అలవడుతుంది...

అసలీలోకమే గొప్ప ఆనందంతో నిండి ఉన్నట్లు కనిపిస్తుంది... ఆ తత్వాన్నే సాధన చెయ్యాలని అంటున్నాడు అన్నమయ్య....

శుభోదయం :) :) :)

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి