నిన్ననే కార్తీకమాసం మొదలైంది,
ప్రకృతి ఎంత గొప్పదో చూశారా?
తన ధర్మాన్ని తాను వీడకుండా క్రమం తప్పకుండా పాటిస్తూ తనని తాను మార్చేసుకుంది అప్పుడే చాలా ఆశ్చర్యం కలిగించేంత రీతిలో....!!!
ఈ మధ్య సాయంత్రం 4.15 నుంచే చలి ప్రారంభం అయిపోతోంది.
మొన్నమొన్నటి వరకూ సాయంత్రంపూట ఆకాశంలో పసుపు,కుంకుమ రంగు చాయగల వెలుగు చారలు ఎక్కువగా కనపడేవి.ఇప్పుడు తొందర తొందరగా చీకటి పడిపోతూ ఉండడం వల్ల ఒక్కటి కూడా అలా కనపడట్లేదు...!!!
సూర్యుని కిరణాలలో తీక్షణత తగ్గింది.
క్రమక్రమంగా తెల్లవారుజామున మంచు కురుస్తోంది,
ఆ మంచు బిందువులు పచ్చని మొక్కలమీద,చంద్రుడు రాల్చిన వెన్నెల ముత్యాల్లా కనపడుతున్నాయి...!!!!
ఉదయాన గడ్డి చివర్ల నిలిచి ఉండే ప్రతీ మంచు బిందువులోనూ సప్తవర్ణాలు గోచరం అవుతున్నాయి,
తమ తమ గూళ్ళకు మరమత్తు చేసుకునేందుకు సన్నని చితుకులు పట్టుకెళ్తూ పక్షులు సంధడి చేస్తున్నాయి,
మరి వాతావరణం ఇంత ఆహ్లాదం కలిగించేలా ఉండడం వల్లనో లేక ఇంకేదో కారణమో తెలియదు కానీ,ఈ మాసంలో " ఆధ్యాత్మిక ఆనందం " ఎక్కువగా అనుభవంలోకి వచ్చేలా ఉంటుంది.
రాత్రిపూట శివాలయంలో ఏ కదంబం చెట్టు కిందో కూర్చుని దూరంగా ప్రమిదలో వెలుగుతూ ఉన్న ఓ దీపాన్ని కాసేపలా చూసినా,దాని నుంచి వచ్చే ఆ నూనె వాసనను ఆస్వాదించినా ఎక్కడలేని ప్రశాంతత కలుగుతూ ఉంటుంది.
పొద్దున్నే ఏ కేశవ స్వామి గుడికో వెళ్తే ఆ గుడి గోపురంపైన అకస్మాత్తుగా తన రెక్కలు కదుపుతు,చప్పుడు చేస్తూ కదిలే పావురాల కదలికలను ఓ నిముషం పాటు అలా చూసినా చాలా ఆనందం కలుగుతుంది,
ఏమైనా ఈ మాసంలో భూమి అంతా ఆనందం నిండినట్లు కనిపిస్తూ ఉంటుంది...!!!
- Kks Kiran

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి