" గుడిలోకి వెళ్ళి రావడం కూడా ఒక ఆర్ట్ " అనుకుంట.
మామూలుగా గుడిలోకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుని,కొబ్బరికాయ కొట్టి,తీర్ధప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చి బండి ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి ' నేను ఈరోజు గుడికి వెళ్ళాను ' అని నలుగురితో చెప్పుకోవడం పెద్ద విశేషం కాదు,అంత గొప్ప విషయం కూడా కాదు.
నిజంగా గుడిలోకి వెళ్తే ఆ గుడిలోని గొప్పదనాన్ని మనం మనస్పూర్తిగా అనుభవించాలి.పంచేంద్రియాలతో సహా మనసు కూడా ' తధాత్మత ' చెందాలి.
గుడికి సూర్యోదయానికి మునుపే వెళ్తే బెటర్.
ముఖ్యంగా ఈ శీతాకాలం ఉదయాన్నే గుడికివెళ్ళడం గొప్ప అనుభూతిని ఇస్తుంది.
గుడికి వెళ్తూంతే చలి చెంపలను,చెవులను ,శరీరాన్ని తాకుతూ ఉంటే భలే గమ్మత్తుగా ఉంటుంది.
గుడికి వెళ్ళక సాధ్యమైనంత మౌనంగా ఆ గుడి ఆవరణను పరిశీలిస్తూ ప్రదక్షిణలు చెయ్యడం మంచిది.
అప్పుడే నీటితో కడిగి తెల్లటి ముగ్గులు నిండి ఉన్న దేవాలయపు అరుగులు,మెట్లు చూస్తూ ఒద్దికగా తన అమ్మవెంటో,నాన్న వెంటో దైవనామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేస్తున్న అమ్మాయి భక్తిని,తన కొప్పులో ఉన్న కనకాంబరాలని,బంతిపూవుల చూస్తూ అక్కడే ఒక భావకుడిగా మారిపోవచ్చు.
గుడిలోంచి వచ్చే ప్రత్యేకమనీ తులసి ఆకుల వాసన ,కర్పూరపు వాసన ముక్కుకి ఆహ్లాదాన్ని పంచుతాయి.
తీర్ధప్రసాదాలు నాలుకకి ఆనందాన్ని పెంచుతాయి.
ఇక మిగిలినది మనసు, అది అప్పటికే స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది ప్రశాంతంగా ఆనందం పరిపూర్ణస్థాయి చేరినట్లు,
బయటకు వచ్చేసాక అప్పుడే తూర్పుదిశ నుంచి పైకి రావడానికి ప్రయత్నిస్తున్న సూర్యుడి లేలేత నునువెచ్చని కిరణాలు ఆలయపు గోపురంపై ఉన్న బొమ్మలపై పడుతూ ఉంటే కనులార చూసి గాఢంగా శ్వాస ఒకసారి పీల్చుకుని ఇంటికి వెళ్ళిపోండి.
గుడి ఇచ్చిన అనుభూతి,ఆనందం ఎన్నో అందమైన జ్ఞాపకాలను తట్టిలేపుతుంది,
నాకైతే,ఈ రోజు విధియ తిధి కదా? విధియ నాటి రాత్రి పొడిచే నెలవంకను చూస్తూ చిన్నప్పుడు అమాయకంగా చంద్రునికి గోత్రం,నామం చెప్పుకుని ఒక నూలుపోగుని ఇస్తే చంద్రుడు కొత్తబట్టలు ఇస్తాడు అని అమ్మమ్మ చంద్రునికో నూలుపోగు వేయించిన విధానం గుర్తుకువచింది.అప్పడు అమాయకత్వం ఇచ్చిన ఆనందం గుర్తుకువచ్చింది.
మరి మీకు?
- Kiran

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి