గత ఏడు నెలలుగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి పాట రోజుకి కనీసం ఒక్కటైనా వినడం అలవాటుగా చేసుకున్నాను నేను...
ఆయన పాడిన ఏ పాట విన్నా ఎప్పటికప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు " ఈయన గొంతులో ఇంత మాధుర్యం ఎలా ఉందా? " అని..
నాదగ్గర దాదాపుగా ఆయన పాడిన అన్నమయ్య కీర్తనలన్నీ ఉన్నాయి..ఓరకంగా చెప్పాలంటే నేనో ఏకలవ్య శిష్యుడిని ఈయనకి. ఎందుకంటే నేను నేర్చుకున్న అన్నమయ్య కీర్తనలన్నీ ఈయన పాడగా విని నేర్చుకున్నవే,...
ప్రస్తుతం ఆయన " అఠాణ " రాగంలో పాడిన " కదిరి నృసింహుడు కంబమున వెడలె విదితముగా సేవింపరో మునులు " అనే అన్నమాచార్యులవారి కీర్తనని సాధన చేస్తున్నాను నేను...
ఆయనపాడిన ఆ కీర్తన లింక్ ఇదిగో
విని ఎలా ఉందో చెప్పండి...
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి