ప్రియాసిస్టర్స్ ( షణ్ముఖ ప్రియ,,హరిప్రియ ) పాడిన పాటలంటే బాగా ఇష్టం నాకు....వాళ్ళు పాడిన పాటలు వింటున్నప్పుడు ఒక్కోసారి " ఈ భూలోకానికి సంగీత సాధన చేసుకోడానికి వచ్చిన సరస్వతీదేవి కూతురులేమో వీళ్ళు " అని అనిపిస్తూ ఉంటుంది నాకు.ఇదేమీ అతిశయోక్తి కాదు...అంత గొప్పగా పాడతారు వీరిద్దరూ...
దాదాపు వీళ్ళు పాడిన అన్ని పాటలూ విన్నాను నేను ఉషస్సు చిహ్నాలు కానవచ్చే కాలంలో,,సాయంసంధ్యా సమయాలలో,,వెన్నెల వెలుగులు వెదజల్లబడిన వేళ్ళల్లో,,అమావాస్యపు రాత్రుల నిశబ్దాలలో...ఏకాంతపు సమయాల్లో వీళ్ళు పాడిన పాటలను వింటూ ఆధ్యాత్మికానందం (భక్తి కాదది ) అనుభవించిన క్షణాలూ ఉన్నాయి నాకు...అంత గొప్పగా మనలని మన ఉనికి మరిచిపోయేలా చేసి ఆనందపు స్థితికి తీసుకుపోగల గొప్పదనం ఉంది వీళ్ళు పాడిన కృతులకీ,,కీర్తనలకీ... (గొప్ప సంగీతం యొక్క లక్షణమే ఇది అనుకుంట... " మనకతీతమైనా అనందాన్ని మనలోపలనుంచీ పైకి తీసుకువచ్చి ఆ వాతావరణంలో చాలాసేపు మనలను ఉంచడం చేస్తే అది గొప్ప సంగీతం " అని నా భావన....ఏదైనా పాట మనం వింటున్నప్పుడు " నేను ఓ పాట వింటున్నాను " అనే స్పృహ మనకి కలిగితే అది అసలు గొప్పపాటే కాదని నా ఉద్దేశం... )
అంత ఆనందం అనుభవంలోకి రావడంవల్లనే నేను గత 3 సంవత్సరాలుగా కనీసం ఒక్కటైనా రోజుకి వీళ్ళుపాడిన పాటని వినడం నా దినచర్యగా చేసుకున్నాను.....ముఖ్యంగా త్యాగరాజస్వామి కృతులు ఎంతబాగా పాడారో వీళ్ళు ...త్యాగరాజ పంచరత్న కృతులులోని ఈ మూడు కృతులు వినండి కావాలంటే...
విన్నాక మీ అభిప్రాయంచెప్పండి...
శుభరాత్రి :)
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి