09 ఆగస్టు, 2017

రాఖీపండగ సందర్భంగా అబ్బాయిలకి గంధర్వుడు ఇచ్చిన ప్రత్యేకమైన ఓ వరం 😜

" బాబోయ్ అసలే రేపు రాఖీపండగ 🙅 మా చెల్లే నాకు రాఖీ కట్టేందుకు కుదరట్లేదు ఈ సంవత్సరం ,, అలాంటిది నాకేమాత్రం పరిచయం లేని అమ్మాయిలెవరైనా రేప్పొద్దున్న నాకెదురై " అన్నయ్యా " అనే ఓ అపభ్రంశపు మాటని ఒకటి ఉఛ్ఛరిస్తూ ఎక్కడ నాకు రాఖీ కడతానంటారో .....!!! 😱 " అని నిన్న రాత్రి నేను భయపడుతూంటే ఈ తెల్లారుజామున నా కలలో ఓ గంధర్వుడు కనపడి 

" ఈరోజు రాఖీ పండగ అని భయపడకయ్యా కిరణూ....!!! మీ చెల్లెలు కాకుండా వేరే ఏ అమ్మాయైనా నిన్ను ' అన్నయ్యా ' అని సంభోదిస్తూ అక్కర్లేని వరసోటి కలిపి నీకు రాఖీ కట్టాలని చూసినా,, " రాఖీపండగ శుభాకాంక్షలు " అని ఫేస్బుల్లో నిన్ను టాగ్ చేసినా ఆ అమ్మాయికి తొందరగా పెళ్ళికాదు 👵 ఆ రకంగా నీకు వరాన్నిస్తున్నానయ్యా 😜 ,, సరేనా.... !!! " అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ గంధర్వుడు ✋

" ధన్యోస్మి స్వామీ,, ధన్యోస్మి .... ఇలాంటి వరాన్నే మా అబ్బాయిలందరూ ఈరోజు కోరుకొంటున్నారు 😟😵 మరి వాళ్ళ అందరికీ కూడా ఇదే వరం అప్లై అయ్యే Chance ఏమీ లేదా ?? " అని గబాల్న అడుగుదామని అని అనుకున్నాను లోకసంక్షేమార్ధం కానీ అప్పటికే ఆయన మాయమయిపోయాడు 👣 

పోన్లే దక్కిందల్లా దక్కింది - కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారన్న సామెత ఊరికే వచ్చిందా? పైగా తెల్లారుజామున వచ్చే కలలు ఖచ్చితంగా నిజమవుతాయి కూడా 😉 అని సంతోషపడి కళ్ళు నులుముకుంటూ నిద్రలేచాను నేనీరోజు 😂

సో అదీ మాటర్ అమ్మాయిలూ....!!! కావాలంటే ఇప్పుడు ధైర్యం చేయండి మీకు దమ్ముంటే - మా మగజాతి తరపున నేను ధైర్యంగా నిల్చుంటా 🙆👅👊

( లేకపోతే రాఖీపండగ పేరు చెప్పి మా అబ్బాయిలని ఏటా భయపెడతారా?? ఆయ్ 😬😬😡😡 😈😈 😛😛 )

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి