25 జూన్, 2016

బలవంతముగా పిల్లలని బడులకి పంపి బాల్యాన్ని బలి చెయ్యకండి




పొద్దున్న కార్యక్రమానికని బయల్దేరి బయటకెళ్తూంటే ఓ చిన్నపిల్ల ఏడుపు వినిపించింది...

ఎవరా? అని ఆత్రంగా రోడ్ పై చూస్తే 3 ఏళ్ళ వయసున్న ఓ బుజ్జి ఆడపిల్ల కన్నీళ్ళు తుడుచుకుంటూ,,కూనిరాగలు పెడుతూ నడుస్తూ ఉండడం కనిపించింది...అయ్యో ఏం కష్టం వచింది ఈ చిన్నారికి? అని ఆందోళన చెందుతూ ఆ అమ్మాయి వెనుక చూస్తే యమదూతల్లా వాళ్ళ అమ్మా,,ఆ పక్కింటివాళ్ళూ కనిపించారు...

ఆ పిల్ల ఈ పూటకి స్కూల్కి వెళ్ళనని అంటే దాని మాటని కర్కశంగా కాదని బలవంతపెట్టి మరీ పంపించేస్తున్నారు వీళ్ళు.. అది " వద్దు మొర్రో  నే వెళ్ళనని " ఎంత ప్రాధేయపడుతున్నా వీళ్ళు ఆ పిల్ల మాటని ఖాతరు చెయ్యకుండా ఆ పిల్లని నయానో భయానో ఒప్పించి కసాయిల్లా పంపించేస్తుంటే పాపం అది ఇంకేం చెయ్యలేని నిస్సహాయస్థితితో వెళ్ళడం తప్పనిసరై ఏడ్చుకుంటూ పోతోంది స్కూల్కి అలా..

అయినా దానికింకా ఏదో వెర్రి ఆశ..అమ్మ " ఈ పూటకి స్కూల్కి నువ్వు వెళ్ళద్దులేమ్మా,,వచ్చే వెనక్కి " అని అంటుందేమోనని వెనక్కి చూసుకుంటూ అలాంటి స్పందన ఏదీ ఎదురవ్వకపోయేసరికి మళ్ళీ నిరాశ చెంది తన పరిస్థితికి తాను దుఖ్ఖిస్తూ అలా వెళ్తుంటే చాలా జాలేసింది నాకు..

ఎందుకు పిల్లలని అంత బలవంతంగా స్కూళ్ళకి పంపెయ్యడం? ఎందుకు వాళ్ళపై చదువుని అంత బలవంతంగా రుద్దెయ్యడం?

ఏమో,, " స్కూల్కి వెళ్ళను " అని అంటున్నారంటే వాళ్ళ తరపు కారణం ఏదో ఉండచ్చుకదా??

అక్కడి వాతావరణం నచ్చలేదేమో వాళ్ళకి?,, లేదా ఉక్కగా ఉండి ఇబ్బంది పడుతున్నారేమో? తోటి పిల్లలు గిల్లేస్తున్నారేమో? లేక టీచర్లే రాక్షసుల్లా అనిపిస్తున్నారేమో?

వాళ్ళు " నా ఇబ్బంది ఇదీ " అని మనలా భావాలను స్పష్టంగా వ్యక్తీకరించలేరుకదా? ఇవేమీ మనం అర్ధం చేసుకోకుండా ఎందుకు వాళ్ళకి అంత బలవంతపు శిక్షలు విధించడం?

పొద్దున్న ఇదే ప్రశ్నలు కాస్త మందలింపుగా వాళ్ళతో నేనంటే " ఇప్పుడు స్కూల్కి పంపకపోతే ఎంసెట్లో రాంక్ తప్పి పోతుందన్నట్లుగా " మాట్లాడారు వాళ్ళు :(

వెధవది శాస్త్రాలు చదివి సౌమ్యుడిలా తయారయ్యి " స్త్రీ హత్య మహా పాపం " అని గుర్తొచ్చి ఆగానుకానీ నిజంగా దగ్గర్లో ఏకే47 ఉండుంటే వాళ్ళందరినీ కాల్చాలన్నంత కోపం వచ్చింది నాకైతే...

పసిపిల్లల మనోస్థితిని అర్ధం చేసుకోకుండా వాళ్ల అందమైన బాల్యాన్ని చిదిమేసే తల్లితండ్రులంటే అంత కోపం నాకు 

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి