08 ఏప్రిల్, 2017

" ఆస్తికవాదం గొప్పదా? నాస్తికవాదం గొప్పదా? " అనే విషయచర్చగల ఓ పోస్ట్కి నేనిచ్చిన సమాధానం


ఇందులో #సత్యం గురించీ,, #ఆస్తికవాదం గురించీ,, #హేతువాదం గురించీ,, #ఆధ్యాత్మికత గురించీ,, #ఆధ్యాత్మిక జీవనవిధానం గురించీ,, #భక్తి గురించీ,, #ఆనందం గురించీ,,#సుఖం గురించీ,#కళ గురించీ,,#భౌతికవాదం గురించీ నాదైన విశ్లేషణ రాసాను 

కాస్త ఓపికగా చదవండే 😜 😜 😜

***********************************************

"" నమ్మకం మనిషికి స్వాంతన ఇస్తుంది కానీ సత్యాన్ని చూపదు... వాస్తవమేమిటో చూద్దామనే ప్రయత్నాన్ని అది ప్రోత్సహించదు సరికదా ఆ నమ్మకమే నిజమనుకునేలా చేస్తుంది 😁 

అలా అని నిజం కోసం హేతుబద్ధంగా,, తార్కికంగా వెతుకుతూ వెంపర్లాడే మనిషికి శాంతి ఉండదు 😒

ఇందులో ఏవాదం ఉత్తమం? అంటే ఏం చెప్తాం? 

రెండూ కావాలంటాను నేనైతే....!!!

ఎందుకంటే మనిషికైనా,, సమాజానికైనా ఈ రెండూ ఎప్పుడూ అవసరమే కాబట్టి...!!! ఈ రెండిటిలో ఏది లోపించినా అసతుల్యతాస్థితికి లోనై అర్ధంలేని ఆశాంతి కల్గుతుంది కాబట్టి 😳 

సరే,, ఆధ్యాత్మికత విషయానికే వస్తే దానిగురించి #చలం చాలా గొప్పగా అన్న ఓ మాటని ఇక్కడ ఉదహరించడం సందర్భోచితం అని అనిపిస్తోంది నాకు 😄 

చలం తాను రాసిన " ఆనందం " అనే వ్యాసంలో ఓ చోట ఇలా అంటాడు " ఆధ్యాత్మికత అంటే ఈ లోకంలో ఉన్న ఆనందానికై కళ్ళు తెరవడం " అని.. ఈమాటనే నేనూ నమ్ముతాను ఆధ్యాత్మికత అనే విషయమై 

" ఆధ్యాత్మికత అంటే అన్నీ ఒదులుకోవడం కాదు... అలా అని అన్నీ పట్టుకు కూర్చోవడమూ కాదు ...

అదో గొప్ప చైతన్యాత్మకమైన స్థితి.. అస్పష్టత నుంచి స్పష్టత దిశగా మనిషి చేసే ప్రయాణమే ఆధ్యాత్మికత " 😊

మనిషి తనకేది కావాలో,, తనకేది అవసరమో నిష్పక్షపాతంగా విశ్లేషించుకుని బ్రతకడమే అసలైన ఆధ్యాత్మిక జీవనవిధానం " 😊 

" భక్తి అనేది ఈ విధమైన మనోస్థితి కలగడానికి చేసే సాధనకి మొదటిమెట్టు " అని నా అభిప్రాయం 😊

ఆధ్యాత్మిక జీవనవిధానం నిజంగానే చాలా గొప్పది 😊,, అది అనుభవైక విషయంగా తెలుసుకుంటేనే తప్ప మామూలుగా చెప్తే ఏమర్ధం కాదు కూడా మనిషికి 

(పోతనగారి "" మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు "" అనే పద్యం గుర్తుచెయ్యక్కర్లేదుగా ప్రత్యేకించి నేను మీకు?)

ఆధ్యాత్మిక జీవనవిధానం పాటించడం ద్వారా మనిషికి ఒనగూరే వ్యక్తి పరివర్తనా,,సమదృష్టి ,,సమభావనా,, మానసిక ప్రశాంతత,, అది ఈ లోకంపై పెంచే ప్రేమభావమూ ఇవన్నీ గొప్పే...!!! కానీ ఇవన్నీ వ్యక్తి అంతరంగానికి సంబంధించిన విషయాలు 

ఇవి ఆనందాన్ని ఇచ్చేమాట నిజమైతే అయ్యుండవచ్చు కానీ ఇదే ఆనందమనే భావనతో భౌతికవాదాన్ని మింగేసేలా బ్రతకకూడదు మనిషనేవాడు 😁 

ఎందుకంటే మనం బ్రతుకుతున్నది భూలోకంపైనే కాబట్టి...!!

మన జీవితానికికానీ,, మన జీవనవిధానాలకి కానీ కేవలం భౌతికవాదం మాత్రమే ప్రభావవంతంగా పరిష్కారం చూపగలదు తప్ప మరేదీ చూపలేదు నిజానికి... దానిని విస్మరిస్తే మన బ్రతుకులలో సుఖానికి చోటు ఉండదు కూడా 😊 ( అసలు " సుఖం " అంటే ఏమిటి? అనేది విశ్లేషించుకుని చదవండి ఈ పాయింట్ని) 

అయితే భౌతికవాదం మనిషికి సుఖానిస్తుందేకానీ సంతోషాన్ని ఇవ్వలేదు,,

మనిషికి సంతోషం ఎందులో కల్గుతుంది? అనే విషయమే తీసుకుంటే ' సాధారణంగా అది లౌకికాతీత విషయాలలోనే కల్గుతుంది ' అని జవాబు వస్తుంది...

కాబట్టే ఆ ఆనందాన్ని,, ఆ స్థితిని కల్గచేసే కళలనూ,,ఆధ్యాత్మిక లోకాన్ని మనిషి కల్పించుకున్నాడనిపిస్తోంది నాకైతే కొన్ని వేల సంవత్సరాల మానవ పరిణామక్రమాన్ని,, అందులో పరీక్షింపబడిన (పడుతున్న) రకరకాల వాదాలనూ విశ్లేషిస్తే 😊

ఏదైనా ఇది చాలా పెద్ద చర్చ ఏది గొప్ప? ఏదికాదు? అని తర్కించడానికి

కానీ ' సత్యాన్వేషణ విషయంలో మాత్రం ఆస్థికునికంటే హేతువాదే చాలా గొప్పవాడని ' నా అభిప్రాయం, ,

నేనే కనుక దేవుడినై ఉండుంటే "" ఈ ప్రపంచం అంతా " సత్యం - శివం - సుందరం "" అని ముక్తాయింపు ఇచ్చే ఆస్తికుని కన్నా " అసలు సత్యమనేది ఏమిటి? నిజంగా అది ఉంటుందా? ఉంటే దానికి ప్రమాణం ఏమిటి? అలాగే ఈ సృష్టి తాలుకు ఈ సౌందర్యం ఏమిటి? ఇందులో ఈ ఉత్పాతనాలూ,, ఈ లయమవ్వడాలూ ఏమిటి? వీటికి అంతూ,, అదుపూ ఉంటాయా అసలు నిజంగానే? "" అని తెలుసుకోడానికి కనీసం ప్రయత్నించే హేతువాదినే గౌరవిస్తాను 😊 😊 😊 ""

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి