27 జులై, 2019

జ్ఞానం అంటే ?



తల్లి గర్భం నుండి మనం జనియించిన కొంత కాలం వరకూ కూడా మనకి " నా " అనే భావన కానీ , " స్వ - పర " బేధాలు కానీ వత్యాసం కానీ తెలియదు - అది మనిషి యొక్క అసలు సహజ స్థితి
మనలో‌ ఈ " నా " అనే భావం ఎలా‌ ఏర్పడుతుందో తెలియదు కానీ అది ఏర్పడినప్పటినుంచి మనిషిపై ఇతర మనుష్యుల , సంఘ , సమాజపు ముద్రలు పడుతూంటాయి
ఆ ప్రభావం అతని మాటలలోనూ , అతని ఆలోచనల్లోనూ , నమ్మకాలలోనూ , చేతల్లోనూ‌ ద్యోతకమవుతాయి
అంటే మనం " జ్ఞానం " అని ఏదైతే భావిస్తున్నామో అవన్నీ ఇతరుల ద్వారా మనపై పడిన ప్రభావాలే తప్ప మనదంటూ ఏమీ లేదనేగా ?
ఈ చెప్పుకొనే " జ్ఞానం " మనలో అహంకారమూ , ఆధీక్యత , ఆత్మన్యూన్యత , ఆత్మవిశ్వాసం , కోపం , ద్వేషం , భయం , సుఖం , దుఃఖం లాంటి భావాలను కలగచేస్తుంది
ఈ భావాలేవీ పుట్టిన శిశువుకి ఉండవు - ఎదిగిన వ్యక్తికే ఇవ్వన్నీను
ఇవన్నీ ఆ మనిషిలో ఎలాంటి ప్రవర్తనను కలగచేస్తున్నాయి ? ఎటువంటి సంస్కారాన్నిస్తున్నాయి ?? అనే విశ్లేషణ మనిషిలో జరగాలంటే " నేను " అనే భావం ఏర్పడకముందు " నేనేంటి ? " అనే విషయంతో పోల్చుకోవాలి మనిషి...
అటువంటి స్వీయ విచారణ వల్ల సూర్యకిరణాలకి మంచు కరిగినట్లు మనలో అజ్ఞానం కరిగిపోతుంది
అందుకే " జ్ఞానం అంటే కొత్తకొత్త విషయాలు నేర్చుకోవడం మాత్రమే కాదు - నేర్చుకున్న విషయాలనుండి మనలని మనం విముక్తి చేసుకోవడం కూడా " అని రాసాను ఉదయం 🙂
- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి