10 అక్టోబర్, 2017

#SayNoToDowry



అసలు పెళ్ళి అంటే ఏమిటి? 

" ఇద్దరు వ్యక్తులు మేము జీవితాంతం ఒకరికొకరు తోడూనీడగా ఉంటూ,, ధర్మబద్ధంగా సహజీవనం సాగిస్తూ చక్కటి కుటుంబాన్నీ,, తద్వారా ఓ ఆరోగ్యకరమైన,, నైతికపరమైన సమాజాన్ని ఏర్పర్చడంలో మావంతు పాత్ర మేము పోషిస్తాము " అని అందరికీ తెలియచెప్పడమేగా పెళ్ళి చేసుకోవడం అంటే...!!!

అలా పరస్పరం కలిసి లైఫ్ని బాగా లీడ్ చేసుకుంటామని భావించి చేసుకొనే పెళ్ళికి కట్నం తీసుకోవడం అవసరమా బాస్? ఆలోచించు 👀

ఆమెని పెళ్ళి చేసుకొనేందుకు నువ్వలా డబ్బులు పుచ్చుకొంటున్నావంటే అందులో ప్రేమా, సమానత్వం ఎక్కడుంది చెప్పు బ్రదర్ ?? - కేవలం అమ్మకం కొనుగోలే ఉంది తప్ప అందులో 🙅

అయినా ఒకటాలోచించు,, 

ఎవరో నీకో విలువ నిర్ణయించి ఆ నిర్ణీతమైన ధరను ఏదో అమ్మబోయే సరుకుకి బేరం చెప్తున్నట్లు ' ఇంతైతేనే మావాడిని మీ పిల్లకిచ్చి పెళ్ళి చేసేందుకు ఒప్పుకుంటాం, లేకపోతే లేదు ' అని మీవాళ్ళు అవతలివారితో మాట్లాడుతూంటే సిగ్గనిపించదా ‌నీకు ?? 😠

ఆత్మాభిమానం, స్వీయ గౌరవం ఉన్న ఏ వ్యక్తైనా ఎవరో తనకి ఓ కనీస విలువ నిర్ణయించడాన్ని ఒప్పుకుంటాడా అసలు? ఒప్పుకుని మరొకరి సొమ్ము అయాచితంగా స్వీకరిస్తూ తనని తాను అమ్ముడవ్వడానికి సిద్ధపడతాడా?? 😡😡

ఆలోచించు ....!!!

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి