' వేసిన దారంట వెళ్ళిపోవడం సులభమూ పదిలమూ.... నలుగురికీ తెలిసింది చిరకాలం నుంచీ నలిగిందీ ఒక దారి సిద్ధంగా సుప్రసిద్ధంగా ఉంటూనే ఉన్నప్పుడు మరో కొత్త దారి వెతకడం అవివేకం,, ప్రమాదం ' అని అడ్డు చెప్తూ నిరుత్సాహపర్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం సత్యాన్వేషకుడినీ,, సంస్కర్తలనూ వారి మొదటి ప్రయత్నం నుంచీ 👊
ఆ వాదన నిజమని అనిపించినా ఒక్కోసారి ఆ పరిధి దాటి ఆలోచించిస్తే కానీ అర్ధంకాదు ఈ నూతనత్వం యొక్క ఉద్దేశమూ, ప్రభావమూ ఏమిటో అని....
పురోగమనానికి కొత్త దారులే రాచబాటలు . అలుపులేని అన్వేషణ గతానుగతికత్వాన్ని సహించలేదు...
కాలిబాటలోనే మానవుడు తృప్తి పడిపోయుంటే విమానయానాలు సాధ్యమై ఉండేవి కాదు కదా? 😳 "
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి