25 జనవరి, 2017

సామాజిక ఉద్రేకానికి మనిషిని పురిగొల్పే కారణం ఏమిటి?



మొన్నామధ్య జల్లికట్టుకై మంకుపట్టు పట్టి ఉద్యమాలు చేసారు,,

ఇప్పుడు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ కావాలని ఉద్యమాలు చేస్తున్నారు, ,

ఇలాంటి ఉద్యమాలలో పాల్గునేవాళ్ళలో అసలెంతమంది " నిజంగా ఇది ఉద్యమం చెయ్యాల్సినంత బలమైన విషయమే " అని భావించి పాల్గొంటున్నారు?

వాళ్ళకి వాళ్ళుగా " సమస్య తీవ్రత ఇదీ " అని తెలుసుకుని అందుకు పరిష్కారంగా ఉద్యమించడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుని ఇలాంటి నిరసనలలో పాల్గుంటున్నారా? లేక ఎవడో ఏదో చెప్పిన విషయానికి అప్పటికప్పుడు ప్రభావితం అయి ఆ ఆ తాత్కాలిక ఆవేశంలో ఉద్యమిస్తున్నారా? లేక విపరీతమైన ఉద్రేకత నిండిఉండే ఇలాంటి వాటిల్లో పాల్గొన్నప్పుడు వయసు తాలూకు ఉత్సాహం సంతృప్తి చెందడంవల్ల ఊతమిస్తున్నారా ఇలాంటివాటికి?

ఏది కారణం అవుతోంది ఇలాంటి సామాజిక ఉద్రేకాలకి? తెలిస్తే వివరించగలరు

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి