మనుషులు Attention Seeking Animals అన్నాడు మా తమ్ముడు Surya Sitaram మాటల సందర్భంలో ఒకసారి నాతో
" ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ లాంటి వేదికలలో ఇలాంటి భావాలు గల మాటలను పెట్టి " తమ ప్రస్తుత స్థితి ఇదీ " అన్నట్లుగా ప్రపంచానికి దానిని ప్రకటించి దానితో సంతృప్తి పడే మనస్తత్వం మనలో ఎక్కువవుతోంది సోషియల్ మీడియా వినియోగం వల్ల - దానివల్ల వీసమెత్తు ఉపయోగం ఒనగూరదు సరికదా అది చూసిన జనాలు " ఏమైంది - ఏమి జరిగిందన్నట్లు " వీరిని ప్రశ్నిస్తే తమ బాధంతా ముక్కుమొహం ఎరుగని , ఆత్మీయులు కాని ( Facebook Friends చాలామంది అంతేకదా ) వారితో కూడా పూస గుచ్చినట్లు ప్రతీది చెప్పుకొని ఓదార్పు పొందాలనే కాంక్ష ఎక్కువవుతోంది " చాలామంది మనుష్యులలో మనకు ప్రస్తుతం సమాజంలో
తనతోనూ , తన కుటుంబంతోనో లేక స్నేహితులతోనో సరైన సత్సంబంధాలు లేక " ఎవరూ తననూ , తన నిజాయితీనీ , భావాలనూ అర్ధం చేసుకోరనే " ధోరణి కలిగి ప్రేమరాహిత్యంతో బాధపడేవారే ఇలా ప్రవర్తిస్తారు " అని వాడు సెలవిచ్చాడు ఇటువంటి తరహా భావాలను తరచూ వెల్లిబుచ్చేవారిని చూసి
ఇలాంటి స్థితి గల జనాలు ఎక్కువవ్వడం ఆందోళన కలిగించే అంశం అనంటూ వాడు దానినుండి బయటపడే సలహాలను సూచిస్తూ " Quora " లో రాసిన వ్యాసమిది
అవకాశం ఉంటే చదివి మీ అభిప్రాయం చెప్పండి
ఆ లింక్ ఇదిగో :-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి