07 ఏప్రిల్, 2017

మహామృత్యుంజయ మంత్ర భావార్ధ వివరణ


"" ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం |

ఉర్వారికమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ || ""

భావం :- "" సుగంధం వెదజల్లేవాడూ,, ఆహారం ఒసగి పోషించేవాడు ,, త్రినేత్రుడూ అయిన పరమేశ్వరుని ఆరాధిస్తాం..

దోసపండు కాడనుండి విడివడేటట్లు మరణం పట్టునుండి విడివడదాం గాక ! ఆత్మస్థితి నుండి విడివడక ఉందాం గాక !! ""

భావార్ధ వివరణ :- ' మృత్యుంజయ ' అంటే మరణాన్ని జయించడం అని అర్ధం. మరణాన్ని జయించడానికైన మంత్రంగా దీనిని పేర్కొంటారు.. ఇది శుక్ల యజుర్వేద సంహితలోని ఓ మంత్రం.

మరణాన్ని జయించడం అంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం అని అర్ధం కాదు.. శరీరం నుండి ప్రాణం విడివడడమే మరణం, దీనిని బుద్ధిపూర్వకంగా అంటే జీవిస్తున్నప్పుడే శరీరాన్ని తనకి భిన్నమైనదని అనుభూతిమూలంగా తెలుసుకోవడమే మరణాన్ని జయించడం..

ఇలాంటి విరాగభావనతో జీవిస్తున్న వ్యక్తిని శరీరపతనం ఏ విధంగానూ బాధించదు.. నిజానికి తాను శరీరం కాదు,, దాన్లో నెలకొని ఉన్న నాశనం లేని ఆత్మ అని అతడు తెలుసుకుంటాడు...అతడు మరణాన్ని జయిస్తాడు...

అటువంటి ఒక ఫలానా స్థితి నిమిత్తం ప్రార్ధన చేస్తుంది ఈ మంత్రం..

ఇంటినుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించడం మనలను ఆపదలనుండీ,, ప్రమాదాలనుండీ రక్షిస్తుందని చెప్పుకోవడం కద్దు..

మరణించినవారిని ఉద్దేశించి ఈ మంత్రం జపిస్తే వారికి సద్గతి లభిస్తుందనీ,,ముఖ్యంగా అకాల మరణం చెందినవారిని ఉద్దేశించి ఈ మంత్రాన్ని జపిస్తే వారికి ఆత్మశాంతి కలుగుతుందని చెబుతారు.

శుభోదయం 😊

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి