25 జనవరి, 2017

ముగ్గు గీస్తున్నప్పుడు అమ్మాయిల అందం ఎలా ఉంటుందంటే?


పుష్యమాసం కదా ప్రస్తుతం? పొగమంచు చంపేస్తోంది పొద్దు గుంకిన దగ్గరనుంచీ పొద్దుపోయేంతవరకూ... ఎముకలు నొప్పి పుట్టేంతగా చలిగాలి వీస్తోంది పొద్దున్నపూట...

ఈ సమయంలో హాయిగా దుప్పట్లో దూరి బయటకి రాకుండా పడుక్కోవడం ఉత్తమమనిపిస్తింది ఎవరికైనా,, కానీ మా ఊళ్ళో కాపు కన్నెలు మాత్రం తెల్లారే తమ ఇంటిముందు కళ్ళాపి జల్లి ముగ్గులు పెడుతున్నారు ఈ చలిని ఏమాత్రం లెక్క చెయ్యమన్నట్లు 😁

అమ్మాయిలు అలా మోకాళ్ళపై కూర్చుని తమ గెడ్డాన్ని ఆంచుకుని తమ ఎదురుగా ముగ్గుబుట్ట పెట్టుకొని ' ఏ ముగ్గు గీస్తే బాగుంటుందా? ' అని ఆలోచిస్తూ, , తమ ఆలోచనలకి అనుగుణంగా తయారైన ఆ ముగ్గుని చూస్తూ మురిసిపోతూ నవ్వుతూ ఉండడం చాలా బాగుంటుంది తెలుసా?

అందులోనూ ఈ పుష్యమాసంలో తెల్లారగట్ల వచ్చే సూర్యకిరణాలు చాలా లేతగా,, వేడి ఏ మాత్రంలేకుండా చాలా తాజాగా,, పరిశుభ్రంగా ఉన్నట్లు ఉంటాయి... ఆ సూర్యకిరణాలలో గాలిలోని దుమ్ము కదలిక కూడా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది మనకి..

అలాంటి సువర్ణవర్ణపు సుతిమెత్తని లేలేత కిరణాలు వాళ్ళ తడి కురులపై,, అలాగే వర్షం వెలిశాక వచ్చే ఉదయమప్పుడు ఆకాశం నుంచి ప్రసరించే కాంతి రంగుగల వాళ్ళ వొంటిపైనా ప్రసరిస్తూ బంగారురంగులో కాంతులీనుతుంటే వాళ్ళనలా చూడడం పురుషుడికి స్త్రీత్వంపై ఆకర్షణనని మించిన ఆప్యాయతనూ,, ఆనందాన్ని కలగచేసే ఒకానొక గొప్ప అనుభవం అంటాన్నేను 😊

మీరేమంటారు?

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి