25 జనవరి, 2017

తెల్లారిజామున నేను త్రుంచిన తామరపువ్వు ఇది


తెల్లారిజామున నేను త్రుంచిన తామరపువ్వు ఇది 👌

( " తమ నాధుడైన సూర్యుడు రాత్రంతా తమని విడిచిపెట్టి పరకాంత వద్ద గడిపాడని కోపమూ,, ఈర్ష్యగల ఖండిత నాయికల వలె తామర తీగలు సూర్యోదయ కాలంలో దుఃఖిస్తూ ఉంటాయి... కమలాలు అనే తమ ముఖాల నుంచి మంచు బిందువులనే బాష్పాలు రాలుస్తూ ఉంటాయి..

అప్పుడు సూర్యుడు , కిరణాలు అనే తన చేతులు చాపి వాటి ముఖ కమలములపై మంచు అనే కన్నీళ్ళు తుడుస్తూ వాటి శోకాన్ని మానుపుతాడు " అని వీటి సౌందర్యాన్ని వర్ణిస్తాడు కాళిదాసు తన మేఘసందేశ కావ్యంలో _/\_

పొద్దున్న వీటిని చెరువులో చూసినప్పుడు అదే వర్ణన గుర్తుకొచ్చింది నాకు )

శుభోదయం 😀

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి