రాజమండ్రి దగ్గర ఉన్న విశాలమైన గోదావరిని అందమైన అమ్మాయిగా ఊహిస్తే ఆ అమ్మాయి నడుముకి అందంగా అలంకరించబడిన ఆభరణం ఈ రోడ్ కమ్ రైల్వేబ్రిడ్జ్...
ఆ బ్రిడ్జ్ మీదుగా పోతోంది నేను ప్రస్తుతం ప్రయాణిస్తున్న సింహాద్రీ ఎక్స్‌ప్రెస్
ఎంత బాగుందో ఈ గౌతమీ ప్రవాహం ఇక్కడనుంచి ఇలా చూస్తుంటే :)
నదిలో ఇసుకతిన్నెలు మేటగా వేసినచోట గుంపులుగుంపులుగా ఎదిగే పూచిక మొక్కల తెల్లని పూలు తెప్పల్లా తేలుతూ ముందుకీవెనక్కీ ఊగుతూ ఆడుకుంటున్నాయి గోదావరి నదీ అలలపై ఎంతో అందంగా ఇప్పుడు
శరదృతువులో ఇదో అందం మా గోదారమ్మకు
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి