" పరలోక పరివర్తన సభలు " అనే ఫ్లెక్స్ కనిపించింది నాకీమధ్య కాకినాడ వెళ్తూంటే దారిమధ్యలో...
చూడగానే అనుమానం వేసింది " ఏమిటి ఈ సభ తాలూకు ఉద్దేశం? " అని...
పిల్లాడి మేధోస్థాయికి ఇదవసరమా కాదా? అని ఆలోచించకుండా 4వ క్లాస్ నుంచే " ఐ.ఐ.టీ కోచింగ్ ఇస్తాం " అని హామీ ఇచ్చే విద్యాసంస్థల్లా వీళ్ళుకూడా పరలోకంలో ఇలా ఉండాలి,,ఇలా ఉండకూడదని అక్కడ పాటించాల్సిన ప్రవర్తనా నియావళి ఏమైనా బోధిస్తారా ఆ ప్రాంతాన్ని వీరేదో బాగా ఎరిగినట్లు ఈ సభల్లో జనాలకి ??
అయినా పరివర్తన అనేది ఇహలోకానికి సంబంధించినదై ఉండాలి కానీ ఉందోలేదో తెలియని ఆ పరలోకం గురించి ఎందుకు?? అని అనుమానం కలిగింది నాకైతే...
ఇలానే ఇంకా అర్ధంకాని ప్రకటనలు కొన్ని గమనించాను నేను...
" గుడ్డివారు చూపు పొందుట "
" కుంటివారు నడుచుట "
" చెవిటివారు వినుట "
చూడాలని ఉందా? అయితే ఈ సభకి రమ్ము...!!!
అనే పోస్టర్స్ చూసి పిచ్చెక్కుతూ ఉంటుంది నాకొక్కోసారి...
( ఈమధ్య టీ..వీ ల్లో చూశాను... " కేవలం స్క్రీన్ తాకండి..మీ కష్టాలనుంచి ఉపశమనం పొందండి " అని ఒకడు చెప్తున్నాడు తదాత్మకంగా కళ్ళుమూసుకుని గట్టిగా ప్రార్ధిస్తూ ఓ చానల్లో... చెప్పేవాడు అలా చెప్పినా వినేవాళ్ళు ఎలా పాటిస్తున్నారు ఇలాంటి నమ్మశక్యం కాని నమ్మకాలను? అనే విషయం నాకిప్పటికీ అర్ధంకాదు..
ప్రార్ధనల పేరిట ఓ మాస్ హిస్టీరియా క్రియేట్ చేసి జనాలను పిచ్చివాళ్ళను చేస్తున్నారు కొందరు మత ప్రచారకులు..కావాలంటే ఈ వీడియోలో చూడండి
ఎలా జరుగుతాయిరా బాబూ ఇలాంటి మహాద్భుతాలన్ని ఏ హేతువూ లేకుండా ? అని అంటే ప్రార్ధనాతైలం రాసుకుంటే తగ్గుతాయని చెప్పాడు నా మిత్రుడొకరు... ( చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ వైద్యాన్ని నమ్మకుండా ఈ తైలం చల్లుకుంటే వ్యాధి తగ్గుతుందని నమ్ముతారు ఆ వ్యాధి తీవ్రంగా బాధిస్తున్నాసరే..ఇదేం చిత్రమో మరి...!!!)
మనిషికి నమ్మకం ఉండచ్చు కానీ మన తర్కాన్నీ,,ఆలోచనా విధానాన్ని పనిచెయ్యనివ్వనంత ఉండడం ఎంత వరకూ సబబు? అని అడగాలనిపిస్తుంది ఇలాంటి విధానాలను మరో ఆలోచన లేకుండాపాటించేవారిని చూసినప్పుడల్లా...
అంత ఆలోచించేవాళ్ళే ఉంటే వాళ్ళకి అసలీ ఆలోచనలు తట్టవా?
మనిషి పుట్టి ఎనభై లక్షల సంవత్సరాలు పైనే అవుతోంది...అతను రెండుకాళ్ళపై నడవడం మొదలెట్టి ఇరవై లక్షల సంవత్సరాలపైగానే అవుతోంది..పంటలు పండించడం,,నాగరిక లక్షణాలు సృష్టించుకుని జీవించడం మొదలెట్టి పన్నెండు వేల సంవత్సరాల పైనే అయ్యింది...
మరి మనుష్యుల కష్టాలు బాపుటకు దేవుడు కేవలం 2000 ఏళ్ళ క్రితమే పుట్టడమేమిటి?
అంతకు ముందు మనుష్యులకి కష్టాలు లేవా? వాళ్ళేమీ బాధలు పడలేదా?? లేకపోతే వాళ్ళసలు మనుష్యులే కాదా?
ఆలోచించండి ఓ సారి :)
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి