14 అక్టోబర్, 2016

శిశువు కళ్ళపైన తాకిపోయే నిద్ర ఎక్కణ్ణించి వస్తోందో ఎవరికైనా తెలుసా?


శిశువు కళ్ళపైన తాకిపోయే నిద్ర
ఎక్కణ్ణించి వస్తోందో ఎవరికైనా తెలుసా?

మిణుగురుల మసక వెలుగుల అడివినీడలకిన్నెర గ్రామంలో
రెండు ఐంద్రజాలిక కుట్మలాలువేళ్ళాడుతున్నాయి.
శిశువు కళ్ళని ముద్దు పెట్టుకోడానికి
నిద్ర అక్కడి నించి బయలుదేరి వొస్తుంది.

నిద్రించే శిశువు పెదిమలపై
దోబూచులాడుతుండే ఆ చిరునవ్వు!ఎక్కడ పుడుతుందో ఎవరికైనా తెలుసా!

కరిగిపోయ శరన్మేఘాంచలాన్ని
అర్ధచంద్రరేఖా నవధవళ కిరణ మొక్కటి తాకినదట.
ఆ తుషార స్నాత ప్రభాత స్వప్నంలో
ఈ చిరునవ్వుకి ప్రధమ జననమని వదంతి,
నిద్రించే శిశువు పెదిమలపై
దోబూచులాడుతుండే ఆ చిరునవ్వుకి.

శిశువు శరీరం పైన మెరిసే
మధురమైన మృదు స్నిగ్ద నవ్యత
ఇంతకాలం ఎక్కడ దాక్కుని ఉందో తెలుసా?

అవును,తల్లి బాల్యదశలో
మాటరాని అర్ధంకాని లేత ప్రేమావ్యక్తతలో
ఆమె హృదయాన్ని ఆవరించి
నిద్రపోతోవుంది
శిశువు దేహం పైన వికసించిన
మధుర స్నిగ్ద కోమలత్వం

( రవీంద్రుని గీతాంజలి నుంచి సేకరణ )

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి