14 అక్టోబర్, 2016

రవీంద్రుని గీతాంజలిలో నాకిష్టమైన మరో గేయం


" పచ్చని వరి పొలాలమీద శరత్ మేఘాల నీడలు ఊడ్చుకుంటూ పోతున్నాయి.. వాటి వెనక వేగంగా వెంటాడుతున్నాడుసూర్యుడు.

తేనెని తాగడం మరిచి వెలుతురు తాగి మత్తెక్కి అది వెర్రిగా,, గుంపుగా మూగుతూ అర్ధంలేని పాటలు పాడుతున్నాయి ; మధుపాలు.

నదీ ద్వీపాలలోని బాతులు ఏ అర్ధమూ లేకుండా సంతోషంగా వూరికే అరుస్తున్నాయి.

ఎవరూ ఇళ్ళకి వెళ్ళకండి. నేస్తాలూ,, ఈ ఉదయాన ఎవరూ పనిలోకి పోకండి.

దండెత్తి మీదకి ఉరికి నీలం ఆకాశాన్ని దోచుకుందాం. పరిగెత్తుతో స్థలాన్ని కొల్లకొడదాం.

వరదమీది నురుగుమల్లె గాలిలో నవ్వు తేలిపోతోంది.

నేస్తాలూ,, పనిలేని పాటల్లో ఉదయాన్ని వృధాగా గడిపేద్దాం "

( ఠాగూర్ గారి " వనమాలి " నుంచి సేకరణ )

Good Morning

- Kks Kiran


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి