24 ఆగస్టు, 2016

చలం అనువదించిన రవీంద్రుని గీతాంజలిలో స్వాతంత్రం గురించి ఓ గీతం


" ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో,

ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో,,

ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో,,,

సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల క్రింద ప్రపంచం విడిపోలేదో,,,,

ఎక్కడ సత్యంతరాళంలోంచి పలుకులు బయలు వెడలుతాయో,,,,,

ఎక్కడ అలసటనెరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో,,,,,,

ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచమైన బుద్దిప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో,,,,,,,

ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి ,కార్యలలోకి నీచే నడపబడుతుందో,,,,,,,,,

ఆ స్వేచ్చా స్వర్గానికి తండ్రీ నా దేశాన్ని మేల్కొలుపు .. "

(చలం అనువదించిన రవీంద్రుని గీతాంజలి నుంచి సేకరణ )

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి