16 మే, 2016

ఆలోచించాల్సిన విషయమే





భావాలు లేని మనిషి రెక్కలు లేని పక్షి లాంటివాడు..

తాను ప్రపంచాన్ని సరిగ్గా చూడలేడు,,తన దగ్గరవారికి ఎక్కువగా ప్రపంచాన్ని చూపలేడు...

తన పరిధిలో తాను ఉన్నతంగా బ్రతుకుతున్నానని భ్రమపడుతూ ఉంటాడు...

ఇలా ఉన్నదానితో సంతృప్తిపడుతూ కొత్త అనుభవాలకీ,,అనుభూతులకి ప్రయత్నించక ఆలోచనలలో,,జీవనవిధానంలో మార్పులేకుండా బ్రతికే వాళ్ళని గొప్ప వేదాంతులుగా భావించాలో లేక ఎస్కేపిస్ట్లు అని వర్గీకరించాలో అర్ధంకాదు నాకు ఒక్కోసారి...

మనిషికీ జంతువుకీ తేడా ఉందని కొన్నిసార్లైనా నిరూపించుకోవద్దూ మనిషంటే?

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి