16 మే, 2016

రవీంద్రుని గీతాంజలిలోని ఓ కవిత





" గీతాంజలి "

గత కొంతకాలంగా నన్నూ ,, నా ఆలోచనలనూ ప్రభావితం చేస్తున పుస్తకం ఇది.. ఇదో నిత్య పారాయణా గ్రంధమైపోయింది నాకు ఈమధ్య... అందులో నాకు బాగా ఇష్టమైన గీతాలలో ఇదొకటి..

"" నన్నల్లుకున్న బంధాలు మొండివి. కాని వాటిని తెంపుకోవాలని ప్రయత్నిస్తే, నా హృదయం భాదిస్తుంది...

నాకు కావలసిందల్లా స్వేచ్చ. కాని దాని కోసం ఆశించటానికి కూడా నాకు సిగ్గవుతోంది.

నాకు నిశ్చయంగా తెలుసు నీలో విలువల్ని మించిన ఐశ్వర్యముందని, నువ్వు నా వుత్తమ మిత్రుడవని, కాని నా గది నిండా పేరుకున్న విలువలేని తళుకుల్ని వూడ్చేసేందుకు నా మనసొప్పదు..

నన్ను కప్పిన దుప్పటి వుత్త దుమ్మూ, మృత్యువూ. దాన్ని చూస్తే నాకు పరమ ద్వేషం. అయినా దాన్ని ప్రేమతో గట్టిగా హత్తుకుంటాను.

నా రుణాల కంతం లేదు. నా లోపాలు బహుళం. నా లజ్జ రహస్యమైనదీ, భారమైనదీ. ఐనా నన్ను దిద్దమని నిన్ను అడగటానికి వొచ్చి, తీరా నా ప్రార్ధన ను కటాక్షిస్తావేమోనని వొణికిపోతాను. "

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి