28 మే, 2016

చలం అనువదించిన రవీంద్రుని గీతాంజలి గురించి పరిచయ వాఖ్య



" భగవద్గీత ,, గీతాంజలి "

ఈ రెండు పుస్తకాలూ ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలవదగ్గ గొప్ప పుస్తకాలు.. చదివిన ప్రతీసారీ మళ్ళా మళ్ళా కొత్త అర్ధాలను స్పురింపచేయడం,,కొత్త ఆలోచనలను,,కొత్త కోణాలను పరిచయం వీటియొక్క గొప్పతనం...

సరే,,భగవద్గీత యొక్క గొప్పతనం గురించి ప్రత్యేకించి నేను చెప్పేదేముంది?? మనిషి యొక్క అన్ని తాత్వికపరమైన చింతలకూ అందులో సమాధానం ఉంది.. ఇప్పటికే కొన్ని వేల విశ్లేషణలు వచ్చాయి ఈ పుస్తకానికి...అయినా ఇప్పటికీ ఇంకా కొత్త జ్ఞానాన్ని ,, కొత్త దారినీ చూపిస్తూ మనిషిని చైతన్యపరుస్తూనే ఉంది ఈ పుస్తకం...కనుక ప్రత్యేకించి నేనేమీ పరిచయ వాక్యాలు రాయబోవట్లేదు ఈ పుస్తకం గురించి...

కానీ రవీంద్రుని గీతాంజలి గురించి మాత్రం తప్పకుండా రాయాలనిపిస్తోంది...ఎందుకంటే చాలామందిని నేను " గీతాంజలి చదివారా ? " అంటే ఆ పుస్తకం గురించి విన్నాం కానీ చదవలేదనే చెప్పారు...

ఒకవేళ మీరూ  గీతాంజలి గనుక చదవకపోతే తప్పకుండా " చలం " గారు అనువదించిన గీతాంజలి చదవండి...

ఠాగూర్ గారి ఆత్మానందాన్ని సరిగ్గా అందుకుని గొప్ప విశాలత్వాన్నీ,,ప్రేమతత్వాన్నీ,,సౌందర్యోపాసననీ,,ఆధ్యాత్మిక ఆనందాలనీ,,జీవితంలోని సున్నితత్వాన్నీ,,సంతోషాలనీ అతి గొప్పగా,,చక్కటి పదాలతో,,అందమైన శైలితో సూటిగా సుత్తిలేకుండా చాలా సహజంగా,అద్భుతంగా అనువదించారు చలంగారు...

అందులో నాకిష్టమైన ఓ గీతం ఇది..

"" మహారాజా ! " రుషి నరోత్తముడికి ప్రభువుల దేవాలయంలోకి ఒక్కసారి ప్రవేశించాలన్న లక్ష్యం కూడా లేకపోయింది " అని పరిచారకుడు రాజుతో చెప్పాడు..

" దారిపక్కన బయలులో కూర్చుని కీర్తనలు పాడుతున్నాడు ఆయన..ఆలయంలో పూజా సమయంలో ఒక్కరూలేరు.. బంగారు కలశంలోని తేనెని నిర్లక్ష్యంగా వొదిలి శ్వేతపద్మంచూట్టూ మూగే తేనిటీగలవలే ప్రజలు ఆయన చుట్టూ గుమికూడారు " అని అన్నాడు..

రాజది విని సహించలేక బాట పక్కన బయలులో కూర్చున్న నరోత్తముడి దగ్గరకి వెళ్ళాడు..

" నామ సంకీర్తన చేసేందుకు నా బంగారు గోపురాల దేవాలయం ఉండగా ఈ దుమ్ములో కూర్చోవడం ఏం ఖర్మం స్వామీ !! " అని అడిగాడు..

" నీ ఆలయంలో ఈశ్వరుడు లేడు గనుక " అన్నాడు నరోత్తం.

రాజు బొమలు ముడిచి " తమకు తెలీదా? ఆ అద్భుత కళామందిరాన్ని నిర్మించడానికి ఇరవై కోట్ల బంగారం ఖర్చైంది..మహామంత్ర కుంబాభిషేకాలతో ఈశ్వరపతిష్ట జరిగింది..మీకు తెలుసు కదా ?? " అని అన్నాడు..

" నాకు తెలీకేం..ఆ ఏడేకదూ,, ఇళ్ళు తగలబడి ,, నిరాధారులై వేలకు వేలు ప్రజలు రాజద్వారం ముందు పడి ఆర్తి తీర్చమని వ్యర్ధంగా రోదించింది..జ్ఞాపకం లేకేం !

అప్పుడే అన్నారు ఈశ్వరుడు " తన ప్రజకి గుడిశలు కట్టించలేని నిర్భాగ్యుడు నాకు ఆలయం నిర్మిస్తాడా? అని తలదాచుకోడానికి స్తలం లేని వారితో,,బాటపక్కన చెట్లకింద తానూ నివసిస్తున్నారాయన... ఆ బంగారు బుద్భుదంలో అహంకారపు ఆవిరికాక ఇంకేం ల్లేదు " అన్నారు నరోత్తం..

రాజు మండిపడి " పో,,నా రాజ్యాన్ని వదిలిపో " అన్నాడు..

" అలాగే,,నా ఈశ్వరుణ్ణి ఎక్కడికి బహిష్కరించావో,,అక్కడికే నన్నూ తరుము " అన్నారు శాంతంగా ఆ రుషి ""

శుభసాయంత్రం :)

- Kks Kiran 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి