22 మే, 2016

గాధాసప్తసతిలోని ఓ అందమైన వర్ణన





ఆకుపచ్చని ఈకలతో, ఎర్రనిముక్కుతో రామచిలుకలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.ఇవి సాధారణంగా ఒక గుంపుగా ఎగురుతూ,తిరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక రామచిలుకల గుంపు ఎగురుతూ వచ్చి వాలే దృశ్యాన్ని హాలుడి గాధాసప్తసతి ఎంత బాగా వర్ణించారో చదవండి..


" రామచిలుకల దండు ఆకాశంనుండిక్రిందకు వచ్చి వాలుతుంటే,

వైకుంఠంలోని లక్ష్మీదేవి యొక్క
పచ్చలు కెంపులు పొదిగిన నగలేవో నేలకు జారిపడినట్లనిపిస్తోంది. "


బాగుంది కదూ ఈ వర్ణన? ఇంతకి మించిన ఎన్నో గొప్ప వర్ణనలు ఉన్నాయి ఈ పుస్తకంలో...


సాహితీ ప్రియులు తప్పకుండా చదవాల్సిన పుస్తకము ఈ గాధాసప్తసతి

( సాహితీయానం బ్లాగ్  నుంచి సేకరణ)

శుభసాయంత్రం :)

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి