20 ఏప్రిల్, 2016

నిధి చాల సుఖమో రాముని స న్నిధిసేవ సుఖమో నిజముగ బల్కు మనసా



"" నిధి చాల సుఖమో రాముని స
న్నిధిసేవ సుఖమో నిజముగ బల్కు మనసా

దధి నవనీత క్షీరములు రుచో
దాశరధీ ధ్యానభజన సుధారసము రుచో

శమ దమ మను గంగాస్నానము సుఖమో క
ర్దమ దుర్విషయ కూపస్నానము సుఖమో

మమత బంధనయుత నరస్తుతి సుఖమో
సుమతి త్యాగరానుతుని కీర్తన సుఖమో ""

(త్యాగరాజ స్వామిని తలుచుకోకుండా శ్రీరామ నవమి జరుపుకుంటే అది అసంపూర్తిగా జరిగినట్టేనని నా అభిప్రాయం...

ఒకవేళ అలా జరుపుకున్నామంటే మనలని మించిన కృతఘ్నులు మరెవరూ ఉండనట్లే లెక్క ఈ ప్రపంచంలో...!!!

శ్రీరామనవమి శుభాకాంక్షలు

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి