03 ఏప్రిల్, 2016

అసంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు



గత కొన్ని రోజులుగా టీవీలో కాసేపు అసంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా ప్రసారమవుతూంటే చూస్తున్నాను... ఎంతసేపూ " నువ్వింత దోచుకున్నావు,, ఇంత ఆస్తి అక్రమంగా సంపాదించావు,, రాజధానిప్రాంతంలో నీ బినామీలు ఇన్ని భూములు కొన్నారు " అనే వాదప్రతివాదనలే అధికార ,, ప్రతిపక్ష సభ్యులమధ్య నడిచాయితప్ప నిజంగా అందులో పనికొచ్చే మాటలుకానీ,, వ్యవస్థకి ఉపయోగపడే తీర్మానాలూ కానీ ఒక్కటీ లేవు ...

ఇలా వాదప్రతివాదాలు చేసుకోడానికా వీళ్ళు అసంబ్లీకి వచ్చేది??? అయినా విమర్శలనేవి ఆ ఆ పార్టీలయొక్క సైద్ధాంతిక విభేదాలవల్ల కలగాలికానీ ఈ వ్యక్తిగత విమర్శలు వెదజల్లుకోవడమేమిటి ఒక్కళ్ళపై మరొకరు ఇంత నిస్సిగ్గుగా??? అని విసుగేస్తోంది చూస్తున్నంతసేపూ,,,

తప్పు వాళ్ళది కాదేమోలెండి,, ఎవరి సంస్కారంబట్టి వాళ్ళు అట్లానే ప్రవర్తిస్తారు... ఎవరినిపడితే వాళ్ళను ఇలా మనలని పాలించడానికి మనం ఎన్నుకోవడమే మనం చేస్తున్న పెద్ద తప్పేమో...!!!

" అసలేంచూసి నేను ఇతనికి / ఈమెకి నన్ను పాలించడానికి అర్హత ఇస్తున్నాను ఈ ఓటుద్వారా ? " అనే ప్రశ్న ఎంతమందికి కలుగుతోంది మనలో ఓటువేసేటప్పుడు? మామూలుగా ఓ ఉద్యోగం చేయడానికే సవాలక్ష అర్హతలు కావాలని అంటారే,,మరి అలాంటిది ఇంత పెద్ద వ్యవస్థని చక్కబెట్టాలంటే మనం ఎన్నుకునే ఆ నేతకి తగిన సామర్ధ్యం ఉందా లేదా? అని ప్రశ్నించుకుని ఓటు వెయ్యద్దూ మనం???

రాజ్యాంగంకూడా ఎవరైనా ఎన్నికలలో పోటీ చేసే అధికారం కల్పించి గొప్ప ద్రోహం చేస్తోంది ఈ జాతికి అని అనిపిస్తూంటుంది ఒక్కసారి... " ఎన్నికలలో పోటీ చేసే నేతలకి కనీస విద్యార్హత ఇంత ఉండాలనో,,ఈ ఈ అంశాలలో కనీస అవగాహన ఉండలనో కొన్ని కొన్ని రూల్స్ పెడితే బాగుండును " అని బలంగా అనిపిస్తూంటుంది ఒక్కోసారి నాకు కొందరు నేతలను దగ్గరనుంచి చూసినప్పుడు..

ఇదంతా చదివాక " కేవలం చదువుకున్నవాళ్ళే నేతలగా ఉండలా??? వాళ్ళే సమర్ధవంతంగా ఈ వ్యవస్థని నడిపించగలరనే నమ్మకమేమిటి? " అని ఎవరైనా అడగవచ్చు నన్ను... ప్రపంచం ఒక్కప్పటిలా కాకుండా తన పరిధిని పెంచుకుంటూపోతూ మనిషి జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితంచేస్తోంది.....మారుతున్న ఆర్ధిక,సామాజిక,రాజకీయ పరిస్థితులవల్ల మనిషి జీవితం సంక్లిష్టం అయిపోతోంది కూడా రాన్రానూ...

ఇలాంటి పరిస్థితుల్లోకూడా " రెపో రేట్ అంటే ఏమిటి ? రిజర్వ్ బ్యాంక్ రివర్స్ రెపోరేట్ ప్రకటిస్తే కలిగే లాభాలేమిటి ? నష్టాలేమిటి ? ద్రవ్యోల్బణం అంటే ఏమిటి ? అది ఏ ఏ అంశాలను ఏ ఏ విధంగా ప్రభావితంచేస్తుంది?? జీ.డీ.పీ పెరగాలంటే ఏం చెయ్యాలి?? జనాలు ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పధకాలపై ఆధారపడకుండా స్వయంసమృద్ధి పొందేలా వాళ్ళకి ఏ ఏ విధంగా మనం తోడ్పాటునివ్వాలి ప్రభుత్వపరంగా? ఎగుమతులు,దిగుమతుల కధామామిషూ ఏమిటి ? " అనే విషయాలపై కనీస అవగాహనలేని వాళ్ళను మనకి రీప్రజంటివ్స్ గా పంపుతామా చట్టసభల్లోకి ??? మీరేచెప్పండి...

అలాంటివాళ్ళేం చేస్తారు మనకి? మనలని రెచ్చగొడుతూ,,మన ఎమోషన్స్తో ఆడుకుంటూ తమ రాజకీయ ఎదుగుదలకి మనలని ఓ సమిధల్లా వాడుకుంటూ మన ఎస్కేపిజాన్ని సమర్ధిస్తారంతే...!!! అంతకిమించి ఏ ఉపయోగమూ ఉండదు ఇటువంటి నేతలవల్ల..

ఆలోచించండోసారి....!!!

- Kks Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి