25 మార్చి, 2016

Capitalism vs Communism



రద్దిగా ఉండే బస్టాండ్లో మీరెప్పుడైనా ఇలాంటి సన్నివేశాలు గమనించారా?

బస్ వచ్చిన వెంటనే జనాలు ఒక్కసారిగా సీట్లలో కూర్చోవాలని ఆత్రపడి ఒకరిని మరొకరు తోసుకుంటూ,తిట్టుకుంటూ,నెట్టేస్తూ మరీ బస్ ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు.తీరా బస్ లోపలకి ఎక్కాక ఆ బస్ కిటికీలలోంచి సీట్లలోకి కొందరు వేసుకున్న రుమాళ్ళు కనపడి వీళ్ళని వెక్కిరిస్తాయి.ఆ ఆ రుమాళ్ళు వేసుకున్న వ్యక్తులు తర్వాత తీరికగా  బస్ ఎక్కి ఇక ఆ సీట్ తమ సొంతం అన్నట్లు ప్రవర్తిస్తూ చక్కగా కూర్చుంటారు వీళ్ళముందే.ముందు బస్ ఎక్కినా కూడా సీట్ దక్కలేదన్న నిరాశతో పాపం వీళ్ళు బాధపడుతూ ఉంటారు కొద్దిగా..!!

వాస్తవంగా ఆలోచిస్తే రుమాలు ముందు వేసుకున్నంత మాత్రాన సీట్లు ఆ ఆ వ్యక్తులకి ఇవ్వాలా? అలా ఇవ్వాలని ఎక్కడైనా రూల్ రాసిపెట్టి ఉందా? కానీ జనాలు " రుమాలు వేసిన వాడిదే సీట్లో కూర్చునే అధికారం " అని ఓ ప్రామాణికంగా  ఓ విధానాన్ని ఏర్పరుచుకుని అదే పాటిస్తూ ఉంటారు ఎక్కడైనా ఇలా రద్దిగా ఉండే ప్రదేశాలలో..అలా కాదని ఆ రుమాలు తోసి మీరు కూర్చుంటే మీ మీదకి అందరూ గుంపుగా గొడవకి దిగుతారే  తప్ప ఒక్కళ్ళూ ఇది తప్పు అని వాదించరు.

ఇదే సన్నివేశాన్ని మన వ్యవస్థకి అన్వయించుకుని చూద్దాం...!!!

ఆ బస్ లాంటిదే మన వ్యవస్థ కూడా.అవకాశాలు,వనరులు చాలా తక్కువ,,కానీ అవి చేజిక్కుంచుకుందాం అనుకునే వారెక్కువ మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అందరికీ అలా సాధ్యపడదని మనం పెట్టుకున్న ఓ ప్రామాణికమే " డబ్బు " .

డబ్బు సంపాదించినవాడికే ఇక్కడ అన్నీ దక్కుతున్నాయి,లేని వాడికి ఎప్పుడూ నిరాశే...

కానీ వాస్తవం ఆలోచిద్దాం...!!!

ఈ గాలి,భూమి,వెలుతురు,నీరు ఇలాంటి సహజవనరులు (సౌఖ్యాల గురించి చెప్పలేదు ఇక్కడ,,గమనించండి) ఒకరి సొంతమా? ఈ భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కరికీ దానిపై సమంగా హక్కు లేదూ? కానీ కొంతమందికే వాటిపై అధికారాలు కలిగి ఉండడం ఏమిటి? అని అడిగి చూడండి.

దానికి మేధావులైనా సరే ఇచ్చే సమాధానం ఇలా ఉంటుంది బహుశా " సమసమాజం అనేది ఎప్పుడూ రాదు ఈ పోటీ ప్రపంచంలో..తెలివైన వాడికీ,సామాన్యుడికి ఒకే ఫలితం ఉంటే ఇక కష్టపడాలనే ఆలోచన మనిషికి ఎందుకు కలుగుతుంది? డబ్బు ఉంది కాబట్టే నాగరికత అభివృద్ధి జరుగుతోంది..డబ్బువల్లే మనిషి జీవన విధానం,అలవాట్లు,నమ్మకాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి...మనిషికి ఇంత కన్న సౌఖ్యంగా  బ్రతకాలనే తాపత్రయమూ పెరుగుతోంది...లేకపోతే జనాలలో చాలా మంది సోమరులు అవుతారు.సమాజంలో కూడా స్తబ్దత పెరుగుతుంది తప్ప చైతన్యం ఏదీ ఉండదు..కాబట్టి డబ్బుని నిందించకు,,అది సంపాదించడానికి రకరకాల వ్యూహాలు వెయ్యి...అవసరమైతే జనాల మూర్ఖత్వాన్ని నీ సంపాదనకి ఒక మార్గంగా కూడా వాడుకుని ప్రపంచంలో సంపదని సృష్టించు,తద్వారా ఉపాధి అవకాశాలను పెంచు సమాజంలో " అని కాస్త మెటీరియలిజం బోధిస్తారు కూడా వాస్తవికవవాదం పేరిట...

విలువలూ,,సెంటిమెంట్ అని పట్టుకుని ఉండేవాళ్ళు చాలామంది ఈ ఈ వాదాల్న్ని ఒప్పుకోరు.మనిషిలో స్వార్ధం ఎక్కువైపోతుంది ఈ పరంపర ఇలా కొనసాగితే అని తమ ఆందోళన వ్యక్తపరుస్తారు..

ఇలా డబ్బు వల్ల ప్రభావితం అయిన వ్యక్తి,సమాజవిధానాల గురించి ఆలోచించి ఏ వాదం నిజమో అని తర్కిస్తే ఏదీ నిజమైన వాదంలా అనిపించదు,దేని లోపాలు దానికే ఉన్నట్లు అనిపిస్తోంది,,ఏ వాదం పూరిగా అన్వయించుకున్నా సమాజంలో అసంతృప్తి ఖచ్చితంగా కలుగుతుంది...కమ్యూనిస్ట్లు,పెట్టుబడీదారులు,మహా మహా ఆర్ధిక శాస్రవేత్తలు కూడా దీనికి సరైన సమాధానం చెప్పలేరేమో...!!! " ఏదో ఇలా నడిచిపోతోంది కదా,,అలా నడవనీ ఈ విధానాలని,నువ్వు మాత్రం వ్యక్తిగతంగా ఎదగడం ఎలానో ఆలోచించు ఈ వ్యవస్థలో " అని పరిష్కారంగా చెప్తారు తప్ప అంతకుమించి వారిదగ్గరా ఏమీ సమాధానాలు ఉండవు.

ఏమంటారు?

-  Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి