02 మార్చి, 2016

గీతాంజలి " లోని ఓ కవిత



" హే,,భాస్కరా...!!! ఆకాశంతప్ప నీ మూర్తిని భరించగలిగిందెవరు?

నీమీద కలలు కంటాను,,కానీ నీ సేవ చెయ్యగలననే ఆశనాకెన్నడూ లేదు... నిన్ను నాలో తీసుకోడానికి నేను మరీ అల్పురాలిని....

ఓ మహత్తరా,,నా బతుకంతా కన్నీళ్ళే...!!! " అని ఏడిచింది మంచుబొట్టు...

" అనంతాకాశాన్ని వెలిగించికూడా చిన్న తుషారబిందువుకైనా నన్ను నేనిచ్చేసుకోగలను...ఒక చిన్న తళుకునై నిన్ను నింపుతాను...నీ చిన్న జీవితం హాసపూరిత మండలమై వెలుగుతంది " అన్నాడు ఆదిత్యుడు.

( రవీంద్రనాధ్ టాగూర్ గారు రాసిన " గీతాంజలి "లోని ఓ కవిత ఇది. ఈ పుస్తకంలోని ఒక్కో పదమూ,,ఒక్కో వాక్యమూ,,ఒక్కో కవితా పట్టిపట్టి మరీ చదువుతూంటే జీవితంతాలూకు సున్నితత్వాన్నేదో స్పర్శిస్తున్నట్లు,,ఈ లౌకిక ప్రపంచానికి పట్టని,,బహిర్గతంకాని ఈ సృష్టి తాలూకు సౌందర్యపు లోతులను కనుక్కునట్లూ,,మనసుకి మించిన అవ్యక్తమైన అనుభూతి ఏదో కలుగుతోంది..

ఎంత గొప్పగా రాశారో టాగూర్ గారు ఇందులోని ప్రతీ అక్షరమక్షరమూ...తన అనుభూతికి దగ్గరగా మనలని తీసుకెళ్ళి గొప్ప ఆనందాన్ని పరిచయం చేశారు ఇందులో ఆయన...అందుకో చిన్న ఉదాహరణ పైన నేను పోస్ట్ చేసిన ఈ కవితే..

సూర్యోదయ సమయంలో ఈ కవితని జ్ఞప్తికి తెచ్చుకుని గడ్డికొసలపై కిరీటాల్లా అలంకరిచబడి ఉన్న మంచుబిందువులనొకసారి చూడండోసారి...మీకే అర్ధమవుతుంది ఆ అనుభూతిలోఉండే ఆనందమేమిటో...

ఇంతకన్న గొప్ప ప్రారంభమేముంటుంది ఓ ఉదయానికి?

శుభోదయం smile emoticon

- Kiran

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి