మహాకవి కాళిదాసు రచించిన " రఘువంశం " చదువుతున్నాను ప్రస్తుతం...
ఇంతకు ముందే నేనోసారి చదివాను ఈ కావ్యాన్ని...అయినా మళ్ళీ చదువుతున్నానంటే అందుకు కారణం ఇందులోని కవితామాధుర్యానికి ముగ్దుడిని అయిపోవడం వల్లనే...
కవిత్వం రుచి మరిగేటట్టు చెయ్యడంలో కాళిదాసుని మించిన కవి మరొకరు లేరేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి...అందుకే అతని గురించి
" కాళిదాస గిరాం,సారాం,
కాళిదాసః సరస్వతీ " అని అంటూ ఉంటారు మన పెద్దలు...
మచ్చుక్కి రఘువంశంలోని ఈ వర్ణన చూడండి.
" దిలీప మహారాజు సంతానం కోసం తన భార్య సుదక్షిణాదేవితో కలిసి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్తాడు...కుశల ప్రశ్నలయ్యాక పిల్లలు లేక బాధపడుతున్న విషయం ప్రస్తావించాడు.
అప్పుడు వశిష్టుడు ధ్యానముద్రలోకి వెళ్ళాడు.
అప్పుడు ఎలా ఉన్నాడంటే " సుప్తమీనం ఇవ హృద "
అంటే "అర్ధరాత్రి 12 గంటలకు ఆఖరి చేపపిల్ల కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొలనులోని నీళ్ళల్లో ఏ విధమైన అలజడి లేకుండా నిర్మలంగా,నిశ్చలంగా,ఎలా ఉంటాయో అలా వశిష్ఠుడి ముఖంలోనూ ఏవిధమైన అలజడి,,కంగారు,తొట్రుబాటు,ఆందోళన లేకుండా నిర్మలంగా,,నిశ్చింతగా,,ప్రశాంతంగా ఉంది " అని
చాలా అద్భుతమైన వర్ణన కదా??
ఇంకా గొప్ప గొప్ప వర్ణనలెన్నో ఉన్నాయి ఇందులో..వీలైతే తప్పకుండా చదవండి
శుభసాయంత్రం
- Kks Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి