తణుకు వచ్చినప్పుడలా తెలియని ఆనందం ఏదో కలుగుతూ ఉంటుంది నాకు.ఇక్కడ నాకంటూ ఓ గొప్ప ప్రపంచం ఉంది.అందుకే ఇక్కడకి వచ్చినప్పుడల్లా మా ఇంట్లో వాళ్ళతో ఏదో 4 ముక్కలు మాట్లాడేసి నాకు పరిచయం ఉన్న ప్రతీ ప్రదేశాన్నీ చూడడానికి పోతూ ఉంటాను నేను.
కాకరుపర్రులోని గోదావరి గురించీ,,మా ఇంటి దగ్గర ఉన్న గోస్తనీనది గట్టు గురించి,,ఆ గట్టుని ఆనుకుని ఉన్న చెట్లపై వాలే కొన్ని వందలాది కొంగల గురించి,అవి తొలిపొద్దులో దగ్గర్లోని చెరువులో గుంపుగా స్నానం చేసేటప్పటి దృశ్యం గురించీ,దారినీ,పొలాన్ని కనపడనీయకుండా చేసే పొగ మంచు గురించీ ఎన్నిసార్లు రాశానో నా రాతల్లో...!!! అయినా ఇప్పటికీ ఏదో ఒక కొత్త సౌందర్యం కనపడుతూనే ఉంటుంది నాకు ఇక్కడ..ఋతువు మారినప్పుడల్లా ప్రకృతిలో కలిగే మార్పు " నన్ను సరిగ్గా చూడు,,నా సౌందర్యం గురించి అందమైన పదాలలో రాయి " అనే ఒకరకమైన సవాలు చేస్తున్నట్లు ఉంటుంది.అందులోనూ ఇప్పుడు వర్షాకాలం కదా? ఎంత బాగుందో ఇక్కడి పరిసరాలన్నీ ఇప్పుడు.
" చెరువుల్లోనూ,నదిలోనూ రేవడి బురద ఇంకా ఇంకక ఎర్రగా ఉన్నాయి నీళ్ళన్నీ..వడి వడిగా ప్రవహిస్తున్న గోస్తని నది నీళ్ళల్లో నిద్రగన్నేరు చెట్ల కొమ్మలు కొన్ని నానిపోతున్నాయి.ఆ ప్రవాహంతోపాటే కొట్టుకుపోతున్న గుర్రపుడెక్క మొక్కలను పడవలుగా ఉపయోగించుకుంటూ కాకులు ప్రయాణం చేస్తున్నాయి ఎక్కడికో.వాటికిదేదో సాధారణమైన విషయం అన్నట్లుగా ఏమాత్రం భయం లేకుండా నిశ్చింతగా వెళ్తున్నాయి అలా ఆ నీళ్ళపైనే...
కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టిన వాకిళ్ళంత పచ్చగా,శుభ్రంగా మెరిసిపోతున్నాయి ఇక్కడి మొక్కలన్నీ.ఎక్కడి నుంచి వస్తున్నాయోకానీ సాయంత్రంపూట తూనీగలు తెగ తిరుగుతున్నాయి చిన్న చిన్నటి పచ్చని తుమ్మ పూలపైనా,,పొలాలమీదానూ. నాగలింగంపూల వాసన తెగ వస్తోంది ఆ హైస్కూల్ వైపు వెళ్ళినప్పుడల్లా.తెల్లని పొట్లపూవులు,,ఎర్రటి చంద్రకాంతం పూలూ పూసే సాయంకాలంవేళ ఎర్రటి సంధ్యాకాంతిని కొబ్బరి చెట్ల వెనుకనుండి గమనించీ గమనించనట్టుగా చూస్తే ఒక్కసారిగా భయం వేస్తోంది " ఎక్కడైనా పెద్ద అగ్నిప్రమాదం జరిగి ఇంత ఉవ్వెత్తున మంటలు ఎగసి పడుతున్నాయేమో " అని.అంత ఎర్రటి రంగు కలిగి ఉంటోంది ఈమధ్య సంధ్యాకాంతి.మనుచరిత్రలో మా పెద్దనగారు చేసిన సంధ్యాసమయ వర్ణన గుర్తొస్తోంది చూస్తోంటే... "
ఇక వేల్పూరులో మా ఇంటి దగ్గర ఉన్న రమణ ఆశ్రమం,,జుత్తిగలోని ఉమ మహేశ్వరస్వామి ఆలయమూ ఎంత ప్రశాంత వాతావరణాన్ని కలిగి ఉంటాయో..!!! దాదాపు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అరటి తోటలూ,,చెరకు మొక్కలూ,,పచ్చటి పొలాలు ఇలా పచ్చదనమంతా కుప్ప పోసినట్లు కనువిందు చేస్తూ ఉంటుంది... " అమృతం కురిసిన రాత్రి " అనే అత్యద్భుతమైన పుస్తకం రాసిన " దేవరకొండబాల గంగాధర్ " గారిది మా ఊరే...బహుశా ఇక్కడి వాతావరణం ఇచ్చిన ప్రేరణతోనే తిలక్ అంత గొప్ప పుస్తకం రాశాడేమో.!!! అని గర్వపడేవాడిని నేను... కానీ ఇంత అందాన్నీ వదిలి పిఠాపురం పోవాలంటే మనసు పీకేస్తోంది...ఏకాంతంలో ఉండే గొప్ప ఆనందాన్ని నాకు పరిచయం చేసిన ఈ ప్రదేశాలను విడిచి వెళ్ళాలంటే ఎందుకో బాధేస్తోంది...
నాకే ఓ ప్రియురాలుండి ఆమెని విడిచి వెళ్ళాళ్సి వస్తే కూడా ఇంతలా విచారించనేమో కానీ ఇప్పుడిలా వెళ్ళడం మాత్రం చాలా కష్టంగా తోస్తోంది నాకు :(
- Kiran

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి