తూర్పున తెల్లని తొలివెలుగురేఖలు విచ్చుకోకముందు గోదావరి జిల్లాల అందాన్ని చూడాలి..వర్ణించడానికి శక్యంకానంత అందమైన దృశ్యాలు గోచరిస్తాయి మనకి ఇక్కడ...అందులోనూ అసలే కార్తీకమాసం,,శరదృతువు కూడానూ ఇప్పుడు....ఈసమయంలో ప్రకృతిలో కలిగిన ప్రతీ మార్పూ ఓ అద్భుత చిత్రంలాతోస్తోంది నా మనసుకి..
*********************************************************************************
" పొద్దున్న కార్యక్రమాలు చేయించేపనిమీద పిఠాపురం ఆ ఆ పరిసర ప్రాంతాలలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాను నేను....అంత పొద్దున్నే నేను వెళ్తున్నప్పుడు వెళ్ళేదారంతా ఎక్కువ జనసంచారంలేక నిర్మానుష్యంగా,,ప్రశాంతంగా ఉంటోంది...ఆ సమయంలో బండిమీద వెళ్తూ వెళ్తూ చుట్టూ ఉన్న పొలాలనూ,,చెరువుగట్లనూ చూస్తే చాలా ముచ్చటేస్తోంది నాకు.....
చలి ఇప్పుడిప్పుడే పెరగడం మొదలైంది కదా? పొగమంచు పొలాలపైన పరుచుకుని ఉంటోంది ఏదో ఆ పంటలను ముద్దుపెట్టుకుంటునట్లు...చూస్తే ఆ రెండు గాఢపరిష్వంగంలో ఉన్న ప్రేయసీప్రియుడిలా అగుపిస్తున్నాయి నాకు...
సూర్యుడు రసికులకి శత్రువు కదా? " తెల్లారింది,,ఇక మీ రాసక్రీడ ఆపి లౌకికమైన పనులలో నిమగ్నం అవ్వండి " అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా తన సుతిమెత్తని సువర్ణవర్ణపుకిరణాలస్పర్శతో తెలిమంచుని వెనక్కి లాగుతున్నాడు పంటచేల మీదనుంచి.ప్రియుడిని విడవడం ఇష్టం లేక,,వెళ్ళడం తప్పనిసరై వెళ్తున్న ప్రియురాలిలా మంచు కొద్దికొద్దిగా ఆ కౌగిలినుంచి విడివడి ఎడబాటువల్ల కలిగిన ధుఖ్ఖం వల్లనో మరేమి కారణమో తెలియదుకానీ విపరీతంగా కన్నీరుకారుస్తోంది మంచుబిందువులరూపంలో...
విరహమైనా ఒక్కోసారి అందంగానే కనిపిస్తుంది అనుకుంట లోకంలో... అలా జారిన ఆ కన్నీళ్ళు పచ్చని గడ్డి కొసలపై కిరీటాల్లా నిల్చుని సూర్యకిరణాలవల్ల సప్తవర్ణాలనూ గోచరింపచేస్తున్నాయి తమలో.... కొంగలు అవి ముత్యాలనుకుని భ్రమసి తమ ముక్కులెట్టుకుని కెలుకుతున్నాయి గుంపులుగుంపులుగా వాటిని....ఎంత బాగుందో చూడడానికా సుందరదృశ్యం??
దారంతా ఆ కన్నీరు ఉండడంవల్లనేనేమో ఆ నల్లని తారురోడ్డంతా చాలా శుభ్రంగా కడిగినట్లు నీటితడితో అందంగా కనిపిస్తోంది...ఆ రోడ్డుపై బోలెడన్ని మైనగోరింక పిట్టలు గోల చేస్తున్నాయి గుంపులుగుంపులుగా....కరంట్ వైర్లపై పావురాలు కూర్చుని దీర్ఘంగా ఏవో ఆలోచిస్తున్నాయి విచారంగా మొహాలుపెట్టి వేదాంతుల్లా...శునకాలు సుషుప్తి అవస్థలో ఉన్నట్లు,,ఏ చీకూచింతా ఎరగనట్లు హాయిగా,,చలికి దగ్గరకి ముడుచుకునిమరీ నిద్రపోతున్నాయి దారిపై...ఆ దారిపక్కన పచ్చని కందిపూలు అందంగా ఊగుతున్నాయి గాలికదలికలకు అనుగుణంగా...
రైతులు మినుముల పంట జల్లుతున్నారు ఇప్పుడిప్పుడే తమ పొలాల్లో...వరిచేలు కోతకి వచ్చాయి,,అందుకే పిచ్చుకలు తెగ సందడి చేస్తున్నాయి ఆ ప్రాంతంలో....మీరెప్పుడైనా సరిగ్గా గమనించండి...అసలు పిచుకలు ఎప్పుడూ నడవవు తెలుసా? రెండుకాళ్ళతోనూ అవి గెంతుతాయేతప్ప మామూలు నడక వాటికిచేతకాదనుకుంట....తోకలు ఊపుకుంటూ ఎవరైనా వచ్చేస్తారేమో అనే బెరుకుతో అటూఇటూ అనుమానంగా,,భయంభయంగా చూస్తూ చప్పుక్కున కొన్ని వడ్లగింజలను నోటకరుచుకుని తుర్రున ఎగిరిపోతూ మళ్ళీ అక్కడక్కడే తిరగాడుతున్నాయి అవి....చిలకలు శీర్షాసనమేస్తున్నాయి ఒక్కోచోట విద్యుత్ తీగలను ఆసరాగా చేసుకుని....
ఇంకా ఇలా ఎన్నో అందాలుకనపడుతున్నాయి ఇక్కడ,,ఎన్ననిరాయను ఇలా వివరంగా? రాయడానికి ఒకటా రెండా? సవాలక్ష సౌందర్యాలు
కనిపిస్తూ ఉంటేను ఇక్కడ?
తెలియనివాళ్ళు స్వర్గం అనేది అక్కడెక్కడో పైన ఉంటుంది భూమికి దూరంగా అని అనుకుంటారు,,,కానీ అసలు స్వర్గంలో మాత్రం ఇంత అందం ఉంటుందా? అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి తొలి ఉషస్సు సమయాల్లో ఇక్కడి ప్రకృతిని చూసినప్పుడు నాకు...స్వర్గంలో మాత్రం ఇంత హాయి కలుగుతుందా? అని అనిపిస్తుంది ఒక్కోసారి సాయంసంధ్యా సమయాన మా కుక్కుటేశ్వరస్వామి గుడికి ఎదురుగా ఉన్న పాదగయమీదుగా వచ్చే చల్లనిగాలిని అక్కడేఉన్న పొన్నచెట్టుకింద కూర్చుని ఆస్వాదించినప్పుడు....
అవునులే....!!!
" స్వర్గానికీ,,ముక్తికీ కొందరే అర్హులు " అనీ అంటారుకదా ఈ పండితులంతా....కర్మ అని,,పుణ్యం అనీ ఏవో కారణాలు చెప్తారుకదా ఆ స్వర్గానికి అర్హత సాధించాలంటే ....ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది ఇప్పుడు...
" మా గోదావరి జిల్లాలో పుట్టాలన్నా,,పెరగాలన్నా,,ఉండాలన్నా ఏజన్మలోనో (?) పుణ్యం చేసుకుంటేనేగానీ ఆ అదృష్టం పట్టదు "అని....
ఏమంటారు?
- Kiran

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి