నాకు కొద్దిగా పరిచయం ఉన్న ఒకతను నాతో మాట్లాడుతూ మధ్యలో ఇలా అన్నాడు
" నేను లైఫ్లో సెటిల్ అయిపోయినట్లేరా,,భవిష్యత్తు గురించి కూడా బెంగేమీలేదు...అయితే నా ప్రస్తుత సమస్య ఏంటంటే " నేను మా ఆఫీస్లో పనిచేసే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను.ఆ అమ్మాయి కూడా వెల్ సెటిల్డే.పరస్పర అవగాహనతోనే మేమిద్దరమూ ప్రేమించుకుని ఇక పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాము.అయితే ఆ అమ్మాయి కులం నా కులం ఒకటి కాదు. మా విషయం తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా పెళ్ళి చెయ్యడానికి ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదురా...!!! " ఏం చెయ్యమంటావ్ ? " అని అడిగాడు నన్ను.
" పుట్టుకతోనే ఆ ఆ సంస్కారాలు వస్తాయి " అని నేనేమీ అనలేదు అతనితో,,కానీ " వ్యక్తిపై అతను పెరిగిన వాతావరణం తాలూకు ప్రభావం ఖచ్చితంగా పడి వ్యక్తిత్వాన్నైనా,,ఆలోచనలనైనా,అభిరుచులనైనా నిర్ణయిస్తుంది ఎంతో కొంత.ఒక్కో కులానికి ఒక్కో జీవన విధానం అలవడి ఉండడం వల్ల మీ మీ అభిప్రాయాలు,,అభిరుచులూ విషయంలో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందేమో ...పెళ్ళికి ముందు " ఒకరినొకరు అర్ధం చేసుకుని జీవించగలం " అనే నమ్మకం కలిగి ఉన్నా పెళ్ళి అయ్యాక వాస్తవిక జీవితంలో ఆ పొరపచ్చాలను తట్టుకోగలమా ? అని మీరు ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నారా ? అని అడిగాను నేను అతనిని.
" ఇవన్నీ ముందే మాట్లాడుకుని మేమీ నిర్ణయానికొచ్చాం " అన్నాడు వాడు.
" అయితే మీ పెద్దలను కూర్చోపెట్టి మెల్లిగా అసలు ఈ పెళ్ళి వద్దనడానికికల అభ్యంతరం ఏమిటో కనుక్కో? " వివాహబంధం విజయవంతంగా కొనసాగడానికి కావాల్సింది కులం కాదూ,,ఒకరిపట్ల మరొకరికి ఉండే నమ్మకం,,ఒకరినుంచి మరొకరు పంచి ఇచ్చుకునే ప్రేమ,,నీకు నేనున్నాను అని గట్టిగా ఇవ్వగల భరోసా,,ఇవీ.అంతేకానీ కులం ఏ విధంగా కలిపి ఉంచుతుంది ఇద్దరు వ్యక్తులని ఆదర్శదంపతులుగా? అని చెప్పి చూడు..అంతకీ ఒప్పుకోకపోతే తార్కికంగా ఇలా విడమర్చి ప్రశ్నించు వాళ్ళని.
" కులం అనేది ఏమిటి??? కార్యవిభాగమే కదా??? సమాజంలో వ్యక్తులకి కొన్ని కొన్ని భాద్యతలు అప్పగించి మొత్తం సమాజం అంతా సక్రమంగా నడిచేందుకు ఏర్పరుచుకున్న వ్యవస్థేగా కులం అంటే??ఆ కులంకూడా ఒక్కప్పుడు లక్షణాల బట్టి నిర్ణయించబడేది కానీ జన్మబట్టీ కాదు కదా?? కనుక ఆ అమ్మాయి మన ఆచారాలు, సాంప్రదాయాలు గౌరవించి పాటించేది అయితే ఇంకేంటి అభ్యంతరం??? అని అడగమన్నాను వాడిని. వాడు ఇలా వాళ్ళ ఇంట్లో చెప్పినా వాళ్ల పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదు.
కారణమేంటో చెప్పరు...ఈ పెళ్ళి వద్దు అనే మూర్ఖపు పట్టుదల పట్టుకు కూర్చున్నారు వాళ్లవాళ్ళు. వీళ్ళేకాదు...ప్రపంచంలో ఎంతో గొప్ప భౌతికవాదులుగా చెలామణీ అవుతున్న కొందరు పెద్దలను చూశాను నేను...ధనం ఉంది..పేరు ఉంది..వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లోనూ,,ఆచారాలలోనూ,జీవన విధానాలలోనూ మార్పువచ్చేసినా వాళ్ల పిల్లల,,బంధువుల పెళ్ళి చెయ్యాల్సి వస్తే కులాన్నే ప్రధాన కారణంగా చూస్తారేంటో...!!! కులంతాలుకు ఆనవాళ్ళేమీ వాళ్ళ జీవితాల్లోలేకపోయినా మరీ ప్రవర్తన ఎందుకో?
కులం అనేది ఇప్పుడో హోదాగా భావిస్తున్నరేమో,,,అందుకే తక్కువ కులం ఎక్కువ కులం అని లెక్కలు కట్టుకుని సమాజం ఏమంటుందో అని భయపడి ఇలా ప్రవర్తిస్తున్నారేమో....ఇలా ప్రతీ ఒక్కడూ సమాజానికి భయపడి భయస్తుల సమాజాన్ని నిర్మించుకోవట్లేదూ???ఒక్కడు మారినా ఎంతోకొంత ఈ విధానం మారుతుందికదా?అయినా ఇది ధర్మం ఇది అధర్మం అని సమాజం ప్రాతిపదికన లెక్కలు వేసుకుని బలవంతంగా ఎలా జీవిస్తాం మనం మనకి ఆనందం కలగనప్పుడు? (ముఖ్యంగా అందులో మనకి ఏ కష్టం లేకుండా ,, సమాజానికీ ఏ నష్టం కలగనప్పుడు కూడా )..
అందుకే ఇక " లేచిపోయి పెళ్ళి చేసుకోండి " అన్నాను వాళ్ళతో.
లోకాసమస్తా సుఖినోభవంతు,,,,,,
స్వస్తి _/\_
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి