సిగరెట్లు తాగడం,మందు కొట్టడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని నా అభిప్రాయం.....!!!
కొందరు " తమ మానసికపరమైన బాధలు మర్చిపోడానికి తాగుతున్నాం " అని అంటారు,
టీనేజ్లో పిల్లలు " త్రాగితే మేము కూడా పెద్దవాళ్ళము అయిపోయామని,తమకీ పెద్దరికం వచ్చేసిందని అనే మానసిక సంత్రుప్తి కోసం తాగుతారు....!!! "
వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే " తాగడం అవి కేవలం వారి ఆత్మనూన్యతను కప్పిపుచ్చుకోడానికి చేసే ప్రయత్నం మాత్రమే "
4 కుర్రవాళ్ళు బీర్ తాగుతూ ఉంటే తాగని వాడికేసి చూసి " ఏరా ! నువ్వు ఇంతవరకూ కనీసం ఒక్కసారి కుడా బీర్ తాగలేదా ? " అని అంటే ఆ నూన్యతని కప్పిపుచ్చుకోడానికి తాగడం మొదలెడతాడు ఆ కుర్రవాడు....!!!
తాగినప్పటినుంచీ " తానో అధికుడిని " అనే భ్రాంతిలో బతుకుతూ ఉంటాడు...!!!
అదీకాక ఆ వయసులో " ఈ సమాజం పెట్టిన నిబంధనలు అన్నీ అతిక్రమించెయ్యాలి " అనే అంతర్గతమైన ఓ కసి, చెడిపోవడంలో ఉండే థ్రిల్ల్ గొప్ప మానసిక ఆనందాన్ని ఇచ్చి వారిని వ్యసనాలకు అలవాటు చేసుకునేలా చేస్తాయి " అని భావిస్తున్నాను,
ఏదైమైనా " నేనూ చెడిపోగలను " అనే భావం అందరిముందూ ప్రకటించడానికి,అలా ప్రకటించుకోవడం గొప్పగా భావించుకోవడం వల్ల చాలమంది త్రాగుతూ ఉంటారు,ఈ విషయం వారికి తెలియదు.....!!!
' ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు పార్టీ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు,సరదాగా మా ఆనందానికి తాగుతున్నాం ' అని అనుకుంటే తాగడంలో తప్పు ఏమీ లేదు,
" కోరికని,అలవాట్లని నీ ఆధీనంలో ఉంచుకున్నంతసేపూ అందులో ఆనందం పొందడంలో తప్పులేదు,కాని ఎప్పుడైతే నువ్వు దాని ఆధీనంలో బానిసగా ఉంటావో అదే తప్పు "" అలవాటుని మించి కలిగే కొరికే వ్యసనం "
ఎప్పుడూ వ్యసనపరుడు కాకూడదు,
మందైనా,సిగరెట్ అయినా ఆనందాన్నే ఇవ్వాలి కాని విషాదాన్ని ఇవ్వకూడదు,అది కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.
అసలు " మందూ అవీ ఎందుకు తాగాలి ? " అని అడిగితే కొందరు ఇలా సమాధానం ఇస్తారు
" తాగినప్పుడు ఒక రకమైన మత్తు వస్తుంది, ఆ మత్తులో ఆలోచనలు రాని స్థితి వస్తుంది,అప్పుడు మాకు మా బాధలేం గుర్తుకు రావు,అందుకే మా మనశ్శాంతికోసం తాగుతున్నాం " అని అంటారు,
నిజంగా అలాంటి స్థితి కావాలంటే దానికోసం త్రాగడం కంటే ఒక గంట సేపు ధ్యానం చేస్తే మంచిది,అలాంటి స్థితి పొందవచ్చు....!!!
దానికోసం త్రాగి శరీరాన్ని ఎందుకు పాడుచేసుకోవడం?
అలానే సిగరెట్ అయినా అంతే, వచ్చే 7 నిముషాల మత్తుకోసం మన ఆరోగ్యాన్ని ఎందుకు పణంగా పెట్టడం?
సిగరెట్లోని కొన్ని పదార్ధాలు రక్తంలోని గ్లూకోజ్ ని కరిగింపచేసి ఇన్సులిన్ గా మార్చేస్తాయి,అందుకే సిగరెట్ తాగినప్పుడు కిక్క్ ఎక్కినట్లు అనిపిస్తుందట,అది మంచిదే అనుకుంటాం కాని అది డైరక్ట్గా మన నాడిమండలంపై ప్రభావం చూపిస్తుంది,
కనుక సిగరెట్ అంత ప్రమాదకరమైన వస్తువు మరొకటిలేదు ఈ ప్రపంచంలో....!!!
కనుక మీకు సిగరెట్ త్రాగే అలవాటు ఉంటే తక్షణమే మానెయ్యండి,
సిగరెట్ మానలేకపోతున్నం,మా వల్ల కావట్లేదు మానడం ఎలానో అని అంటే ఈ ట్రిక్ ట్రై చెయ్యండి.
" ఒక తెల్లని జేబురుమాలు తీసుకుని కిందపరిచి దానిపై మీరు సిగరట్ తాగుతున్నప్పుడు ఆ పొగను ఊదండి,అయ్యాక ఆ రుమాలును చూడండి,నల్లగా తయారయ్యి ఉంటుంది,దానిని చూసైనా మీకు " నా ఊపిరి తిత్తులు కూడా ఇలానే తయారవుతాయి " అనే భావం కలిగి ఆ అలవాటు మానుకోగలుగుతారు అని అనుకుంటున్నాను...!!!
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి