" గోరుతో చర్మాన్ని గీరితే ఏర్పడే చారలా , ఆకాశానికి కత్తితో గాటుపెట్టినట్లు అందంగా వెనకాల పొగను వదులుతూ ముందుకు పయనిస్తూ పోతోంది రాకెట్ "
చిన్నఫ్ఫుడు సాయంత్రంపూట ఇలానే వెల్లే రాకెట్ని చూసి ' ఆ రాకెట్ని ఏదో నేనే నడుపుతున్నంత సంబరంతో ' ' అదిగోరా రాకెట్ ,అటు చూడండి ' అని నేను నా ఫ్రెండ్స్కు చెప్పడం,
అది విని నా ఫ్రెండ్స్ ' ఒరెయ్ రాకెట్రా , హేయ్ రాకెట్ ' అంటూ పిచ్చిగా గెంతులు గెంతుతూ అల్లరి చెయ్యడం గుర్తొచ్చి అందాక నవ్వు వచ్చింది.
ఏదేమైనా బాల్యం చాలా గొప్పది కదూ?
అప్పుడు చేసిన పనులు ఇప్పుడెంతో సిల్లీగా అనిపించినా ఆ నిజం మనం ఒప్పుకుని తీరాలి.
లోకంలో కనిపించే ప్రతీది ఆశ్చర్యంతో పరికిస్తూ అవ్యక్తమైన ఆనందాన్ని,సంతోషాన్ని బహుశా మనం చిన్నతనంలోనే అనుభవించగలమేమో...!!!
అప్పుడు నవ్వే ప్రతీ నవ్వు కల్మషం ఎరుగనిది,స్వచ్చమైనది.
పలకరించే ప్రతీ పలకరింపు నిజాయితీతో ఉన్నదే..!!
చేసే ప్రతీ పనీ భవిషత్తు పట్ల భయంలేనిది...!!!
మనసు కూడా ఎలాంటి వైషమ్యాలు తెలియనిది....!!!!
మొత్తం ప్రపంచం అంతా ఎంతో ఆనందంతో నిండి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆసక్తి ఉండడం వల్ల.....!!!!!
తర్వాత జ్ఞానం పెరిగే కొద్దీ మనిషికి కృత్రిమత్వం అలవడుతూ ఉంటుంది,
మనసుపై ఒక పొర ఏర్పడి బయటకి ఒకలా,లోపల ఒకలా బతికే బతుకుతూ ఉంటారు,
నవ్వే ప్రతీ నవ్వు సహజమైనది కాదు.!
పలకరించే ప్రతీ పలకరింపు వెనకా ఇంకో మాట ఉండనే ఉంటుంది..!!
చేసే ప్రతీ పనికి విపరీతమైన సంకోచం,భయం పట్టుకుని ఉంటుంది...!!!
మనసంతా కలుషితంతో నిండిపోయి ఉంటుంది....!!!!
బతకాలంటే ఆసక్తి సన్నగిల్లి మన్నుతిన్న పాముల్లా,జడుల్లా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు,ఇక బతకడం అనవసరమని ఆత్మహత్యలు చెసుకుంటూ ఉంటారు.....!!!!!
ఎందుకీ జ్ఞానం???
జ్ఞానంతో " నిన్నటి నేను కన్నా ఈరోజు నేను గొప్పగా ఎలా ఉండాలి అనే ఆలోచన కలగాలి " కాని వ్యక్తిగా పతనం చెందడం ఎందుకు కలుగుతోందో మనుషులలో అర్దంకావట్లేదు...
అలా అని జ్ఞాన్నాన్ని ఆపలేం కదా?
ఏదేమైనా ఇదో క్లిష్టమైన వివాదం,ప్రశ్న కూడానూ....!!!
" ఉపయోగంలేదు " అని అనుకుంటే మనం మారేదీ ఏమీ లేదు,గట్టిగా అడిగితే సమధానం సరిగ్గా వివరించలేం కూడా దీనిగురించి...
ఏమంటారు?
- Kiran
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి