నా అదృష్టం ఏంటంటే నేను పడుకునే గది దగ్గరే నేను పెంచిన తోట ఉంటుంది.
ఆ గది కిటికీ దగ్గర ఒక గోరింటాకు చెట్టు, ఒక దానిమ్మ చెట్టు ఉంటాయి,
దానిమ్మ చెట్టుకి ఒక పిచుక జంట గూడు కట్టుకుని ఉంటున్నాయి,
ఉదయం ఐదు గంటలకే వాటి అరుపులతో చక్కగా మెలుకువ వచ్చేస్తోంది,
నిద్ర లేచి ఒకప్పుడు 2 కిలో మీటర్లు నడిచేవాడిని ఆహ్లాదమైన ప్రకృతి అందం చూడటంకోసం,
కానీ ఇప్పుడంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏం ఉండట్లేదు నాకు,
నా తోటలోనె బోలెడు మొక్కలున్నాయి, జామ, అరటి ,మామిడి,వేప,కరివేపాకు చెట్లు ఉన్నాయి.
అది కాక చూసిన వెంటనే ఆహ్లాదం ఇచ్చే కనకాంబరాలు,దేవకాంచనాలు,చంద్రకాంతం మొక్కలు, విచ్చిన మందారం పువ్వులు ఇలా రకరకాల పూల మొక్కలు ఎంతో మంచి ఉదయాన్ని ఆస్వాదిస్తున్న అనుభూతిని పంచుతున్నాయి నాకు.
ఆ పూల మొక్కల మీద వాలే తుమ్మెదలు,సీతాకోకచిలుకలు. చెట్లపై చేరి తమ అల్లరిని చూపే రకరక పక్షులు ఇవన్ని గొప్ప ఉత్సాహాన్ని ఇస్తున్నాయి నాకు.
నా ఈరకమైన ప్రవర్తన అంతా యండమూరి గారి రచనల ప్రభావం నా మీద ఉండడం వల్లనే అని అనుకుంటాను.
ఆయన పుస్తకంలో ఒక చోట ఇలా ఉంటుంది.
" ఉదయాన్నే 7 గంటల వరకూ పక్కమీద బద్దకంగా పడుకుని ఎంత బాగుందో జీవితం అని అనుకోడానికి, తెల్లరే 5 గంటలకి లేచి అప్పుడే మేలుకుంటున్న ప్రకృతిని చూస్తూ నడుస్తూ ఇంత బాగుంటుందా జీవితం అని అనుకోడానికీ చాలా తేడా ఉంది " అని.
ఆ వాక్యం ఎంతో నిజం,ఆ మార్పు స్పష్టంగా నాకు తెలిసి వస్తోంది....!!!
శుభోదయం :) :) :)
- Kiran

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి