అబ్బబ్బా!!!! ఎంత అందంగా కురుస్తోందో వెన్నెల ఇప్పుడు బయట !!! చూడండోసారి బయటకెళ్ళి.
సమస్త జగత్తుకూ ఆహ్లాదం పెంచేలా,రాత్రి చీకటిని పారద్రోలడానికి తూర్పుదిశన ఉదయించిన చందుడిని చూడండోసారి... మొగలుపూలు విచ్చినట్లు ప్రాగ్దిశనుంచి తన వెన్నెల యొక్క తొలిరేకులు విప్పుతూ చంద్రుడు నవ్వుతున్నాడు చూశారా?
ఆకాశంలో కొన్ని వేల గొబ్బి పూలు చల్లారేమో అన్నంత అందంగా మెరిసిపోతున్నాయి నక్షత్రాలు అన్నీ..
ఈ లేత వెన్నెల వెలుగూ,, నక్షత్రయుక్తమైన ఈ రాత్రి ఎంత బాగుందో అని వివరిద్దామంటే నా భావానికి తగిన బాష దొరకట్లేదు.
అందుకే కాస్త మన అల్లసాని పెద్దనగారిని సాయం తీసుకుంటున్నాను.
ఆయన రాసిన " మనుచరిత్ర "లో ఓచోట ఇలా ఉంటుంది.
" శశాంకుడు తన శత్రువైన భాస్కరుడిపై దాడిచేసి, అతన్ని తరిమికొట్టి చివరికతని భార్య అయిన ఛాయాదేవిని చెరపట్టి తెచ్చుకున్నట్లు ఉంది చంద్రునిలోని నల్లటి మచ్చ.
జగత్తులో నల్లటి వస్తువులన్నిటినీ తెల్లగా చెయ్యగలిగే వెన్నెల నీడలను మాత్రం అలా చెయ్యలేకపోయింది... అందువల్ల ఎంతో దుఃఖం కలిగినట్లుగా వెన్నెల మంచిబిందువులను రాల్చింది " అని.
బాగుంది కదా ఈ వర్ణన?
శుభరాత్రి :) :) :)
- Kiran

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి