02 మార్చి, 2016

కళాపూర్ణోదయం



ఈ రోజు " పింగళి సూరనామాత్యుడు " రచించిన " కళాపూర్ణోదయం " చదివాను.

 అబ్బబ్బా...!!! ఎంతబాగుందో ఈ పుస్తకం. ఒక అద్భుత కల్పిత కధాకావ్యం ఈ కళాపూర్ణోదయం.

 నేను చాలా ప్రబంధాలే చదివాను.
 చదివాక ఎప్పుడూ ఒక విషయం లోటుగా అనిపించేది నాకు. " అసలు కధని పెద్దగా పట్టించుకోకుండా ఎక్కువ వర్ణనలే ఉన్నాయేంటి ఈ పుస్తకాలలో? " అని.

 ఉదాహరణకి శ్రీకృష్ణ దేవరాయలు రాసిన " ఆముక్తమాల్యద " చూడండి,అద్భుత కావ్యమే,ఎవరూ కాదనలేని సత్యం అది.కాని వర్ణనలు కధని మించేసినట్లు ఉండడం వల్ల అసలు కధ పెద్ద పసలేనట్లుగా,,ఆసక్తి లేనట్లు తోస్తుంది ఆ వర్ణనలతో పోలిస్తే ...!!!

 కాని కళాపూర్ణోదయం అలాంటి రచన కాదు.

 సూరనామాత్యుడు ఈ కధని 8 ఆశ్వాసాలుగా రచించిన తీరు చూస్తే అత్యధ్భుతమైనదిగా కనిపిస్తుంది,నవలలా కధ ప్రధానంగా అనేక నాటకీయ పరిణామాలు,సంఘటనలు చాలా చమత్కారంగా కలిపించి ఆ కారణాలు తరవాత చూపి త్రుటికాలంలో పాత్రలు,సంభాషణలను మారుస్తూ గొప్ప ఇంద్రజాలం చేసేశాడు.

 ఆహా ! ఎంతటి ప్రజ్ఞ ! ఎంతటి వైదుష్యం ! అని తప్పకుండా అనుకుంటాడు చదివిన ప్రతీ పాఠకుడూ,

 సాహిత్యంపై ఆసక్తీ,అభిమానం ఉన్న ప్రతీఒక్కరూ తప్పకుండా చదవాల్సిన రచన ఇది.

 శుభసాయంత్రం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి