02 మార్చి, 2016

వెన్నెలలో ఆడపిల్ల




" నడుస్తూంటే దూరంగా మసక మసక వెన్నెలలో కుప్పలా శివాలయం.

ఏటి ఒడ్డున నీటిపూవు లాంటి జీవితాన్ని స్వప్నం నుంచి వేరు చేస్తున్నట్టూ క్షితిజరేఖ.

వెలుగురేఖలని వెదజల్లుతూ తూర్పు ముఖాన్ని ఎరుపు చేస్తున్న ఆకాశం.

ఆ నీరవంలో జంటగా పాటపాడే భరద్వాజ పక్షులు, మాస్టారూ ! జీవితానికెంత అందమైన విలువ ఉందో కదూ?

ఒంటరి నక్షత్రాన్ని తీసుకుని గుడికి వెళ్తూంటే గుండెలనిండా ఓంకారమే...!!!"

నాకెంతో ఇష్టమైన పుస్తకాలలో ఒకటైన " వెన్నెలలో ఆడపిల్ల " పుస్తకంలోని వాక్యాలు ఇవి.

యండమూరి గారు రాసిన ఈ పుస్తకంలో భావుకత్వం చాలా బాగుంటుంది..!!!

యండమూరి గారు ఎంతటి విలక్షణమైన రచయితో ప్రత్యెకించి చెప్పకర్లేదు కదా? అది ఆయన పుస్తకాలు చదివిన ఎవరికైన సుపరిచితమైన విషయమే...!!!

ఇంతకీ " వెన్నెలలో ఆడపిల్ల " పుస్తకం చదివారా? చాలా బాగుంటుంది కదూ?

చదవకుంటే తప్పక కొని చదవండి,అద్భుతమైన పుస్తకం అది.

శుభరాత్రి :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి